తెలుగు న్యూస్  /  National International  /  Raj Thackeray Reiterates May 3 Deadline For Removal Of Loudspeakers Atop Mosques

మహారాష్ట్రలో అలజడులు తప్పవా? 'డెడ్​లైన్​'​ తర్వాత ఏం జరుగుతుంది?

HT Telugu Desk HT Telugu

01 May 2022, 22:25 IST

  • తాను ఇచ్చిన డెడ్​లైన్​లోపు మసీదుల్లో లౌడ్​స్పీకర్లను తొలగించాలని ఎంఎన్​ఎస్​ అధ్యక్షుడు రాజ్​ ఠాక్రే హెచ్చరించారు. లేకపోతే.. ఆ తర్వాత జరిగే పరిణామాలకు తాను బాధ్యుడిని కాదని తేల్చిచెప్పారు. 

రాజ్​ ఠాక్రే
రాజ్​ ఠాక్రే (ANI)

రాజ్​ ఠాక్రే

Raj Thackeray loudspeaker | మహారాష్ట్రలో లౌడ్​స్పీకర్​ వివాదం మరింత తీవ్రరూపం దాల్చింది. మసీదుల్లో లౌడ్​స్పీకర్ల తొలగింపునకు ఈ నెల 3వ తేదీ డెడ్​లైన్​ అని ఎంఎన్​ఎస్​ అధ్యక్షుడు రాజ్​ ఠాక్రే పునరుద్ఘాటించారు. అప్పటిలోగా రాష్ట్రంలోని మసీదుల్లో లౌడ్​స్పీకర్లు తొలగించాలని.. లేకపోతే ఆ తర్వాత ఏం జరిగినా తాను బాధ్యుడిని కానని తేల్చిచెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

Miss Universe: మిస్ యూనివర్స్ బ్యూనోస్ ఎయిర్స్ పోటీలో విజేతగా నిలిచింది ఒక 60 ఏళ్ల మోడల్..

Manipur news: మణిపూర్ లో సీఆర్పీఎఫ్ క్యాంప్ పై కుకీ మిలిటెంట్ల దాడి; ఇద్దరు జవాన్లు మృతి

Nainital fire: నైనిటాల్ అడవుల్లో కార్చిచ్చు; జనావాసాల్లోకి విస్తరిస్తున్న మంటలు

JEE Advanced 2024 : నేడు జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ- ఇలా అప్లై చేసుకోండి..

ఔరంగాబాద్​లో ఆదివారం సాయంత్రం బహిరంగ సభ నిర్వహించారు రాజ్​​ ఠాక్రే. ఈ సభకు వేలాది మంది తరలివెళ్లారు. ఈ క్రమంలోనే డెడ్​లైన్​ గురించి రాజ్​ ఠాక్రే మాట్లాడారు.

"మసీదుల్లో లౌడ్​స్పీకర్​ అనేది మతపరమైన వ్యవహారం కాదు. ఇదొక సామాజిక సమస్య. లౌడ్​స్పీకర్లు చట్టానికి విరుద్ధం. ఈ విషయం సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. మసీదుల్లో లౌడ్​స్పీకర్లతో ముస్లింలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఓ జర్నలిస్టు నా దగ్గరకి వచ్చి ఈ విషయాన్ని చెప్పాడు. తాను ముస్లిం అని, కానీ మసీదుల్లో లౌడ్​స్పీకర్​ వల్ల తన పిల్లలు పడుకోవడం లేదని, చాలా ఇబ్బందిగా ఉందని అన్నాడు. నేడు.. మహారాష్ట్ర దినోత్సవంలో తొలిరోజు. నాలుగో రోజు నుంచి నేను ఎవరి మాట వినను. 3వ తేదీన ఈద్​ పండుగ ఉంది. ముస్లింలను నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కానీ లౌడ్​స్పీకర్లను తొలగించాల్సిందే. పోలీసులు ఆ పని చేయాలి. లేకపోతే మేము స్పందించాల్సి ఉంటుంది. మేము మసీదుల వద్దకు వెళతాము. మసీదుల ఎదుట రెండింతల శక్తితో హనుమాన్​ చాలీసా పెడతాము. ముస్లింలు అందరు మా హనుమన్​ చాలీసా వినాలి," అని రాజ్​ ఠాక్రే తేల్చిచెప్పారు.

Loudspeaker controversy | రాష్ట్రంలో అలజడులు, ఘర్షణలు సృష్టించడం తన ఉద్దేశం కాదని, కానీ ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాజ్​ ఠాక్రే ఆరోపించారు.

ఈ క్రమంలోనే తన బంధువు, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ ఠాక్రేపై రాజ్​ ఠాక్రే మండిపడ్డారు. ఉత్తర్​ప్రదేశ్​లో లౌడ్​స్పీకర్లను తొలగించారని గుర్తుచేశారు. అలాంటిది.. మహారాష్ట్రంలో లౌడ్​స్పీకర్లను తొలగించేందుకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు.