తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  I-t 'Survey' At Bbc Offices: ‘‘ఒకరోజు దేశంలో మీడియా అనేదే లేకుండా పోతుంది’’

I-T 'survey' at BBC offices: ‘‘ఒకరోజు దేశంలో మీడియా అనేదే లేకుండా పోతుంది’’

HT Telugu Desk HT Telugu

15 February 2023, 17:15 IST

  • I-T 'survey' at BBC offices: భారత్ లోని బీబీసీ (BBC) కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ సర్వే జరపడంపై పలు విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఇలాంటి పనులు పత్రికా స్వేచ్ఛకు విఘాతమని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ఒక రోజు దేశంలో మీడియా అనేదే లేకుండా పోతుందని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమత బెనర్జీ (Mamata Banerjee) ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మమత బెనర్జీ (ఫైల్ ఫొటో)
మమత బెనర్జీ (ఫైల్ ఫొటో) (HT_PRINT)

మమత బెనర్జీ (ఫైల్ ఫొటో)

I-T 'survey' at BBC offices: భారత్ లోని బీబీసీ (BBC) కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ సర్వే జరపడంపై తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ (West Bengal Chief Minister Mamata Banerjee) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాపై ఇలాగే దాడులు కొనసాగితే.. ఏదో ఒకరోజు దేశంలో మీడియా అన్నదే లేకుండా పోతుందని ఆమె మండిపడ్డారు.

ట్రెండింగ్ వార్తలు

Unnatural intercourse: ‘‘భార్యతో అసహజ పద్దతుల్లో శృంగారం చేయడం రేప్ కిందకు రాదు’’ - ఎంపీ హైకోర్టు

NEET UG 2024: రేపే నీట్ యూజీ 2024 పరీక్ష; డ్రెస్ కోడ్ ఉంది, షూస్ వేసుకోవద్దు; గమనించండి..

Japan rice balls : చంకలో పెట్టి.. చెమటతో తయారు చేసిన ఈ ఫుడ్​ని ఎగబడి తింటున్నారు!

Heatwave alert : తెలుగు రాష్ట్రాల్లో ఇంకొన్ని రోజుల పాటు భానుడి భగభగలు- ఆ తర్వాత భారీ వర్షాలు!

I-T 'survey' at BBC offices: బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సర్వే

పన్ను ఎగవేత, ఆదాయం అక్రమం మళ్లింపు తదితర ఆర్థిక అవకతవకల ఆరోపణలపై భారత్ లోని ముంబై, ఢిల్లీల్లో ఉన్న బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (BBC) ఆఫీసుల్లో ఆదాయ పన్ను అధికారులు సర్వే (Income Tax survey) చేపట్టారు. మంగళవారం ఉదయం ప్రారంభమైన ఈ సర్వే బుధవారం కూడా కొనసాగుతోంది. ఈ సందర్భంగా టాక్స్ (Tax) వంటి కీ వర్డ్స్ (key words) ఆధారంగా ఆ కార్యాలయాల్లోని కంప్యూటర్లలో ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆధారాల కోసం వెతుకుతున్నారు. 2002 నాటి గుజరాత్ మారణహోమం (Gujarat riots 2002) లో నాటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బీబీసీ (BBC) రూపొందించిన డాక్యుమెంటరీ తీవ్ర సంచలనం సృష్టించిన నేపథ్యంలో బీబీసీ (BBC) ఆఫీసులపై ఈ సర్వే (I-T 'survey' at BBC offices) జరగడం గమనార్హం.

I-T 'survey' at BBC offices: చాలా దురదృష్టకరం

ఈ దాడులపై భారత్ లోని విపక్ష పార్టీలు స్పందించాయి. సర్వే (Income Tax survey) పేరుతో అంతర్జాతీయ మీడియా సంస్థను భయాందోళనలకు గురి చేయడం పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించడమేనని మండిపడ్డాయి. బీబీసీ (BBC) ఆఫీసులు లక్ష్యంగా చేపట్టిన చర్యలు దురదృష్టకరమని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ (Mamata Banerjee) వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీ (BJP) ప్రభుత్వం చేపట్టిన రాజకీయ కక్ష సాధింపు (political vendetta) చర్యల్లో ఇది కూడా ఒక భాగమని, తమ కక్ష సాధింపులో మీడియాను కూడా బీజేపీ (BJP) వదలడం లేదని ఆరోపించారు. ‘ఇప్పటికే మెజారిటీ మీడియాను వారు (BJP) నియంత్రిస్తున్నారు. ఎవరైనా వ్యతిరేకంగా నోరెత్తితే, 24 గంటల్లోపే ఆ మీడియా సంస్థపై కక్ష సాధింపు ప్రారంభిస్తున్నారు’ అని ఆమె (West Bengal Chief Minister Mamata Banerjee) విమర్శించారు. బీజేపీ (BJP) ని హిట్లర్ తో పోలుస్తూ, నియంతృత్వంలో హిట్లర్ ను కూడా బీజేపీ మించిపోయిందని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రజా తీర్పును కాకుండా, నియంతృత్వాన్నే విశ్వసిస్తోందన్నారు. బీబీసీ (BBC) కి Mamata Banerjee తన సంఘీభావం తెలిపారు.

I-T 'survey' at BBC offices: న్యాయ వ్యవస్థను కూడా..

దేశంలోని న్యాయవ్యవస్థ పై కూడా నియంత్రణను బీజేపీ కోరుకుంటోందని మమత (West Bengal Chief Minister Mamata Banerjee) విమర్శించారు. ‘‘దేశాన్ని కాపాడగలిగేది ఇప్పుడు న్యాయవ్యవస్థ మాత్రమే. దాన్ని కూడా నియంత్రించాలని అనుకుంటున్నారు. జ్యూడీషియరీ తటస్థంగా లేకపోతే చాలా అనర్ధాలు జరుగుతాయి’’ అన్నారు.