Thailand black noodles : నల్ల రంగులో ‘నూడుల్స్’.. చూస్తేనే వికారం! ఎలా తింటారో?
18 February 2023, 10:47 IST
- Thailand black noodles viral video : సాధారణంగా.. తెల్లరంగులో ఉన్న నూడుల్స్ చూస్తూనే ఉంటాము. మరి నల్ల రంగులో నూడుల్స్‌ను ఎప్పుడైనా చూశారా? ఆ బ్లాక్ నూడుల్స్‌తో వంట చేస్తే ఎలా ఉంటుంది?
నల్ల రంగులో ‘నూడుల్స్’..
Thailand black noodles viral video : ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా వింత వింత వంటకాలు వైరల్‌గా మారుతున్నాయి. ఈ జాబితాలోకి 'బ్లాక్ నూడుల్స్' చేరింది! నూడుల్స్ అంటే తెల్లరంగు గుర్తొస్తుంది. కానీ థాయ్‌లాండ్‌లో నల్ల రంగులో ఉన్న నూడుల్స్‌ను వంటలో వినియోగిస్తున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇది చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
నల్ల రంగులో నూడుల్స్..!
ఇన్‌స్టాగ్రామ్‌లో 'అవర్ కలెక్షన్' అనే అకౌంట్ ఈ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో థాయ్‌లాండ్‌లో తీసినది. ఓ మహిళ.. తొలుత పెనం మీద బ్లాక్ నూడుల్స్ వేసింది. దాని మీద ఉప్పు చల్లింది. కూరగాయలు, ఇతర పదార్థాలు వేసింది. పెనంపై వాటిని వేయించడం మొదలుపెట్టింది. ఈ బ్లాక్ స్పెగెట్టీతో ఆ మహిళ పాస్తా చేస్తున్నట్టు తెలుస్తోంది. పాస్తా సిద్ధమైనప్పుడు.. మరిన్ని పదార్థాలు మిక్స్ చేసి, వాటిని ఓ ప్లేట్లో పెట్టింది.
Black noodles viral video : చూడటానికి ఇదంతా సాధారణంగా, బాగానే ఉన్నా.. ఆ నూడుల్స్ రంగు చూస్తేనే కాస్త వింతగా, వికారంగా ఉంది. "యునీక్ స్ట్రీట్ ఫుడ్ ఆఫ్ థాయ్‌లాండ్" అని క్యాప్షన్ ఇచ్చింది ఈ ఇన్స్టాగ్రామ్ ఛానెల్. ఫిబ్రవరి 1న పోస్ట్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే 50లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి.
సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన దృశ్యాలను ఇక్కడ చూడండి :
నెటిజన్లు షాక్..
ఈ బ్లాక్ నూడుల్స్‌ను చూసిన చాలా మంది షాక్‌కు గురవుతున్నారు.
Thailand viral video : "మార్వెల్‌లోని వెనమ్ క్యారెక్టర్ గుర్తుందా? ఈ నూడుల్స్.. వెనమ్‌ను గుర్తుచేస్తోంది," అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా.. 'ఇది తినడం అసాధ్యం. అసలు ఎలా తింటారో ఇలాంటివి. చాలా కష్టం,' అని మరొకరు రాసుకొచ్చారు.
"ఇది నూడుల్స్ ఆఆ? నేను పురుగులు అనుకున్నా.. వండుతుంటే ఇంకా కదలడం లేదేంటి? అని అనుకున్నాను," అని మరో నెటిజన్ ఫన్నీ కామెంట్ చేశారు. 'వికారం వస్తోంది,' అని ఇంకొకరు అభిప్రాయపడ్డారు. “చాలా రుచికరమైన వంట ఇది. అస్సలు మిస్ అవ్వకూడదు,” అని ఇంకో వ్యక్తి రాసుకొచ్చారు.
Black noodles Thailand : ఈ వీడియో బ్యాంకాక్‌లో తీసినట్టు తెలుస్తోంది. ఇలాంటి వీడియోలు తరచూ వైరల్‌గా మారుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో ఇవి చక్కర్లు కొడుతున్నాయి.