తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sbi Hikes Interest Rates On Fixed Deposits: Sbi వడ్డీ రేట్ల పెంపు

SBI hikes interest rates on fixed deposits: SBI వడ్డీ రేట్ల పెంపు

HT Telugu Desk HT Telugu

15 October 2022, 20:56 IST

    • SBI hikes interest rates on fixed deposits: భారతదేశ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఫిక్స్ డ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీ ని పెంచుతున్నట్లు ప్రకటించింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రూ. 2 కోట్ల లోపు ఉన్న అన్ని ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచుతున్నట్లు SBI శనివారం ప్రకటించింది. కొత్త వడ్డీ రేట్లు అక్టోబర్ 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

Chardham Yatra 2024: చార్ ధామ్ యాత్రకు ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే తేదీ ఇదే; ఆన్ లైన్ లో కూడా చేసుకోవచ్చు

Sexual assault in Delhi Metro: ఢిల్లీ మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి యత్నం; వణికిపోయిన మైనర్

Jammu and Kashmir news: భద్రతా బలగాలపై ఉగ్రవాదుల కాల్పులు; ఐదుగురు జవాన్లకు గాయాలు

SBI hikes interest rates on fixed deposits: 20 బేసిస్ పాయింట్ల వరకు

ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను SBI 20 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. పెంచిన వడ్డీ రేట్ల అనంతరం.. 7 రోజుల నుంచి 10 ఏళ్ల కాల పరిమితి గల డిపాజిట్లకు 3.0% నుంచి 5.85% వరకు వడ్డీ లభిస్తుంది. అలాగే, సీనియర్ సిటిజన్లకు 3.5% నుంచి 6.65% వరకు వడ్డీ లభిస్తుంది.

మినిమం 3 శాతం.. మాగ్జిమం 6.65%

- 7 రోజుల నుంచి 45 రోజలు కాలపరిమితి కలిగిన ఎఫ్ డీల వడ్డీ రేటును 2.9% నుంచి 3.0 శాతానికి పెంచారు.

- 46 రోజుల నుంచి 179 రోజలు కాలపరిమితి కలిగిన ఎఫ్ డీల వడ్డీ రేటును 3.9% నుంచి 4.0 శాతానికి పెంచారు.

-180 రోజుల నుంచి 210 రోజలు కాలపరిమితి కలిగిన ఎఫ్ డీల వడ్డీ రేటును 4.55% నుంచి 4.65 శాతానికి పెంచారు.

- 211 రోజుల నుంచి సంవత్సరం లోపు కాలపరిమితి కలిగిన ఎఫ్ డీల వడ్డీ రేటును 4.6% నుంచి 4.70 శాతానికి పెంచారు.

- సంవత్సరం నుంచి రెండు సంవత్సారాల లోపు కాలపరిమితి కలిగిన ఎఫ్ డీల వడ్డీ రేటును 5.45% నుంచి 5.60 శాతానికి పెంచారు.

- 2 సంవత్సరాల నుంచి మూడు సంవత్సారాల లోపు కాలపరిమితి కలిగిన ఎఫ్ డీల వడ్డీ రేటును 5.50% నుంచి 5.65 శాతానికి పెంచారు.

- 3 సంవత్సరాల నుంచి ఐదు సంవత్సారాల లోపు కాలపరిమితి కలిగిన ఎఫ్ డీల వడ్డీ రేటును 5.60% నుంచి 5.80 శాతానికి పెంచారు.

- 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సారాల లోపు కాలపరిమితి కలిగిన ఎఫ్ డీల వడ్డీ రేటును 5.65% నుంచి 5.85 శాతానికి పెంచారు.

- సీనియర్ సిటిజన్లకు పైన పేర్కొన్న వడ్డీ రేట్లపై 0.5% అదనంగా లభిస్తుంది.