తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Linking Voter Id With Aadhaar: ఆధార్‌తో ఓటర్ ఐడీ అనుసంధానంపై సుప్రీం విచారణ

Linking voter id with Aadhaar: ఆధార్‌తో ఓటర్ ఐడీ అనుసంధానంపై సుప్రీం విచారణ

HT Telugu Desk HT Telugu

31 October 2022, 13:10 IST

    • Linking voter id with Aadhaar: ఆధార్ నెంబరుతో ఓటర్ గుర్తింపును లింక్ చేయడంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది.
ఆధార్, ఓటర్ ఐడీల అనుసంధానంపై దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు
ఆధార్, ఓటర్ ఐడీల అనుసంధానంపై దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు (HT_PRINT)

ఆధార్, ఓటర్ ఐడీల అనుసంధానంపై దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: ఓటర్ ఐడెంటిటీ డేటాను ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు వీలు కల్పించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ విచారణకు సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది.

మాజీ మేజర్ జనరల్ ఎస్.జి.వొంబాట్‌కెరే దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్ ఎస్‌.కె.కౌల్, అభయ్ ఎస్ ఓకాతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ పరిశీలించింది.

‘పిటిషనర్ 2019 ఆధార్ తీర్పును ప్రధానంగా ప్రస్తావించారు. కొంత ప్రయోజనం కోసం మాత్రమే ఆధార్ తప్పనిసరి కావచ్చు కానీ హక్కులను తిరస్కరించడానికి కాదు. ఓటు హక్కు అటువంటి హక్కులలో అత్యున్నతమైనది..’ అని ధర్మాసనం పేర్కంది.

‘పిటిషనర్ మరో రెండు పిటిషన్లు కూడా దాఖలు చేశారు. కొన్ని అంశాలు పునరావృతం కావొచ్చు. కాబట్టి, దీనిని వాటికి జత చేయడం అవసరం. సదరు పిటిషన్లతో జత చేసి విచారిస్తాం..’ అని ధర్మాసనం పేర్కొంది.

పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది శ్యామ్‌ దివాన్‌ వాదనలు వినిపిస్తూ, ఓటు హక్కు అత్యంత పవిత్రమైనదని, ఆధార్‌ లేకుంటే దానిని తిరస్కరించరాదని వాదించారు.

డూప్లికేట్ ఎంట్రీలను తొలగించడానికి, సర్వీసులో ఉన్న ఓటర్లకు ఎన్నికల చట్టాన్ని జెండర్ న్యూట్రల్ చేసేందుకు కేంద్రం గతంలో ఓటర్ల నమోదు నిబంధనలను సవరించింది.

టాపిక్