తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Smartphone - Beer Offer: స్మార్ట్‌ఫోన్ కొంటే బీర్ ఫ్రీ ఆఫర్: చిక్కుల్లో వ్యాపారి

Smartphone - Beer Offer: స్మార్ట్‌ఫోన్ కొంటే బీర్ ఫ్రీ ఆఫర్: చిక్కుల్లో వ్యాపారి

07 March 2023, 10:18 IST

    • Smartphone - Beer Offer: స్మార్ట్‌ఫోన్ కొంటే బీర్ ఫ్రీ అని ఓ మొబైల్ షాప్ వ్యాపారి ఆఫర్ ఇచ్చారు. చివరికి ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏం జరిగిందంటే..!
Smartphone - Beer Offer: స్మార్ట్‌ఫోన్ కొంటే బీర్ ఫ్రీ ఆఫర్: చిక్కుల్లో వ్యాపారి (ప్రతీకాత్మక చిత్రం)
Smartphone - Beer Offer: స్మార్ట్‌ఫోన్ కొంటే బీర్ ఫ్రీ ఆఫర్: చిక్కుల్లో వ్యాపారి (ప్రతీకాత్మక చిత్రం) (HT Photo)

Smartphone - Beer Offer: స్మార్ట్‌ఫోన్ కొంటే బీర్ ఫ్రీ ఆఫర్: చిక్కుల్లో వ్యాపారి (ప్రతీకాత్మక చిత్రం)

Smartphone - Beer Offer: వినియోగదారులను ఆకర్షించేందుకు కొందరు వ్యాపారులు వినూత్నమైన ఆఫర్లను ఇస్తుంటారు. ప్రచారం కొత్త పంథాను అనుసరిస్తుంటారు. ఇదే రీతిలో కస్టమర్ల కోసం ఓ వ్యాపారి వినూత్నమైన ఆఫర్ ప్రకటించాడు. తమ షాప్‍లో స్మార్ట్‌ఫోన్ కొంటే బీర్ ఉచితం అంటూ వెల్లడించాడు. దీంతో జనం ఎగబడ్డారు. ఉత్తరప్రదేశ్‍(Uttar Pradesh)లోని భదోహి(Bhadohi)లో ఇది జరిగింది. ఫోన్‍ కొనుగోలుకు బీర్ ఫ్రీ అని ప్రకటించగానే ఆ షాప్‍కు జనాలు భారీగా వచ్చారు. దీంతో పోలీసులు ఆ షాపు యజమానిని అరెస్ట్ చేశారు. ప్రజల ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నారంటూ ఆ వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలివే..

ట్రెండింగ్ వార్తలు

Cricket ball : జననాంగాలకు క్రికెట్​ బాల్​ తాకి.. 11ఏళ్ల బాలుడు మృతి!

Houston floods : టెక్సాస్​- హూస్టన్​ని ముంచెత్తిన వరద.. భయం గుప్పిట్లో ప్రజలు

ICSE results 2024 : ఐసీఎస్​ఈ క్లాస్​ 10, ఐఎస్సీ క్లాస్​ 12 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

రెండు బీర్ క్యాన్లు ఫ్రీ

Smartphone - Beer Offer: స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేస్తే రెండు బీర్ క్యాన్స్ ఉచితంగా ఇస్తామంటూ చౌరీ రోడ్‍లో మొబైల్ షాప్ నడుపుతున్న రాజేశ్ మౌర్య ప్రకటన ఇచ్చారని కోత్వాలీ పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు వెల్లడించారు. “మార్చి 3వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ మధ్య ఆండ్రాయిడ్ ఫోన్ కొన్న వారికి రెండు బీర్ క్యాన్లు ఫ్రీగా ఇస్తామని పోస్టర్లు, పాంప్లెట్ల ద్వారా రాజేశ్ మౌర్య ప్రచారం చేశారు” అని పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అజయ్ కుమార్ వెల్లడించారు.

Smartphone - Beer Offer: ఈ ఆఫర్ గురించిన సమాచారం ఎక్కువ మంది ప్రజలకు చేరింది. దీంతో ఒక్కసారిగా షాప్‍కు వచ్చారు జనాలు. భారీగా గుమికూడారు. అయితే ఈ ఆఫర్ ప్రకటించిన వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అనిల్ కుమార్ ఆదేశించటంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు.

Smartphone - Beer Offer: సోమవారం సాయంత్రం మొబైల్ షాపు వద్ద ప్రజలు భారీగా గుమికూడిన సమయంలో వ్యాపారి మౌర్యను పోలీసులు అరెస్టు చేశారు. ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించినందుకు ఐపీసీ సెక్షన్ 151 కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అలాగే షాప్‍ను సీజ్ చేసినట్టు వెల్లడించారు.