తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Deaf Mute Couple : మనసు దోచే దివ్యాంగ దంపతుల 'పానీపూరీ స్టాల్​' కథ!

Deaf Mute Couple : మనసు దోచే దివ్యాంగ దంపతుల 'పానీపూరీ స్టాల్​' కథ!

Sharath Chitturi HT Telugu

18 October 2022, 11:19 IST

    • Deaf Mute Couple runs pani puri stall : నాసిక్​కు​ చెందిన ఓ పానీపూరీ స్టాల్​ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఈ స్టాల్​ని దివ్యాంగ దంపతులు నడుపుతున్నారు. ఈ తరం వారికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
మనసు దోచే దివ్యాంగ దంపతుల 'పానీపూరీ స్టాల్​' కథ!
మనసు దోచే దివ్యాంగ దంపతుల 'పానీపూరీ స్టాల్​' కథ!

మనసు దోచే దివ్యాంగ దంపతుల 'పానీపూరీ స్టాల్​' కథ!

Deaf Mute Couple runs pani puri stall : జీవితంలో అన్నీ ఉన్నా.. ఏదో ఒక విషయంలో గొడవ పడే భార్యాభర్తలు ఎందరో ఉంటారు. అది లేదు, ఇది లేదు అంటూ నిత్యం తిట్టుకుంటూ ఉంటారు. కానీ.. మనలో ఎన్ని లోపాలు ఉన్నా.. అర్థం చేసుకునే వారు మన పక్కన ఉంటే, జీవితం ప్రశాంతంగా ఉంటుందని నిరూపించారు దివ్యాంగ దంపతులు. వీరి 'పానీపూరీ స్టాల్​' ఇప్పుడు నెట్టింట వైరల్​గా మారింది.

ట్రెండింగ్ వార్తలు

Covid vaccine: సేఫ్టీ ఇష్యూస్ కారణంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఉపసంహరించుకోనున్న ఆస్ట్రాజెనెకా

Haryana: హరియాణాలో సంక్షోభంలో బీజేపీ సర్కారు; అసెంబ్లీలో మారిన సంఖ్యాబలం

US crime news: ‘‘డాడీకి గుడ్ బై చెప్పు’’ - మూడేళ్ల కొడుకును షూట్ చేసి చంపేసిన కర్కశ తల్లి

Dhruv Rathee: ధృవ్​ రాఠీ: సోషల్ మీడియా సంచలనం.. మోదీనే ఎందుకు టార్గెట్ చేశారు?

ఈ తరం వారికి స్ఫూర్తిదాయకంగా..

ఈ పానీపూరీ స్టాల్​కు సంబంధించిన వీడియోను 'స్ట్రీట్​ ఫుడ్​ రెసిపీస్​' అనే ఇన్​స్టాగ్రామ్​ పేజ్​లో అప్లోడ్​ చేశారు. ఈ పానీపూరీ స్టాల్​.. నాసిక్​ అడ్గాన్​ నాకాలోని జత్రా హోటల్​కు సమీపంలో ఉంది. ఈ స్టాల్​ను దివ్యాంగ దంపతులు నిర్వహిస్తున్నారు. వారిద్దరు చెవిటి, మూగ వాళ్లు! 'లోపాలుంటే ఏంటి? మేము సంతోషంగా జీవిస్తున్నాము,' అని వారి చర్యల ద్వారా అందరికి తెలియజేస్తున్నారు.

Deaf Mute Couple pani puri stall viral video : ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. వీడియోలో.. ఓ వ్యక్తి ఆ పానీపూరీ స్టాల్​ వద్దకు వెళతాడు. ఆ దంపతులు.. ఆ వ్యక్తితో సైగల ద్వారా ఏం కావాలో అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత పానీపూరీ చేసి ఇస్తారు. ఆ పానీపూరీ స్టాల్​ చాలా క్లీన్​గా కూడా ఉంది. చివరికి.. చూస్తేనే నోరు ఊరిపోయే విధంగా ఉన్న పానీపూరీలను ఆ వ్యక్తికి ఇస్తారు.

అంతేకాకుండా.. వీరి వద్ద అన్నీ 'హోం మేడ్​' పదార్థాలే ఉంటాయి. పూరీల దగ్గర నుంచి మసాలా వరకు.. అన్నీ ఇంట్లోనే తయారు చేస్తారు వీరు.

"ఇది మీ హృదయాలను కరిగిస్తుంది. మీ ముఖం మీద చిరునవ్వును తెప్పిస్తుంది. లోపాలను ఛేదించి, దివ్యాంగ దంపతులు పానీపూరీ స్టాల్​ని నడుపుతున్నారు. అంతా ఇంట్లోనే తయారు చేసి తీసుకొస్తారు. స్టాల్​ని చాలా క్లీన్​గా ఉంచుకుంటుండటం నాకు బాగా నచ్చింది. ఈ తరం వారికి ఈ జంట స్ఫూర్తినిస్తుంది," అని పోస్టు కింద క్యాప్షన్​లో రాసుకొచ్చారు.

Nashik viral video : ఈ వీడియోకు ఇప్పటికే 3.7మలియన్​కు పైగా వ్యూస్​ వచ్చాయి. వీడియో చూసిన వారందరు ఆ దంపతులను ప్రశంసిస్తున్నారు.

"కచ్చితంగా వీరి దగ్గరికి వెళ్లాలి," అని ఓ నెటిజన్​ కామెంట్​ పెట్టారు. "ఈ వీడియో చూశాక చాలా సంతోషం కలిగింది," అని మరొకరు రాసుకొచ్చారు. "అన్నీ ఉన్నా చాలా మంది దంపతులు గొడవపడుతూ ఉంటారు. వీరిలో లోపాలు ఉన్నా.. కలిసిమెలిసి ఉంటున్నారు. గాడ్​ బ్లెస్​ థెమ్​," అని ఓ వ్యక్తి కామెంట్​ పెట్టారు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన వీడియోను ఇక్కడ చూడండి: