Egg Vermicelli Recipe | ఎగ్ నూడుల్స్ కాదు.. ఇది ఎగ్ వెర్మిసెల్లీ, తినాలనిపిస్తుంది మళ్లీ మళ్లీ! -egg vermicelli semiya an epic alternate dish to egg noodles here is the recipe in telugu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Egg Vermicelli Semiya, An Epic Alternate Dish To Egg Noodles, Here Is The Recipe In Telugu

Egg Vermicelli Recipe | ఎగ్ నూడుల్స్ కాదు.. ఇది ఎగ్ వెర్మిసెల్లీ, తినాలనిపిస్తుంది మళ్లీ మళ్లీ!

HT Telugu Desk HT Telugu
Dec 28, 2022 08:36 PM IST

Egg Vermicelli Recipe: ఎగ్ నూడుల్స్ కాదు.. ఇది ఎగ్ వెర్మిసెల్లీ, తినాలనిపిస్తుంది మళ్లీ మళ్లీ! ఎగ్ నూడుల్స్ మీరు చాలా సార్లు తినే ఉంటారు, కొత్తగా ఎగ్ వెర్మీసెల్లీ తిని చూడండి. రుచి మామూలుగా ఉండదు మరి.

Egg Semiya Recipe
Egg Semiya Recipe (Youtube screengrab)

మీరు ఎగ్ నూడుల్స్ చాలా సార్లు తినే ఉంటారు, మీకు ఎగ్ నూడుల్స్ తినడం బోర్ కొడితే, ఒకసారి ఎగ్ వెర్మిసెల్లి/ ఎగ్ సేమియా చేసుకొని తిని చూడండి. ఎగ్ సేమియా కూడా ఎగ్ నూడుల్స్‌ను పోలి ఉంటుంది, కానీ ఇది పూర్తిగా హోమ్ మేడ్ వంటకం. ఇంట్లో వెర్మిసెల్లీ ఉంటే పాయసం లేదా సేమియా ఉప్మా చేసుకునేవారు, ఇప్పుడు ఆ వెర్మిసెల్లీతో ప్రయోగాలు చేస్తూ సేమియా పులావ్, సేమియా కట్ లెట్స్ ఆపైన సేమియా దోశ, ఇప్పుడు ఎగ్ సేమియా వరకు వచ్చేశారు.

ఈ ఎగ్ సేమియా తయారీ విధానం కూడా అచ్ఛంగా ఎగ్ నూడుల్స్ తయారీ విధానాన్ని పోలి ఉంటుంది. అక్కడ నూడుల్స్ ఇక్కడ సేమియా అంతే తేడా, మిగతాదంతా సేమ్ టూ సేమ్. మీరు డిన్నర్ సమయంలో రైస్ కాకుండా నూడుల్స్ కాకుండా కొత్తగా, రుచికరంగా ఏదైనా తినాలి అనుకుంటే ఈ ఎగ్ సేమియా చేసుకోవచ్చు. మీరు కూడా ఎగ్ సేమియా చేసుకోవాలనుకుంటే ఈ కింద రెసిపీ ఉంది. ఇక్కడ ఇచ్చిన సూచనల ప్రకారంగా సులభంగా ఎగ్ సేమియా తయారు చేసుకోవచ్చు.

Egg Vermicelli - Semiya Recipe కోసం కావలసినవి

  • రోస్టెడ్ వెర్మిసెల్లి - 200 గ్రా
  • ఆలివ్ నూనె - 2 స్పూన్
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 tsp
  • ఉల్లిపాయలు - 2 ముక్కలు
  • క్యాప్సికమ్ ముక్కలు - 2 టీస్పూన్
  • క్యారెట్ ముక్కలు- 2 టీస్పూన్
  • క్యాబేజీ ముక్కలు - 2 టీస్పూన్
  • పచ్చిమిర్చి - 2
  • కొత్తిమీర
  • ఉప్పు - రుచికి తగినంత
  • పసుపు పొడి - 1/2 tsp
  • కారం- 3/4 tsp
  • గుడ్లు - 4
  • నీరు - 450 ml

ఎగ్ వెర్మిసెల్లి - సేమియా రెసిపీ- తయారీ విధానం

  1. ముందుగా రోస్టెడ్ వెర్మిసెల్లిని పాన్‌లో వేసి మామూలుగా ఉడికించుకోవాలి, మరీ మెత్తగా అవకూడదు. మధ్యలో కొంచెం ఉప్పు వేసుకోవాలి.
  2. ఇప్పుడు ఉడికించిన సేమియాను చల్లటి షవర్ కింద ఉంచి చల్లబరుచుకోవాలి, నీటిని తీసేసి ఒక పక్కనపెట్టుకోవాలి.
  3. ఇప్పుడు కడాయి నూనె వేడిచేసుకొని అందులో ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి మిరపకాయలు వేసి వేయించాలి.
  4. ఆపైన చిన్నగా తరుగుకున్న క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ ముక్కలు వేయాలి. కారం, ఉప్పు కూడా వేసి వేయించాలి.
  5. ఇందులో ఉడికించిన సేమియా వేసి అన్ని కలిపి చిన్న మంట మీద వేయించాలి.
  6. మరో పాన్ లో నూనె వేడి చేసి, అందులో గుడ్లు గిలక్కొట్టి ఎగ్ భుర్జీలాగా చేసుకోవాలి.
  7. చివరగా ఈ ఎగ్ భుర్జీని సేమియాలో కలిపేసుకొని ఉప్పు, కారం సర్దుబాటు చేసుకోవాలి.

పైనుంచి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకుంటే రుచికరమైన ఎగ్ సేమియా రెడీ.

WhatsApp channel

సంబంధిత కథనం