తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Meditation In Schools: పాఠశాలల్లో రోజూ 10 నిమిషాలు ధ్యానం తప్పనిసరి

meditation in schools: పాఠశాలల్లో రోజూ 10 నిమిషాలు ధ్యానం తప్పనిసరి

HT Telugu Desk HT Telugu

03 November 2022, 17:46 IST

    • meditation in schools: కర్ణాటకలోని పాఠశాలలు, ఇంటర్మీడియటెడ్ స్థాయి కళాశాల విద్యార్థులు ప్రతి రోజు 10 నిమిషాలు ధ్యానం చేసేలా చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
కర్ణాటక పాఠశాలల్లో ప్రతి రోజూ ధ్యానం (ప్రతీకాత్మక చిత్రం)
కర్ణాటక పాఠశాలల్లో ప్రతి రోజూ ధ్యానం (ప్రతీకాత్మక చిత్రం) (HT_PRINT)

కర్ణాటక పాఠశాలల్లో ప్రతి రోజూ ధ్యానం (ప్రతీకాత్మక చిత్రం)

బెంగుళూరు, నవంబర్ 3: పాఠశాల, ప్రీ-యూనివర్శిటీ కళాశాల విద్యార్థులు ధ్యానం చేసేలా ఆదేశాలు జారీ చేసినట్లు కర్ణాటక పాఠశాల విద్య, అక్షరాస్యత మంత్రి బీసీ నగేష్ గురువారం తెలిపారు. ఈ మేరకు తన శాఖ అధికారులకు నోట్‌ కూడా పంపారు.

ట్రెండింగ్ వార్తలు

Chardham Yatra 2024: చార్ ధామ్ యాత్రకు ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే తేదీ ఇదే; ఆన్ లైన్ లో కూడా చేసుకోవచ్చు

Sexual assault in Delhi Metro: ఢిల్లీ మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి యత్నం; వణికిపోయిన మైనర్

Jammu and Kashmir news: భద్రతా బలగాలపై ఉగ్రవాదుల కాల్పులు; ఐదుగురు జవాన్లకు గాయాలు

Unnatural intercourse: ‘‘భార్యతో అసహజ పద్దతుల్లో శృంగారం చేయడం రేప్ కిందకు రాదు’’ - ఎంపీ హైకోర్టు

‘పాఠశాలలు, ప్రీ-యూనివర్శిటీ కళాశాలల్లో విద్యార్థులకు ప్రతిరోజూ 10 నిమిషాలపాటు ధ్యానం చేసేలా ఒక పీరియడ్ నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించాం. వారి ఏకాగ్రతను పెంచడం, ఆరోగ్యం, సానుకూల ఆలోచనలు, ఒత్తిడి లేని అభ్యాసం, వ్యక్తిత్వ వికాసం.. తద్వారా మంచి లక్షణాలను పెంపొందించడం దీని ఉద్దేశం..’ అని నగేష్ గురువారం ఒక ట్వీట్‌లో సంబంధిత నోట్‌ షేర్ చేశారు.

కర్ణాటక రాష్ట్ర ప్రైమరీ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ అభ్యర్థన మేరకు ఈ చర్య తీసుకున్నట్టు తెలిపారు. కొన్ని పాఠశాలల్లో ఇప్పటికే మెడిటేషన్ సెషన్లు ఉన్నాయని పేర్కొంది.