తెలుగు న్యూస్  /  National International  /  Temperature Set To Rise In Coming Days In North, Central India Says Imd

Temperature to rise in India : భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు.. ప్రజలకు అలర్ట్​!

Sharath Chitturi HT Telugu

19 February 2023, 6:42 IST

  • Temperature to rise in India : దేశ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది ఐఎండీ. వాయువ్య, మధ్య భారతంలో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని స్పష్టం చేసింది.

భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు.. ప్రజలకు అలర్ట్​!
భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు.. ప్రజలకు అలర్ట్​!

భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు.. ప్రజలకు అలర్ట్​!

Temperature to rise in India : చల్లగా ఉండాల్సిన ఫిబ్రవరిలో.. భానుడి భగభగలకు ప్రజలు భయపడిపోతున్నారు. పరిస్థితులు ఇప్పుడే ఇలా ఉంటే.. ఇక రానున్న వేసవి కాలం ఇంకేంత దారుణంగా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇక ఇప్పుడు.. ప్రజల ఆందోళనలను మరింత పెంచే విధంగా ఓ ప్రకటన చేసింది ఐఎండీ (భారత వాతావరణశాఖ). వాయువ్య, మధ్య భారత ప్రాంతాల్లో రాత్రి పూట ఉష్ణోగ్రతలు రానున్న రోజుల్లో పెరుగుతాయని పేర్కొంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు కనీసం 2-3 డిగ్రీలు ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేసింది.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

అమ్మో.. ఎండ..!

"అత్యల్ప ఉష్ణోగ్రతలు కనీసం 2-3 డిగ్రీలు పెరగొచ్చు. వాయువ్య, మధ్య, మహారాష్ట్ర ప్రాంతాల్లో మరో 4-5 రోజుల పాటు ఈ పరిస్థితులు చూడొచ్చు. గుజరాత్​లో మార్పులు ఉండకపోవచ్చు," అని ఐఎండీ వివరించింది.

Highest temperatures in India : ఢిల్లీలో శనివారం.. 29.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఫిబ్రవరిలో సాధారణంగా ఉండాల్సిన ఉష్ణోగ్రతల కన్నా ఇది 5 డిగ్రీలు ఎక్కువ! అత్యల్ప ఉష్ణోగ్రత 11.7 డిగ్రీలుగా నమోదైంది. సాధారణం కన్నా ఇది 1 డిగ్రీ ఎక్కువ.

దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు గత కొన్ని రోజులుగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ తీరంలోని రాష్ట్రాలపై ప్రభావం ఎక్కువగా ఉంది. గుజరాత్​, మహారాష్ట్ర, గోవా, కర్ణాటకలో సాధారణ ఉష్ణోగ్రతల డీవియేషన్​ 5-10 డిగ్రీలు ఎక్కువగా ఉంటున్నాయి.

Temperature in Hyderabad : ఫిబ్రవరి అంటే దేశంలో శీతాకాల సమయం. కానీ గుజరాత్​లోని బుజ్​ ప్రాంతంలో గత వారంలో 40 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కన్నా ఇది 10 డిగ్రీలు ఎక్కువ. రాజస్థాన్​ బికనీర్​లో అత్యధిక ఉష్ణోగ్రత 36.8 డిగ్రీలుగా ఉంది. జమ్ముకశ్మీర్​లో సాధారణ ఉష్ణోగ్రతల కన్నా డీవియేషన్​ 7-9 డిగ్రీలు ఎక్కువగా ఉంటోంది.

ఫిబ్రవరి నుంచే భానుడి భగభగలు

పంజాబ్​తో పాటు 7 రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డ్​ అవుతున్నాయి. సాధారణంగా ఈ స్థాయి ఉష్ణోగ్రతలు మార్చ్​ మధ్య వారంలో నమోదవుతాయి. ఇక ఉత్తర్​ప్రదేశ్​, మధ్యప్రదేశ్​తో పాటు మొత్తం మీద 10 రాష్ట్రాల్లో.. మార్చ్​ తొలి వారంలో ఉండాల్సిన ఉష్ణోగ్రతలు ఈ నెల మధ్యలోనే రికార్డ్​ అవుతుండటం ఆందోళనకర విషయం.

Temperatures in Telangana : సాధారణంగా శీతాకాలంలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయి. ఈ ఏడాది అలా జరగలేదు. ఫలితంగా.. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఫిబ్రవరి నుంచే పెరగడం మొదలుపెట్టాయి. రానున్న రెండు వారాల పాటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ఐఎండీ అంచనా వేసింది. ఇదే నిజమైతే.. గోధుమ పంటపై భారీ ప్రభావమే పడుతుంది.