Shraddha Murder case: శ్రద్ధను చంపినందుకు ఆఫ్తాబ్‍కు పశ్చాత్తాపమే లేదట..-shraddha walker murder case aaftab poonawala not expressed remorse ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Shraddha Walker Murder Case Aaftab Poonawala Not Expressed Remorse

Shraddha Murder case: శ్రద్ధను చంపినందుకు ఆఫ్తాబ్‍కు పశ్చాత్తాపమే లేదట..

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 30, 2022 12:33 PM IST

Shraddha Walker Murder case: శ్రద్ధను అతికిరాతకంగా చంపిన ఆఫ్తాబ్ పునావాలా (Aaftab poonawala).. అలా చేసినందుకు పశ్చాత్తాపం కూడా పడడం లేదట. పాలిగ్రాఫ్ టెస్ట్ తర్వాత ఈ విషయం బయటికి వచ్చింది.

ఫోరెన్సిక్ ల్యాబ్ వద్ద ఆఫ్తాబ్ పునావాలా (ANI)
ఫోరెన్సిక్ ల్యాబ్ వద్ద ఆఫ్తాబ్ పునావాలా (ANI)

Shraddha Walker Murder case: శ్రద్ధా వాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తన లవర్ అయిన శ్రద్ధను ఆఫ్తాబ్ పునావాలా కిరాతకంగా హత్య చేసి.. 35 ముక్కలుగా నరికాడు. ఈ ఘాతుకానికి తానే పాల్పడినట్టు పోలీసుల విచారణలో, కోర్టులో అంగీకరించాడు ఆఫ్తాబ్. అయితే విచారణ జరుగుతున్న కొద్ది అతడు చెబుతున్న కొన్ని విషయాలు విస్తుగొలుపుతున్నాయి. ఈ కేసులో రోజుకో అంశం బయటపడుతోంది. తాజాగా ఆఫ్తాబ్‍కు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారు. కన్‍ఫెషన్ కోసం, కొత్త నిజాలను రాబట్టేందుకు పోలీసులు.. ఈ పరీక్ష చేశారు. ఈ సందర్భంగా ఓ విషయం బయటికి వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

తన లవర్ శ్రద్ధా వాకర్‌ను తానే హత్య చేసినట్టు పాలిగ్రాఫ్ టెస్టులోనూ ఆఫ్తాబ్ అంగీకరించాడని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే శ్రద్ధను చంపినందుకు తాను పశ్చాత్తాపపడడం లేదని అతడు చెప్పాడట. ఇంత కిరాతకానికి పాల్పడినా.. ఆ విషయంపై బాధపడడం లేదని ఆఫ్తాబ్ వెల్లడించాడని విచారణ బృందంలోని కొందరి ద్వారా సమాచారం బయటికి వచ్చింది.

రేపే నార్కో టెస్ట్

Shraddha Walker Murder case: ఆఫ్తాబ్ పూనావాలకు నార్కో టెస్టు జరగనుంది. శ్రద్ధ హత్య కేసుకు సంబంధించి అతడి నుంచి నిజాలను రాబట్టేందుకు లై డిటెక్షన్ టెస్ట్ గా భావించే ఈ ప్రక్రియను డిసెంబర్ 1న చేయనున్నారు. ఆఫ్తాబ్‍కు నార్కో అనాలిసిస్ టెస్ట్ చేసేందుకు ఢిల్లీలోని ఓ లోకల్ కోర్ట్ అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 1, డిసెంబర్ 5న అతడిని రోహిణిలోని ల్యాబ్‍కు నార్కో పరీక్షల కోసం తీసుకెళ్లవచ్చని పోలీసులకు అనుమతి ఇచ్చింది.

డీఎన్ఏ రిపోర్టుల కోసం నిరీక్షణ

Shraddha Walker Murder case: ఈ ఏడాది మేలో శ్రద్ధను ఆఫ్తాబ్ చంపాడు. ఆ తర్వాత ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికి ఢిల్లీలోని మెహ్రౌలీ అడవి పరిసరాల్లో పడేశాడు. పోలీసులు ఇప్పటికే కొన్ని శరీర భాగాలను కనుగొన్నారు. అయితే అవన్నీ శ్రద్ధవేనా అని నిర్ధారించేందుకు డీఎన్ఏ టెస్టుకు పంపారు. ప్రస్తుతం డీఎన్ఏ రిపోర్టుల కోసం పోలీసులు వేచిచూస్తున్నారు.

Shraddha Walker Murder: ఈ ఏడాది మే 18న తన లివ్-ఇన్-పార్ట్‌నర్ అయిన శ్రద్ధా వాకర్‌ను చత్తర్‌పూర్‌లోని ఫ్లాట్‍లో గొంతునులిమి చంపాడు ఆఫ్తాబ్. ఆ తర్వాత శరీరాన్ని 35 ముక్కలుగా నరికి, 300 లీటర్ల ఫ్రిడ్జ్ లో పెట్టాడు. 18 రోజుల పాటు మెహ్రౌలీ అడవి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ శరీర భాగాలను పడేశాడు. రక్తాన్ని ఎలా క్లీన్ చేయాలో, శరీరాన్ని ఎలా కోయాలో ఇంటర్నెట్‍లో చూసి తెలుసుకున్నాడు.

తన కూతురు జాడ తెలియడం లేదంటూ శ్రద్ధా వాకర్ తండ్రి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నవంబర్ 12న ఆఫ్తాబ్‍ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించటంతో ఈ హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది.

WhatsApp channel