తెలుగు న్యూస్  /  National International  /  Rahul Gandhi Looks Like Saddam Hussein, Says Assam Cm Sarma; Cong Terms Him 'Petty Troll'

Assam CM comments on Rahul Gandhi looks: ‘రాహుల్ సద్దాం హుస్సేన్ లా ఉన్నారు’

HT Telugu Desk HT Telugu

23 November 2022, 16:49 IST

  • Assam CM comments on Rahul Gandhi looks: బీజేపీ నేత, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ సద్దాం హుస్సేన్ లా కనిపిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

మధ్య ప్రదేశ్ లో భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో ఆ రాష్ట్ర మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్
మధ్య ప్రదేశ్ లో భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో ఆ రాష్ట్ర మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ (PTI)

మధ్య ప్రదేశ్ లో భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో ఆ రాష్ట్ర మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్

Assam CM comments on Rahul Gandhi looks: భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ ఎప్పటిలా క్లీన్ షేవ్ తో కాకుండా, గడ్డం పెంచుకుని కనిపిస్తున్నారు. రెగ్యులర్ గా గడ్డం తీయకపోవడంతో ఆయన డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. దీనిపై కూడా బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

Crime news: బ్లాక్ మెయిల్ చేసి క్లాస్ మేట్ నుంచి రూ.35 లక్షలు లాక్కున్న టెంత్ క్లాస్ విద్యార్థులు

Bengaluru news: ‘‘1983 తర్వాత బెంగళూరుకు ఈ దుస్థితి రావడం ఈ సంవత్సరమే..’’; ఐఎండీ శాస్త్రవేత్త వెల్లడి

Delhi school: ఢిల్లీ స్కూల్స్ కు బాంబు బెదిరింపులు : 'ఫేక్' గా భావిస్తున్న పోలీసులు

Assam CM comments on Rahul Gandhi looks: సద్దాం హుస్సేన్ లా…

గడ్డంతో రాహుల్ గాంధీ ఇరాక్ మాజీ అధ్యక్షుడు, నియంత సద్దాం హుస్సేన్ లా కనిపిస్తున్నారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ వ్యాఖ్యానించారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో బుధవారం శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ మధ్య రాహుల్ గాంధీని చూశాను. ఆయన తన అవతారాన్ని మార్చుకున్నట్లు కనిపిస్తుంది. ఆ మార్చుకునేదేదో తన ముత్తాత జవహర్ లా్ నెహ్రూలాగానో, లేకపోతే మహాత్మాగాంధీలాగానో, లేక సర్దార్ వల్లభాయి పటేల్ లాగానో మార్చుకుంటే బావుండేది. కానీ, ఆయన మాత్రం సద్దాం హుస్సేల్ లా తన అవతారం మార్చుకున్నారు. కాంగ్రెస్ తీరే అంత. భారతీయతతో వారు అంతగా మమేకమవలేరు’’ అని శర్మ వ్యాఖ్యానించారు.

Assam CM comments on Rahul Gandhi looks: భారత్ జోడో యాత్రపై..

అలాగే, రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో నర్మద బచావో ఆందోళన్ నేత మేథ పాట్కర్ పాల్గొనడాన్ని గుర్తు చేస్తూ, మేధా పాట్కర్ గుజరాత్ అభివృద్ధికి వ్యతిరేకమని, ఆమె ఆందోళన విజయవంతమైతే, కచ్ ప్రాంతానికి తాగు, సాగునీరే అందేది కాదని విమర్శించారు. అస్సాం సీఎం శర్మ విమర్శలపై కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ స్పందించారు. ఒక సీఎం హోదాలో ఉన్న నాయకుడు మాట్లాడాల్సిన చిల్లర మాటలు అవి కావని తివారీ విమర్శించారు. ‘అస్సాం సీఎం వ్యాఖ్యలపై స్పందించడమంటే మనల్ని మనం దిగజార్చుకోవడమే. ఒక సీఎం పదవిలో ఉన్న వ్యక్తి అంత చిల్లరగా మాట్లాడుతున్నాడు. కొంత వివేకం, కొంత మర్యాద నేర్చుకుంటే మంచిది’ అని తివారీ స్పందించారు. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తికి కొన్ని విలువలు ఉండడం అవసరం అని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.

Bharat Jodo Yatra in Madhya Prsdesh: మధ్య ప్రదేశ్ లోకి భారత్ జోడో యాత్ర

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర బుధవారం మధ్య ప్రదేశ్ లో ప్రవేశించింది. ఈ రాష్ట్రంలో కొనసాగే యాత్రలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ కూడా పాల్గొననున్నారు. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇప్పటివరకు తమిళనాడు, కేరళ, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రల్లో ముగిసింది.