BBC reacts to IT 'survey': ఆదాయ పన్ను శాఖ సర్వేపై బీబీసీ రియాక్షన్..-bbc reacts to income tax survey at delhi mumbai offices we hope to have ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bbc Reacts To It 'Survey': ఆదాయ పన్ను శాఖ సర్వేపై బీబీసీ రియాక్షన్..

BBC reacts to IT 'survey': ఆదాయ పన్ను శాఖ సర్వేపై బీబీసీ రియాక్షన్..

HT Telugu Desk HT Telugu
Jan 08, 2024 08:23 PM IST

BBC reacts to IT 'survey': భారత్ లోని ఢిల్లీ, ముంబైల్లో ఉన్న తమ ఆఫీసుల్లో ఆదాయ పన్ను శాఖ (Income Tax Department) అధికారులు సర్వే నిర్వహించడంపై బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (BBC) స్పందించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (AP)

BBC reacts to IT 'survey': భారత్ లోని బీబీసీ (BBC News) కార్యాలయాల్లో మంగళవారం ఆదాయ పన్ను శాఖ (Income Tax Department) అధికారులు సర్వే నిర్వహించారు. మొదట బీబీసీ (BBC) ఆఫీసులపై ఐటీ దాడులు అనే వార్త ఒక్కసారిగా వైరల్ అయింది. దీనిపై ఐటీ అధికారులు (Income Tax Department) వివరణ ఇస్తూ ఇది పన్ను (tax evasion) ఎగవేతకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై చేస్తున్న సర్వే మాత్రమేనని స్పష్టం చేశారు.

yearly horoscope entry point

BBC reacts to IT 'survey': పూర్తిగా సహకరిస్తున్నాం..

ఈ ఐటీ Income Tax Department) సర్వే పై బీబీసీ (BBC reaction)) స్పందించింది. ముంబై, ఢిల్లీల్లోని తమ కార్యాలయాల్లో సిబ్బంది ఈ సర్వేకు పూర్తిగా సహకరిస్తున్నారని, ఆదాయ పన్ను అధికారులు అడిగిన సమాచారాన్ని ఇస్తున్నారని వివరించింది. త్వరలోనే ఈ సమస్య పరిష్కారమై, విషయం సద్దు మణుగుతుందని ఆశిస్తున్నామని ట్విటర్ (Twitter) లో వ్యాఖ్యానించింది. ‘ఆదాయ పన్ను అధికారులు ప్రస్తుతం మా ఢిల్లీ, ముంబై ఆఫీసుల్లో ఉన్నారు. వారికి మేం పూర్తిగా సహకరిస్తున్నాం. ఈ సమస్య సాధ్యమైనంత త్వరగా పరిష్కారమవుతుందని ఆశిస్తున్నాం’ అని బీబీసీ (BBC) ట్వీట్ చేసింది.

BBC reacts to IT 'survey': పన్ను ఎగవేత ఆరోపణలపై..

పన్ను ఎగవేతకు (tax evasion) సంబంధించిన ఆరోపణలపై ఈ సర్వే చేస్తున్నామని ఆదాయ పన్ను శాఖ (Income Tax Department) అధికారులు తెలిపారు. ‘‘ పన్ను ఎగవేతకు సంబంధించి వచ్చిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఈ సర్వే జరుగుతోంది. సర్వే పూర్తయిన తరువాత అవకతవకలు జరిగాయా ? లేదా? అనే విషయం తేలుతుంది. అనంతరం, ఆ సమాచారం ఆధారంగా తదుపరి చర్యలుంటాయి’’ అని ఒక ఆదాయ పన్ను అధికారి ‘హిందుస్తాన్ టైమ్స్ (HT)’ కు తెలిపారు. బీబీసీ (BBC) ఆఫీసుల్లోనే సర్వే జరుగుతోందని, డైరెక్టర్స్, లేదా ప్రమోటర్స్ ఇళ్లల్లో సర్వే చేయడం లేదని వివరించారు.

BBC reacts to IT 'survey': 2002 గుజరాత్ అల్లర్లపై డాక్యుమెంటరీ..

కాగా, 2002లో గుజరాత్ లో జరిగిన మారణహోమం (Gujarat riots) పై ‘ఇండియా: ద మోడీ క్వశ్చన్’ (India: The Modi Question) పేరుతో బీబీసీ (BBC) రెండు భాగాలుగా రూపొందించిన డాక్యుమెంటరీ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఆ డాక్యుమెంటరీ ప్రధాని మోదీ (PM Modi) ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని, 2002 అల్లర్ల సమయంలో గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ (Narendra Modi) పాత్రను ప్రశ్నించేలా ఉందని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీబీసీ (BBC) ని భారత్ లో నిషేధించాలని సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో భారత్ లోని BBC కార్యాలయాలపై ఐటీ సర్వే పేరుతో అధికారులు తనిఖీలు చేపట్టడం సంచలనంగా మారింది.

Whats_app_banner