Pink Wasabi Veg Noodles | ఘుమఘుమలాడే గులాబీ నూడుల్స్.. 'ఓమ్‌మ్ నామ్‌మ్ నామ్‌మ్' అనుకుంటూ తినేస్తారు!-korean special pink wasabi veg noodles simply om nom nom yummy in taste ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Korean Special Pink Wasabi Veg Noodles, Simply Om Nom Nom Yummy In Taste

Pink Wasabi Veg Noodles | ఘుమఘుమలాడే గులాబీ నూడుల్స్.. 'ఓమ్‌మ్ నామ్‌మ్ నామ్‌మ్' అనుకుంటూ తినేస్తారు!

HT Telugu Desk HT Telugu
Oct 16, 2022 12:58 PM IST

Pink Wasabi Veg Noodles: కొత్తగా కొరియన్ రెసిపీని మీకు ఇక్కడ అందిస్తున్నాం. అదే పింక్ వసాబి వెజ్ నూడుల్స్. ఇవి Om nom nom అనుకుంటూ తినేంత yummyగా చాలా రుచిగా ఉంటాయి.

Pink Wasabi Veg Noodles
Pink Wasabi Veg Noodles

Pink Wasabi Veg Noodles: మనం రోజూ తినే అన్నం, రోటీ వంటివి వద్దు అనుకున్నపుడు మనకు మనకు చైనీస్ నూడుల్స్ గుర్తుకొస్తాయి. అయితే నూడుల్స్ కేవలం చైనీస్ వంటకం మాత్రమే కాదు, ఇతర ప్రాంతాల్లో కూడా సాధారణంగా తింటారు. ఈ కరోనా లాక్డౌన్ సమయంలో జనాలు ఇంటికే పరిమితమై అన్ని భాషల సినిమాలు చూసేసి, ఇంకా ఏమి లేవన్నపుడు కొరియన్ డ్రామాలు కూడా చూసేశారు. అవి జనాలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అదే సమయంలో కొరియన్ రుచులపైనా మక్కువ పెరిగింది. టాప్ రామెన్ నూడుల్స్ తినడం ప్రారంభమైంది. అందులో పింక్ వసాబి వెజ్ నూడుల్స్ కాస్త విభిన్నమైన రంగు, రుచిని కలిగి ఉండి అద్భుతంగా ఉంటాయి. చిన్న పిల్లలైతే ఈ నూడుల్స్‌ను ‘ఓమ్‌మ్ నామ్‌మ్ నామ్‌మ్’ అనుకుంటూ తినేస్తారు.

పింక్ వసాబి వెజ్ నూడుల్స్ పే‌రుకు తగ్గట్లుగా గులాబీ ‌రంగులో ఉంటాయి. ఎందుకంటే ఈ నూడుల్స్‌ను బీట్‌రూట్ రసం కలిపిన నీటిలో ఉడికిస్తారు, అందుకే గులాబీ రంగు వస్తుంది. ఈ నూడుల్స్ ఎలా చేయాలి, తయారీ విధానం ఎలాగో ఇక్కడ తెలుసుకోండి. ఈ నూడుల్స్ తయారీకోసం ముందుగా సాస్‌లు సిద్ధం చేసుకోవాలి. పింక్ వాసబి వెజ్ నూడుల్స్ రెసిపీ ఇదిగో...

Pink Wasabi Veg Noodles Recipe కోసం కావలసినవి

  • నూడిల్స్ 260 గ్రా
  • వసాబి సాస్ 22 గ్రా
  • నూడిల్ బ్యాగ్ సాస్ 28 గ్రా
  • లైట్ సోయా 5 టీస్పూన్లు
  • ఓయెస్టర్ సాస్ వెజ్ 4 టీస్పూన్లు

వసాబి సాస్ తయారీకి కావలసిన పదార్థాలు:

- వేయించిన టమోటా 2 గ్రా

- వెల్లుల్లి 1 గ్రా

- అల్లం 1 గ్రా

- కింగ్ మిర్చి 1 స్పూన్

- ఎర్ర మిర్చి 1 స్పూన్

- కాశ్మీరీ మిర్చి 1 గ్రా

- ఉల్లిపాయ ముక్కలు 1 స్పూన్

-వాసబి ఒరిజినల్ 5 గ్రా

-వెజ్ ఓయెస్టెర్ 1 గ్రా

-వెజ్ రసం పౌడర్ 1 గ్రా

- చక్కెర 2 గ్రా

పైన పేర్కొన్న అన్ని పదార్థాలను కలిపి, తేలికగా వేయించి దానిని బాగా గ్రైండ్ చేసుకుంటే వసాబి సాస్ రెడీ అవుతుంది.

నూడిల్ బ్యాక్ సాస్ కోసం కావలసినవి:

- లైట్ సోయా సాస్ 5 టీస్పూన్లు

-ఓయెస్టర్ సాస్ వెజ్ 4 టీస్పూన్లు

వెజ్ బ్రోత్ పౌడర్ 2 గ్రా

- చక్కెర 1 గ్రా

- నీరు 10 స్పూన్

అన్నింటినీ కలిపి ఆవిరిలో ఉడికిస్తే నూడిల్ బ్యాక్ సాస్ సిద్ధం అవుతుంది.

పింక్ వసాబి వెజ్ నూడుల్స్ తయారీ విధానం

  1. ముందుగా బీట్‌రూట్ రసం కలిపిన నీటిని సుమారు 10 నిమిషాలు మరిగించండి. ఈ మరుగులో నూడుల్స్‌ను వేసి సుమారు 4 నిమిషాలు ఉడికించండి.
  2. ఇప్పుడు కడాయిలో 2 స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. ఆపై పింక్ నూడుల్స్ వేసి వేయించండి.
  3. ఆ వెంటనే వసాబి సాస్, నూడిల్ బ్యాక్ సాస్ వేసి బాగా కలపాలి.
  4. అనంతరం స్ప్రింగ్ ఆనియన్ చల్లండి. అంతే పింక్ వసాబి వెజ్ నూడుల్స్ రెడీ అయినట్లే.

రుచికోసం పైనుంచి మరింత వసాబి సాస్ కలుపుకోవచ్చు. ఇంకేం Om nom nom అంటూ ఈ yummy నూడుల్స్ రుచిని ఆస్వాదించండి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్