తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sonia Gandhi Joins Bharat Jodo Yatra : భారత్​ జోడో యాత్రలో సోనియా గాంధీ

Sonia Gandhi joins Bharat Jodo Yatra : భారత్​ జోడో యాత్రలో సోనియా గాంధీ

Sharath Chitturi HT Telugu

06 October 2022, 10:31 IST

  • Sonia Gandhi joins Bharat Jodo Yatra : కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. భారత్​ జోడో యాత్రలో పాల్గొన్నారు. కర్ణాటక మాండ్య విధుల్లో రాహుల్​ గాంధీతో పాటు ఇతర నేతలతో కలిసి నడిచారు.

భారత్​ జోడో యాత్రలో భాగంగా రాహుల్​ గాంధీతో సోనియా
భారత్​ జోడో యాత్రలో భాగంగా రాహుల్​ గాంధీతో సోనియా (PTI)

భారత్​ జోడో యాత్రలో భాగంగా రాహుల్​ గాంధీతో సోనియా

Sonia Gandhi joins Bharat Jodo Yatra today : కాంగ్రెస్​ చేపట్టిన భారత్​ జోడో యాత్రలో.. ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం పాల్గొన్నారు. తనయుడు రాహుల్​ గాంధీ, ఇతర నేతలతో కలిసి కర్ణాటకలోని మాండ్య జిల్లాలో కొన్ని కిలోమీటర్లు నడిచారు. సోనియా రాకతో భారత్​ జోడో యాత్రలో సందడి వాతావరణం నెలకొంది.

ట్రెండింగ్ వార్తలు

Japan rice balls : చంకలో పెట్టి.. చెమటతో తయారు చేసిన ఈ ఫుడ్​ని ఎగబడి తింటున్నారు!

Heatwave alert : తెలుగు రాష్ట్రాల్లో ఇంకొన్ని రోజుల పాటు భానుడి భగభగలు- ఆ తర్వాత భారీ వర్షాలు!

JNU PG Admissions 2024 : జేఎన్​యూ పీజీ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ- ఇలా అప్లై చేసుకోండి..

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్​తో పాటు ఇతర రాష్ట్ర కాంగ్రెస్​ నేతలు.. సోనియా, రాహుల్​ గాంధీలతో కలిసి నడిచారు. కాంగ్రెస్​ అధ్యక్షురాలిని చూసేందుకు తరలివచ్చిన అభిమానులు, ప్రజలను పోలీసు సిబ్బంది నియంత్రించడంలో చాలా ఇబ్బంది పడినట్టు కనిపిస్తోంది.

<p>భారత్​ జోడో యాత్రలో సోనియా గాంధీ</p>

చాలా కాలానికి..

తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడిన సోనియా గాంధీ.. చాలా నెలల తర్వాత తొలిసారి బహిరంగంగా ప్రజల ముందుకు వచ్చారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు.

Sonia Gandhi Bharat Jodo Yatra : రెండుసార్లు కొవిడ్​ సోకడంతో కొన్ని రోజుల పాటు సోనియా ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చింది. చివరిసారిగా.. 2016 ఆగస్టులో వారణాసిలో జరిగిన రోడ్​షోలో బహిరంగంగా ప్రజల ముందు కనిపించారు సోనియా గాంధీ. అక్కడ ఆమె భుజానికి గాయం కావడంతో అనంతరం శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత పలు ఈవెంట్లలో పాల్గొన్నా.. పెద్దగా మాట్లాడలేదు. ఇక అనారోగ్య సమస్యలతో ఎన్నికలు, ప్రచారాలకు సైతం దూరంగానే ఉంటున్నారు కాంగ్రెస్​ అధ్యక్షురాలు.

<p>రాహుల్​ గాంధీతో సోనియా గాంధీ</p>

భారత్​ జోడో యాత్ర..

Bharat Jodo Yatra in Karnataka : 3570కి.మీ భారత్​ జోడో యాత్ర సెప్టెంబర్​ 8న కన్యాకుమారిలో ప్రారంభమైంది. ప్రస్తుతం కర్ణాటకలో యాత్ర కొనసాగుతోంది. కశ్మీర్​ వరకు ఈ యాత్ర ఉండనుంది. కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ.. ముందుండి పార్టీ​ నేతలను నడిపిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేయడం కోసమే ఈ యాత్ర తలపెట్టింది కాంగ్రెస్​.

ఇక కర్ణాటకలో యాత్రకు విశేష స్పందన లభిస్తోందని కాంగ్రెస్​ నేతలు చెబుతున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న ప్రాంతంలో.. కాంగ్రెస్​కు ఇంతటి మద్దతు లభిస్తుండటం.. మార్పునకు చిహ్నం అని అంటున్నారు.

<p>భారత్​ జోడో యాత్ర కోసం తరలివెళ్లిన ప్రజలు</p>