తెలుగు న్యూస్  /  National International  /  Tickets Refund Delay: Us Directs Air India To Pay 121.5 Mln Dollars To Passengers; Slaps 1.4 Mln Dollars Fine

US directs Air India: 121 మిలియన్ డాలర్లు చెల్లించండి; ఎయిర్ ఇండియాకు యూఎస్ షాక్

HT Telugu Desk HT Telugu

15 November 2022, 22:30 IST

  • US directs Air India: రద్దు చేసిన విమాన టికెట్ల ధరను తిరిగి చెల్లించే విషయంలో నెలకొన్న జాప్యంపై అమెరికా భారత విమాన యాన సంస్థ ఎయిర్ ఇండియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. భారీ మొత్తంలో జరిమానా విధించి షాక్ ఇచ్చింది. 

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

US directs Air India: టాటా యాజమాన్యంలోకి ఇటీవలనే వచ్చిన ఎయిర్ ఇండియా సంస్థ కు అమెరికా షాక్ ఇచ్చింది. యూఎస్ ప్రయాణీకులకు 121.5 మిలియన్ డాలర్లను వెంటనే చెల్లించాలని ఆదేశించింది.

US directs Air India: టికెట్ కేన్సిలేషన్ డబ్బులు

వివిధ కారణాలతో విమానాలు రద్దైన సందర్భాల్లో విమానయాన సంస్థలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడమో, లేదా ప్రయాణీకుల డబ్బును తిరిగివ్వడమో చేస్తాయి. అలా ఎయిర్ ఇండియా అమెరికా ప్రయాణీకులకు చెల్లించాల్సిన రీఫండ్ పై జాప్యం కొనసాగుతుండడంపై అమెరికా స్పందించింది. వెంటనే 121.5 మిలియన్ డాలర్ల రీ ఫండ్ మొత్తం తో పాటు 1.4 మిలియన్ల జరిమానాను వెంటనే చెల్లించాలని ఆదేశించింది. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి సమయంలో అనూహ్య లాక్ డౌన్ ల కారణంగా ఎక్కువగా విమానాలు రద్దు అయ్యాయి. ఎయిర్ ఇండియాతో పాటు మొత్తం ఆరు ఎయిర్ లైన్స్ అమెరికా ప్రయాణీకులకు రీఫండ్ మొత్తం బాకీ ఉన్నాయని, ఆ మొత్తం దాదాపు 600 మిలియన్లు ఉంటుందని అమెరికా రవాణా శాఖ అధికారి ఒకరు వెల్లడించారు.

US directs Air India: టాటాలపై భారం

ఈ రీఫండ్ బాకీ టాటా గ్రూప్ ఎయిర్ ఇండియా నిర్వహణ బాధ్యతలను తీసుకోకముందు కనుక, ఈమొత్తం చెల్లింపుపై టాటా గ్రూప్ ఎలా స్పందిస్తుందనేది సస్పెన్స్ గా మారింది. అంతకుముందు కూడా, ప్రయాణీకుల అభ్యర్థనపైననే రీఫండ్ ఇవ్వడమనేది ఎయిర్ ఇండియా పాలసీ గా ఉండేది.

US directs Air India: 1900 ఫిర్యాదులు

ఎయిర్ ఇండియాపై దాదాపు 1900 రీఫండ్ ఫిర్యాదులు ఉన్నాయి. వాటిలో దాదాపు సగానికి పైగా ఫిర్యాదులను పరిష్కరించడానికి ఎయిర్ ఇండియా వందరోజులకు పైగా సమయం తీసుకుంది.