తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Stock Market Today: ఆరంభ నష్టాల నుంచి పుంజుకున్న స్టాక్ మార్కెట్లు

Stock Market today: ఆరంభ నష్టాల నుంచి పుంజుకున్న స్టాక్ మార్కెట్లు

HT Telugu Desk HT Telugu

21 July 2022, 9:34 IST

    • Stock Market today: స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 114 పాయింట్లు డౌన్ అయ్యింది. తిరిగి క్రమంగా పుంజుకుని సెన్సెక్స్ 141 పాయింట్లు, నిఫ్టీ 45 పాయింట్లు లాభపడ్డాయి.
బుధవారం భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు
బుధవారం భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు (PTI)

బుధవారం భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు

స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.16 సమయంలో సెన్సెక్స్ 114 పాయింట్లు పతనమై 55,282 పాయింట్ల వద్ద ట్రేడైంది. నిఫ్టీ 32 పాయింట్లు కోల్పోయి 16,488 పాయింట్ల వద్ద ట్రేడైంది. తిరిగి కొద్ది సేపటికి స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. 10.30 సమయంలో సెన్సెక్స్ 127.83 పాయింట్లు, నిఫ్టీ 41.25 పాయింట్ల మేర లాభాల్లో ట్రేడవుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

Chardham Yatra 2024: చార్ ధామ్ యాత్రకు ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే తేదీ ఇదే; ఆన్ లైన్ లో కూడా చేసుకోవచ్చు

Sexual assault in Delhi Metro: ఢిల్లీ మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి యత్నం; వణికిపోయిన మైనర్

Jammu and Kashmir news: భద్రతా బలగాలపై ఉగ్రవాదుల కాల్పులు; ఐదుగురు జవాన్లకు గాయాలు

టాప్ గెయినర్స్ జాబితాలో ఇండస్‌ఇండ్ బ్యాంక్, హిందాల్కో, దివీస్, మారుతీ సుజుకీ, ఎం అండ్ ఎం, నెస్లే, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్, బజాజ్ ఆటో, గ్రాసిం, బ్రిటానియా, కోల్ ఇండియా, ఐటీసీ, అల్ట్రాటెక్, ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంక్, యూపీఎల్, డాక్టర్ రెడ్డీస్, సిప్లా తదితర స్టాక్స్ నిలిచాయి.

టాప్ లూజర్స్ జాబితాలో టెక్ మహీంద్రా, విప్రో, కోటక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, లార్సెన్, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ లైఫ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తదితర స్టాక్స్ నిలిచాయి.

ప్రి మార్కెట్ ఓపెనింగ్‌లో సెన్సెక్స్ 5.60 పాయింట్లు నష్టపోయి 55,391.93 స్థిరపడింది. నిఫ్టీ 2.70 పాయింట్లు లాభపడి 16,523 వద్ద స్థిరపడింది.

కాగా బుధవారం స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 629.91 పాయింట్లు లాభపడింది.

కాగా ఇండస్‌ఇండ్ బ్యాంక్, విప్రో తదితర కంపెనీలు బుధవారం క్యూ 1 రిజల్ట్స్ ప్రకటించాయి. ఇండస్‌ఇండ్ నికర లాభంలో 61 శాతం పెరుగుదల కనబరచడంతో దాని స్టాక్ భారీ లాభాల్లో ట్రేడవుతోంది. ఈ ఉదయం 4 శాతం లాభపడి ప్రస్తుతం 916 వద్ద ట్రేడవుతోంది.

విప్రో నికర లాభం తగ్గడంతో దాని స్టాక్ 1.73 శాతం నష్టాల్లో ట్రేడవుతోంది. ఇటీవలే ఫలితాలు వెల్లడించిన హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ కూడా 0.93 శాతం మేర నష్టాల్లో ట్రేడవుతోంది.

కాగా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ తిరిగి జీవితకాలపు కనిష్టానికి పడిపోయింది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ‌ఎక్స్ఛేంజ్‌ వద్ద డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 80.06 వద్ద ట్రేడవుతోంది.

టాపిక్