తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Shraddha Walkar Murder: ‘‘అవి శ్రద్ధ వాల్కర్ ఎముకలే’’; నిర్ధారించిన సీఎఫ్ఎస్ఎల్

Shraddha Walkar murder: ‘‘అవి శ్రద్ధ వాల్కర్ ఎముకలే’’; నిర్ధారించిన సీఎఫ్ఎస్ఎల్

HT Telugu Desk HT Telugu

15 December 2022, 19:05 IST

  • Shraddha Walkar murder: ఢిల్లీలో శ్రద్ధా వాల్కర్ హత్యకు సంబంధించిన దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. లివిన్ పార్ట్ నర్ శ్రద్ధ వాల్కర్ ను హత్య చేసి, 35ముక్కలు చేసి, చాలా రోజుల పాటు ఫ్రిజ్ లో ఉంచి, ఆ తరువాత దగ్గరలోని అడవిలో పడేసినట్లు ఆఫ్తాబ్ పూనావాలా పోలీసుల ముందు ఇప్పటికే అంగీకరించాడు.

శ్రద్ధ వాల్కర్ (ఫైల్ ఫొటో)
శ్రద్ధ వాల్కర్ (ఫైల్ ఫొటో) (PTI)

శ్రద్ధ వాల్కర్ (ఫైల్ ఫొటో)

Shraddha Walkar murder: లివిన్ పార్టనర్ శ్రద్ధ వాల్కర్ ను దారుణంగా హత్య చేసిన ఆఫ్తాబ్.. ఆ తరువాత ఆమె మృతదేహాన్ని 35 ముక్కలు చేసి, చాలా రోజుల పాటు తమ ఫ్లాట్ లోని ఫ్రిజ్ లో ఉంచాడు. ఆ తరువాత వాటిని ప్యాక్ చేసి ఒక్కొక్కటిగా దగ్గరల్లోని మెహ్రౌలీ అటవీ ప్రాంతంలో, గురుగ్రామ్ లో పడేశాడు. పోలీసుల విచారణలో ఈ విషయాలను ఆఫ్తాబ్ వెల్లడించాడు .

ట్రెండింగ్ వార్తలు

Chardham Yatra 2024: చార్ ధామ్ యాత్రకు ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే తేదీ ఇదే; ఆన్ లైన్ లో కూడా చేసుకోవచ్చు

Sexual assault in Delhi Metro: ఢిల్లీ మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి యత్నం; వణికిపోయిన మైనర్

Jammu and Kashmir news: భద్రతా బలగాలపై ఉగ్రవాదుల కాల్పులు; ఐదుగురు జవాన్లకు గాయాలు

IGNOU July 2024 session: ఇగ్నో లో జులై సెషన్ కు రీ రిజిస్ట్రేషన్ విండో ఓపెన్; విద్యార్థులు ఇలా రిజిస్టర్ చేసుకోండి..

Shraddha Walkar murder: డీఎన్ ఏ పరీక్షలు

ఆఫ్తాబ్ వెల్లడించిన సమాచారం మేరకు పోలీసులు మెహ్రౌలీ అటవీ ప్రాంతంలో, గురుగ్రామ్ లో గాలింపు జరిపారు. వారికి పలు చోట్ల 13 ఎముక భాగాలను, దవడ భాగాన్ని సేకరించారు. వాటిని పరీక్షల కొరకు ఫొరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. తాజాగా, ఫొరెన్సిక్ ల్యాబ్ నుంచి పోలీసులకు ఆ పరీక్షలకు సంబంధించిన నివేదికలు అందినవి. పోలీసులు సేకరించిన ఎముకల్లో కొన్ని శ్రద్ధ వాకర్ వేనని డీఎన్ఏ పరీక్షల్లో తేలినట్లు ఆ నివేదికలో ఉన్నట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు గురువారం వెల్లడించాయి. ఈ కేసు దర్యాప్తులో ఇది కీలక ముందడుగు అని పోలీసు వర్గాలు తెలిపాయి. శ్రద్ధ వాకర్ డీఎన్ ఏ వివరాల కోసం ఆమె తండ్రి నుంచి ఫొరెన్సిక్ వర్గాలు నమూనాలను సేకరించాయి.

Shraddha Walkar murder: పాలిగ్రాఫ్ రిపోర్ట్ కూడా..

నిందితుడు ఆఫ్తాబ్ పై జరిపిన పాలిగ్రాఫ్ పరీక్ష నివేదిక కూడా పోలీసులకు అందినట్లు సమాచారం. సెంట్రల్ ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ(Central Forensic Science Laboratory -CFSL) నుంచి ఆ నివేదిక కేసును దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసు విభాగానికి అందిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. డీఎన్ఏ, పాలిగ్రాఫ్ నివేదికలు కేసు దర్యాప్తులో విసృతంగా ఉపయోగపడతాయని భావిస్తున్నారు. నిందితుడు ఆఫ్తాబ్ నుంచి దర్యాప్తు కు సహకారం లభించని నేపథ్యంలో.. ఈ నివేదికల ఆధారంగా అతడిని మరోసారి ప్రశ్నించే అవకాశముంది.

టాపిక్