తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Savarkar Photo On Bharat Jodo Poster| భారత్ జోడో యాత్ర పోస్టర్లో సావర్కర్ బొమ్మ

Savarkar photo on Bharat Jodo poster| భారత్ జోడో యాత్ర పోస్టర్లో సావర్కర్ బొమ్మ

HT Telugu Desk HT Telugu

21 September 2022, 19:00 IST

    • Savarkar photo on Bharat Jodo yatra poster:  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న దేశవ్యాప్త యాత్ర ‘భారత్ జోడో యాత్ర’లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. యాత్ర సందర్భంగా కేరళలో స్థానికంగా ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర సమర యోధుల పోస్టర్ లో వీర్ సావర్కర్ దర్శనమివ్వడం సంచలనంగా మారింది.
భారత్ జోడో యాత్ర పోస్టర్ లో వీర్ సావర్కర్ ఫొటో
భారత్ జోడో యాత్ర పోస్టర్ లో వీర్ సావర్కర్ ఫొటో

భారత్ జోడో యాత్ర పోస్టర్ లో వీర్ సావర్కర్ ఫొటో

Savarkar photo on Bharat Jodo yatra poster: కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 14వ రోజుకు చేరింది. ప్రస్తుతం కేరళలోని ఎర్నాకులం జిల్లాలో యాత్ర సాగుతోంది. దేశం నలుమూలల నుంచి వస్తున్న పార్టీ నేతలు, కార్యకర్తలతో మంచి జోష్ లో యాత్ర సాగుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Bihar crime news : కస్టడీలో దంపతులు మృతి.. ప్రజల ఆగ్రహానికి తగలబడిన పోలీస్​ స్టేషన్​!

Haryana bus accident : బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది మృతి- 24 మందికి గాయాలు!

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

Savarkar photo on Bharat Jodo yatra poster: స్వాతంత్య్ర యోధుల తో పాటు సావర్కర్ ఫొటో

కానీ, కేరళలోని ఎర్నాకులంలో పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఒక పోస్టర్ కాంగ్రెస్ కు తలవంపులు తెచ్చేలా ఏర్పాటైంది. స్వతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ప్రముఖుల ఫొటోల తో పాటు వీడీ సావర్కర్ ఫొటోను కూడా ఆ పోస్టర్ లో ముద్రించారు. కాంగ్రెస్ ఏనాడు కూడా సావర్కర్ ను స్వాతంత్య్ర సమర యోధుడిగా గుర్తించలేదు. పైగా బ్రిటిష్ తో పోరాడేందుకు బదులుగా వారికి క్షమాపణ చెప్పారని ఆరోపిస్తుంది. బదులుగా బీజేపీ సావర్కర్ ను స్వాతంత్య్ర సమర యోధుడిగా గుర్తిస్తుంది.

Savarkar photo on Bharat Jodo yatra poster: కాంగ్రెస్ వివరణ

ఈ పొరపాటును కేరళ స్వతంత్ర ఎమ్మెల్యే పీవీ అన్వర్ గుర్తించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పొరపాటుపై కాంగ్రెస్ వివరణ ఇచ్చింది. పోస్టర్ ప్రింటింగ్ లో పొరపాటు కారణంగా ఈ తప్పు జరిగిందని వివరణ ఇచ్చింది. ఈ లోగా, ఆ పోస్టర్ పై ఉన్న సావర్కర్ ఫొటో పై మహాత్మాగాంధీ ఫోటోను చేర్చి స్థానిక నాయకులు కవర్ చేశారు.

Savarkar photo on Bharat Jodo yatra poster: బీజేపీ కామెంట్

ఈ అంశంపై బీజేపీ వ్యంగ్యంగా స్పందించింది. `ఇప్పటికైనా కాంగ్రెస్ వాస్తవాన్ని గుర్తించింది. సంతోషం. రాహుల్ గాంధీ ఆలస్యంగానైనా నిజమైన యోధుడెవరో గుర్తించారు.` అంటూ వ్యాఖ్యానించింది.

తదుపరి వ్యాసం