Noodles viral video : నూడుల్స్‌ను ఇలా తయారు చేస్తారా? ఈ వీడియో చూస్తే ఇంకెప్పుడు తినరు!
Noodles viral video : స్ట్రీట్ సైడ్ ఫుడ్‌లో నూడుల్స్‌కు మాములు క్రేజ్ ఉండదు! మరి ఈ నూడుల్స్‌ను ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా? ఈ వీడియో చూసిన తర్వాత.. నూడుల్స్ తినాలంటే మీరు చాలా ఆలోచిస్తారు మరి..!
Noodles viral video : 'పురుషులందు పుణ్యపురుషులు వేరయా' అన్నట్టు.. 'స్ట్రీట్ ఫుడ్స్నందు నూడుల్స్‌తో చేసే ఐటెమ్స్ వేరయా' అంటూ.. రకరకాల నూడుల్స్‌ను లాగించేస్తూ ఉంటారు ఫుడ్ లవర్స్. స్ట్రీట్ సైడ్ ఫుడ్ అంటేనే ఆరోగ్యానికి మంచిది కాదు. ఇక రోడ్ సైడ్ చేసే చైనీస్ హక్కా నూడల్స్ ఇంకా ప్రమాదకరం! ఈ నూడుల్స్ క్వాలిటీ కొన్నిసార్లు అస్సలు బాగోదు. కానీ నోటిని అదుపు చేసుకోలేక తెగ తినేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు.. రోడ్ సైడ్ వినియోగించే నూడల్స్కు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ షాకింగ్ వీడియో చూసిన తర్వాత.. ఈ స్ట్రీట్ ఫుడ్‌ను తినాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు మరి!
నూడుల్స్‌ను ఇలా తయారు చేస్తారా?
ఓ నూడుల్స్ తయారీ చేసే ఫ్యాక్టరీలో ఈ వీడియో తీశారు. దీనిని చిరాగ్ బర్జాత్యా అనే ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేశాడు. "చివరిగా మీరు షెజ్వాన్ సాస్‌తో కలిపిన రోడ్ సైడ్ చైనీస్ హక్కా నూడుల్స్‌ను ఎప్పుడు తిన్నారు?" అని కాప్షన్ ఇచ్చాడు.
Noodles making process : ఈ వీడియోలో.. కొందరు నూడుల్స్‌ను తయారు చేస్తూ కనిపించారు. పిండి పదార్థాలను మెషిన్లో వేయడం, వాటిని కంటైనర్‌లోకి పెట్టడం, తర్వాత బాయిల్ చేయడం, ఆరబెట్టడం వంటి పనులు చేశారు. నూడల్స్ తయారీ చేసే ప్రక్రియ బాగానే ఉన్నప్పటికీ.. వారు తయారు చేసిన విధానమే ఆందోళనకరంగా ఉంది! ఎక్కడా పరిశుభ్రతను పాటించలేదు. చేతులకు గ్లౌజ్‌లు వేసుకోలేదు. కంటైనర్లు, మెషిన్లు చాలా దారుణంగా ఉన్నాయి. మట్టితో కూడిన ఫ్లోర్ మీద ఆ నూడుల్స్‌ను పడేస్తున్నారు. వీటినే స్ట్రీట్ ఫుడ్‌గా వినియోగిస్తూ ఉంటారు మరి!
నెటిజన్లు షాక్..!
సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోను చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. 'ఇంత పరిశుభ్రంగా నూడుల్స్‌ను తయారు చేస్తున్నారేంటీ?' అని కొందరు సెటైర్లు కూడా వేస్తున్నారు.
Noodles making viral video : "ఢిల్లీలోని అన్ని కిచెన్లలోనూ ఇదే విధంగా 100శాతం పరిశుభ్రత ఉంటుంది. మీరు తినే పానీపూరీ, కుల్చా, భేల్పూరీలను పెద్ద మొత్తంలో ఎలా తయారు చేస్తారో చూస్తే.. ఇక మీరు వాటిని తినడమే మానేస్తారు," అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. "ఈ నూడుల్స్‌ను రోడ్ సైడ్ ఫుడ్పాయింట్సే వినియోగిస్తాయని మీకు ఎలా తెలుసు? 5 స్టార్ హోటళ్లల్లో వినియోగించే నూడల్స్ను కూడా ఇలాగే తయారు చేస్తారేమో?" అని అనుమానం వ్యక్తం చేశారు మరో యూజర్. 'నేను నూడుల్స్ ఎప్పుడు తిన్నా.. నాకు కడుపులో నొప్పి వస్తుంది. ఇదే కారణం అన్నమాట,' అని ఓ నెటిజన్ పేర్కొన్నారు.
కొందరు మాత్రం.. ఈ వీడియోలోని ఫ్యాక్టరీని వెనకేసుకొస్తున్నారు. "నూడుల్స్‌ను బాయిల్ చేస్తే బ్యాక్టిరియా పోతుంది. హై టెంపరేచర్ ఆయిల్లో కుక్ చేస్తే బ్యాక్టీరియా పోతుంది. టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు," అని ఓ నూడుల్స్ లవర్ రాసుకొచ్చారు.
సామాజిక మధ్యమాల్లో వైరల్‌గా మారిన ఈ నూడుల్స్ వీడియోను ఇక్కడ చూడండి:
How are noodles made : ఈ వీడియో చూసిన తర్వాత.. మీరు నూడుల్స్ తింటారా? మానేస్తారా?
సంబంధిత కథనం