తెలుగు న్యూస్  /  National International  /  Recruitment For 5151 Vacancies In Itbp Is Underway Minister Nityanand Rai

ITBP Recruitment: “ఐటీబీపీలో 5,515 పోస్టులను భర్తీ చేస్తాం”

15 March 2023, 12:49 IST

    • ITBP Recruitment: ఐటీబీపీలో నియామకాలను చేపట్టనున్నట్టు కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ వెల్లడించారు. పార్లమెంటు వేదికగా ఈ విషయాన్ని చెప్పారు.
ITBP Recruitment: “ఐటీబీపీలో 5,515 పోస్టులను భర్తీ చేస్తాం” (Twitter)
ITBP Recruitment: “ఐటీబీపీలో 5,515 పోస్టులను భర్తీ చేస్తాం” (Twitter) (HT Photo)

ITBP Recruitment: “ఐటీబీపీలో 5,515 పోస్టులను భర్తీ చేస్తాం” (Twitter)

ITBP Recruitment: ఇండో టిబెటెన్ బోర్డర్ పోలీస్ (Indo Tibetan Border Police - ITBP)లో వేలాది పోస్టులను భర్తీ చేయనున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ (Nityanand Rai) వెల్లడించారు. ఐటీబీపీలో వివిధ ర్యాంకుల్లో 5,151 పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఐటీబీపీకి సంబంధించి పార్లమెంటులో ఎదురైన ఓ ప్రశ్నకు మంగళవారం ఆయన ఈ సమాధానం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన కసరత్తు జరుగుతోందని ఆయన చెప్పారు.

కొత్త బెటాలియన్లలోనూ..

ITBP Recruitment: ఐటీబీపీలో రానున్న మూడేళ్లలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఏడు బెటాలియన్‍లలో మరిన్ని నియామాకాలు ఉంటాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. “సంవత్సరం గడువులోగా ఏడు బెటాలియన్ల కోసం తొలి దశ రిక్రూట్‍మెంట్‍గా 3000 మందిని నియమించుకుంటాం. పోస్టుల భర్తీ ప్రక్రియ మూడు సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఈ నియామక ప్రక్రియను ఎస్‍ఎస్‍సీ (SSC) నిర్వహిస్తుంది” అని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు.

ITBP Recruitment: మరోవైపు ఐటీబీపీకి క్రమంగా ఎక్కువ నిధులు కేటాయిస్తూ వస్తున్నామని కేంద్ర మంత్రి రాయ్ చెప్పారు. 2021-22 బడ్జెట్‍లో ఆ పారామిలటరీ దళానికి రూ.7,588.43 కోట్లు కేటాయించగా.. 2022-23 బడ్జెట్‍లో రూ.8,196.98 కోట్లు అలాట్ చేసినట్టు వెల్లడించారు.

ITBP Recruitment: చైనా సరిహద్దు(China Border)లో అదనంగా 9,400 మంది సిబ్బందిని బందోబస్తుకు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం గత వారం అనుమతించింది. ఈ 9,400 మందికి అరుణాచల్ ప్రదేశ్‍లో పోస్టింగ్ ఇస్తారు. అక్కడే ఐటీబీపీ కొత్త సెక్టార్ హెడ్‍కార్వర్ట్స్ ఏర్పాటవుతోంది. వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వద్ద చైనాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ మంది భద్రతా సిబ్బందిని మోహరించాలని కేంద్రం ఆలోచిస్తోంది. హిమాచల్ ప్రదేశ్, లద్ధాఖ్, కశ్మీర్, ఉత్తరాఖండ్, సిక్కింగ్, అరుణాచల్ ప్రదేశ్‍లోని ఇండో-చైనా సరిహద్దు వద్ద 3,488 కిలోమీటర్ల మేర ఐటీబీపీ గార్డ్స్ విధులు నిర్వహిస్తున్నారు.

కాగా, ఉత్తరాఖండ్‍లోని ఉత్తర కాశీలో పర్యటన సందర్భంగా కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాధిత్య సింధియా(Jyotiraditya Scindia).. ఐటీబీపీ సిబ్బందిని మంగళవారం కలిశారు. భారత సరిహద్దును సంరక్షిస్తున్న సిబ్బందిని అభినందించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైబ్రెంట్ విలేజెస్ కార్యక్రమంలో భాగంగా ఈ పర్యటన చేశారు సింధియా.