తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  కీలక రేట్లు యథాతథం.. లాభాల బాటలో షేర్ మార్కెట్లు

కీలక రేట్లు యథాతథం.. లాభాల బాటలో షేర్ మార్కెట్లు

HT Telugu Desk HT Telugu

10 February 2022, 10:46 IST

  • రిజర్వ్ బ్యాంకు కీలక రేట్లను యథాతథంగా ఉంచడంతో స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 440 పాయింట్లు పెరిగి 58,906 పాయింట్ల వద్ద, నిఫ్టీలో 120 పాయింట్లు పెరిగి 17,584 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి.

ముంబైలోని ఆర్బీఐ ప్రధాన కార్యాలయం
ముంబైలోని ఆర్బీఐ ప్రధాన కార్యాలయం (REUTERS)

ముంబైలోని ఆర్బీఐ ప్రధాన కార్యాలయం

రిజర్వ్ బ్యాంక్ కీలక రేట్లను యథాతథంగా ఉంచడంతోపాటు ద్రవ్యోల్బణ దృక్పథం , ప్రపంచ అనిశ్చితి దృష్ట్యా నిరంతర పాలసీ మద్దతు అవసరమని చెప్పడంతో భారతీయ స్టాక్ మార్కెట్లలో షేర్లు గురువారం లాభాలను ఆర్జించాయి.

ట్రెండింగ్ వార్తలు

Cricket ball : జననాంగాలకు క్రికెట్​ బాల్​ తాకి.. 11ఏళ్ల బాలుడు మృతి!

Houston floods : టెక్సాస్​- హూస్టన్​ని ముంచెత్తిన వరద.. భయం గుప్పిట్లో ప్రజలు

ICSE results 2024 : ఐసీఎస్​ఈ క్లాస్​ 10, ఐఎస్సీ క్లాస్​ 12 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక డిపాజిట్ రేటును మార్చకుండా మార్కెట్లను ఆశ్చర్యపరిచింది. స్వల్పకాలిక ద్రవ్య మార్కెట్ రేట్లతో తిరిగి సర్దుబాటు చేయడానికి డిపాజిట్ రేటు పెంపుదలపై కొంతమంది ఆర్థికవేత్తల అంచనాలకు వ్యతిరేకంగా తీసుకున్న ఈ నిర్ణయం మార్కెట్లను ఆశ్చర్యపరిచింది.

సెంట్రల్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ రుణ రేటు లేదా రెపో రేటును 4% వద్ద ఉంచింది. రివర్స్ రెపో రేటు లేదా కీలక రుణ రేటును కూడా 3.35% వద్ద యథాతథంగా ఉంచింది.

ఆర్బీఐ మే 2020 నుంచి కీలకమైన రెపో రేటును రికార్డు స్థాయిలో అలాగే ఉంచింది. ఆర్థిక పునరుద్ధరణ దృఢంగా స్థిరపడే వరకు వృద్ధికి మద్దతుగా తమ వైఖరి ఉంటుందని పునరుద్ఘాటించింది.

విధాన నిర్ణయం తర్వాత దేశపు  10-సంవత్సరాల బెంచ్‌మార్క్ బాండ్ ఈల్డ్ 4 బేసిస్ పాయింట్లు పడిపోయి 6.7610కి చేరుకుంది. డాలర్‌తో రూపాయి బలహీనపడి 75.0275కి చేరుకుంది.

ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు అధిక ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాయి. విదేశీ పెట్టుబడిదారులు అధిక వడ్డీ రేట్ల అంచనాల మధ్య అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌ల నుండి నిష్క్రమించారు. ఈ తరుణంలో 2021లో 20% కంటే ఎక్కువ పెరిగిన నిఫ్టీ, సెన్సెక్స్ రెండూ ఈ సంవత్సరం అమ్మకాలను చవిచూశాయి.

పాలసీ ప్రకటన తర్వాత మారక విలువ ప్రభావానికి లోనయ్యే ఫైనాన్షియల్ షేర్లు భారీగా పెరిగాయి. బుధవారం ముగింపు నాటికి ఈ ఏడాది 8% లాభపడిన నిఫ్టీ బ్యాంకింగ్ ఇండెక్స్ 0.5% పెరిగింది.