తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rupee Hit Lifetime Low: డాలరుతో పోల్చితే 79.90కి పడిపోయిన రూాపాయి

Rupee hit lifetime low: డాలరుతో పోల్చితే 79.90కి పడిపోయిన రూాపాయి

HT Telugu Desk HT Telugu

14 July 2022, 17:54 IST

  • Rupee hit lifetime low: డాలరుతో పోల్చితే రూపాయి విలువ ఆల్ టైమ్ దిగువకు పడిపోయింది.

డాలరుతో పోలిస్తే రూపాయి విలువ మరింత పతనం
డాలరుతో పోలిస్తే రూపాయి విలువ మరింత పతనం (REUTERS)

డాలరుతో పోలిస్తే రూపాయి విలువ మరింత పతనం

ముంబై, జూలై 14: విదేశీ మార్కెట్లలో అమెరికా డాలర్ స్థిరంగా ఉండటం, మూలధన ప్రవాహం కారణంగా గురువారం యుఎస్ కరెన్సీ డాలరుతో పోల్చితే రూపాయి మరో 9 పైసలు క్షీణించి 79.90 వద్దకు జారుకుని ఆల్ టైమ్ దిగువకు చేరుకుంది.

ట్రెండింగ్ వార్తలు

Houston floods : టెక్సాస్​- హూస్టన్​ని ముంచెత్తిన వరద.. భయం గుప్పిట్లో ప్రజలు

ICSE results 2024 : ఐసీఎస్​ఈ క్లాస్​ 10, ఐఎస్సీ క్లాస్​ 12 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం వల్ల రూపాయి పరిమితంగా నష్టపోయిందని, లేదంటే ఇది మరింతగా ఉండేదని ఫారెక్స్ డీలర్లు తెలిపారు.

ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్లో స్థానిక కరెన్సీ రూపాయి 79.72 వద్ద బలంగా ఓపెన్ అయ్యింది. డే ట్రేడ్‌లో యూఎస్ డాలర్‌తో పోలిస్తే ఇంట్రా-డే గరిష్టంగా 79.71కి బలపడింది. కనిష్టంగా 79.92 స్థాయికి పడిపోయింది.

రూపాయి చివరకు డాలర్‌తో పోలిస్తే 79.90 వద్ద స్థిరపడింది. క్రితం ముగింపుతో పోలిస్తే 9 పైసలు తగ్గింది.

ఆరు కరెన్సీల బాస్కెట్‌తో డాలర్ బలాన్ని అంచనా వేసే డాలర్ ఇండెక్స్ 0.37 శాతం పెరిగి 108.36 వద్ద ట్రేడవుతోంది.

గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 2.20 శాతం తగ్గి 97.38 డాలర్లకు చేరుకుంది.

దేశీయ ఈక్విటీ మార్కెట్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ 98 పాయింట్లు (0.18 శాతం) క్షీణించి 53,416.15 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 28.00 పాయింట్లు (0.18 శాతం) క్షీణించి 15,938.65 వద్ద ముగిసింది.

విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు గురువారం క్యాపిటల్ మార్కెట్‌లో నికర అమ్మకందారులుగా ఉన్నారు. ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం వారు రూ. 2,839.52 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.

టాపిక్