తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Karnataka Cm Deal: సోనియాగాంధీ ఎంటరైన తరువాతనే.. పట్టువీడిన డీకే

Karnataka CM deal: సోనియాగాంధీ ఎంటరైన తరువాతనే.. పట్టువీడిన డీకే

HT Telugu Desk HT Telugu

18 May 2023, 14:21 IST

  • Karnataka CM deal: ఎట్టకేలకు కర్నాటక ముఖ్యమంత్రి ఎంపిక సమస్య పరిష్కారమైంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తెగని పంచాయతీగా మారిన ఈ వివాదం చివరకు పార్టీ మాజీ చీఫ్ సోనియాగాంధీ (Sonia Gandhi) జోక్యంతోనే పరిష్కారమైనట్లు తెలుస్తోంది.

సోనియా గాంధీ (ఫైల్ ఫొటో)
సోనియా గాంధీ (ఫైల్ ఫొటో)

సోనియా గాంధీ (ఫైల్ ఫొటో)

Karnataka CM deal: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Legislative Assembly Elections) కాంగ్రెస్ ఘన విజయం సాధించిన నాటి నుంచి.. ముఖ్యమంత్రి ఎవరవుతారన్న ఉత్కంఠ ప్రజల్లో, కాంగ్రెస్ నాయకులు, శ్రేణుల్లో ప్రారంభమైంది. సీనియర్ నాయకులు సిద్ధ రామయ్య, డీకే శివకుమార్ (DK Shivakumar) సీఎం పీఠం విషయంలో పట్టు వీడకపోవడంతో సమస్య మరింత ముదిరింది.

ట్రెండింగ్ వార్తలు

Chardham Yatra 2024: చార్ ధామ్ యాత్రకు ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే తేదీ ఇదే; ఆన్ లైన్ లో కూడా చేసుకోవచ్చు

Sexual assault in Delhi Metro: ఢిల్లీ మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి యత్నం; వణికిపోయిన మైనర్

Jammu and Kashmir news: భద్రతా బలగాలపై ఉగ్రవాదుల కాల్పులు; ఐదుగురు జవాన్లకు గాయాలు

IGNOU July 2024 session: ఇగ్నో లో జులై సెషన్ కు రీ రిజిస్ట్రేషన్ విండో ఓపెన్; విద్యార్థులు ఇలా రిజిస్టర్ చేసుకోండి..

Karnataka CM deal: రెండు రోజులుగా చర్చోపచర్చలు..

గత రెండు రోజులుగా ఢిల్లీ కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే నివాసంలో కర్నాటక సీఎం ఎంపిక ప్రక్రియపై చర్చోపచర్చలు కొనసాగాయి. సిద్ధ రామయ్య (Siddaramaiah) ను సీఎంగా నిర్ణయించిన అధిష్టానం.. అందుకు డీకే శివకుమార్ (DK Shivakumar) ను ఒప్పించడానికి మల్లగుల్లాలు పడింది. ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు ఆరు కీలక పోర్ట్ ఫోలియోలు ఇస్తామని, లేదా ముఖ్యమంత్రి పదవిలో చెరో రెండున్నరేళ్లు కొనసాగేలా చూస్తామని.. శివకుమార్ (DK Shivakumar) కు అనేక ప్రతిపాదనలు చేసింది. వాటన్నింటినీ ఆయన తోసిపుచ్చారు. దాంతో, బుధవారం సాయంత్రం వరకు కూడా ఈ ప్రతిష్టంభనపై ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఖర్గే, ఇతర నేతలు ఉన్నారు.

Karnataka CM deal: సోనియా జోక్యంతో..

ఈ పరిస్థితుల్లో పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీ (Sonia Gandhi) రంగంలోకి దిగారు. డీకే శివకుమార్ (DK Shivakumar) తో ఆమె స్వయంగా మాట్లాడారు. సిద్ధ రామయ్య (Siddaramaiah) ను సీఎంగా చేయడానికి అంగీకరించాలని, డెప్యూటీ సీఎం పదవిని స్వీకరించాలని, కేపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగాలని డీకేను కోరారు. స్వయంగా సోనియా గాంధీ (Sonia Gandhi) అభ్యర్థించడంతో డీకే శివకుమార్ (DK Shivakumar) కాదనలేకపోయారని, సిద్ధరామయ్య (Siddaramaiah) ను సీఎంగా అంగీకరించారని డీకే కు సన్నిహితులైన పార్టీ నేతలు వెల్లడించారు. డీకే శివకుమార్ కు సోనియా గాంధీ (Sonia Gandhi) అంటే చాలా గౌరవమని, తను ఇబ్బందుల్లో ఉన్న సమయంలో నైతికంగా ఆమె తనకు ఎంతో అండగా ఉన్నారన్న అభిమానం శివకుమార్ (DK Shivakumar) కు ఉందని వారు వివరించారు. సీబీఐ కేసులతో జైళ్లో ఉన్న సమయంలో డీకే శివకుమార్ ను సోనియా గాంధీ (Sonia Gandhi) స్వయంగా జైలుకు వచ్చి కలిసి ధైర్యం చెప్పారని, ఆ విషయాన్ని డీకే (DK Shivakumar) మర్చిపోలేదని వివరించారు.

Karnataka CM deal: నేడు సీఎల్పీ భేటీ

ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం బెంగళూరులో సీఎల్పీ సమావేశం నిర్వహిస్తున్నట్లు కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ (DK Shivakumar) ప్రకటించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఆ సమావేశానికి హాజరవుతారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ నేతగా సిద్ధ రామయ్య (Siddaramaiah) ను ఎన్నుకుంటారు.