తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Amritpal Singh Manhunt: అమృత్ పాల్ సింగ్ దేశం విడిచి పారిపోయాడా?

Amritpal Singh manhunt: అమృత్ పాల్ సింగ్ దేశం విడిచి పారిపోయాడా?

HT Telugu Desk HT Telugu

21 March 2023, 14:33 IST

  • Amritpal Singh manhunt: ‘వారిస్ పంజాబ్ దే’(Waris Punjab de) చీఫ్, ఖలిస్తానీ అనుకూల నేత అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) కోసం పంజాబ్ పోలీసుల వేట కొనసాగుతోంది. ఆయన దేశం విడిచి వెళ్లాడన్న వార్తల నేపథ్యంలో ఆయన అనుయాయుల అరెస్ట్ ల పర్వం కూడా కొనసాగుతోంది.

పంజాబ్ లో భారీగా భద్రత బలగాల మోహరింపు
పంజాబ్ లో భారీగా భద్రత బలగాల మోహరింపు

పంజాబ్ లో భారీగా భద్రత బలగాల మోహరింపు

Amritpal Singh manhunt:పంజాబ్ (punjab) లో హై అలర్ట్ కొనసాగుతోంది. మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలపై ఆంక్షలను మార్చి 23 వరకు పొడిగించింది. ‘వారిస్ పంజాబ్ దే’(Waris Punjab de) చీఫ్, ఖలిస్తానీ అనుకూల నేత అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) కోసం పంజాబ్ పోలీసుల వేట కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆయన అనుచరుల్లో 125 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Cricket ball : జననాంగాలకు క్రికెట్​ బాల్​ తాకి.. 11ఏళ్ల బాలుడు మృతి!

Houston floods : టెక్సాస్​- హూస్టన్​ని ముంచెత్తిన వరద.. భయం గుప్పిట్లో ప్రజలు

ICSE results 2024 : ఐసీఎస్​ఈ క్లాస్​ 10, ఐఎస్సీ క్లాస్​ 12 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Amritpal Singh manhunt: దేశం విడిచి వెళ్లాడా?

నాటకీయంగా పోలీసుల నుంచి తప్పించుకున్న ‘వారిస్ పంజాబ్ దే’(Waris Punjab de) చీఫ్, ఖలిస్తానీ (khalistan) అనుకూల నేత అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) పంజాబ్ లో లేడని, దేశం విడిచి వెళ్లి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఖలిస్తానీ నేత, ఆపరేషన్ బ్లూ స్టార్ సమయంలో చనిపోయిన బింద్రన్ వాలే తరహాలో డ్రెస్ చేసుకునే అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh).. ఆ తరహా వస్త్ర ధారణను మార్చుకుని, పోలీసుల కళ్లు గప్పి, మొదట పంజాబ్ (punjab), ఆ తరువాత దేశం విడిచి వెళ్లాడని భావిస్తున్నారు. అరెస్టైన ఆయన అనుచరులు, ఖలిస్తాన్ (khalistan) మద్దతుదారుల నుంచి అందుతున్న సమాచారం మేరకు పోలీసులు ఈ నిర్ణయానికి వచ్చారు.

Amritpal Singh manhunt: భారీగా ఆయుధాలు..

పోలీసులు ఇప్పటివరకు సుమారు 125 మంది అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) అనుచరులు, ఖలిస్తాన్ (khalistan) మద్దతుదారులను అరెస్ట్ చేశారు. అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) అంకుల్ అలాగే డ్రైవర్ అయిన హర్జిత్ సింగ్ పోలీసులకు లొంగిపోయారు. అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) ఉపయోగించిన మారుతి బ్రెజా కారుతో పాటు మరికొన్ని వాహనాలను, వాటిలో భారీగా ఆయుధాలను, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతల పరిస్థితి దిగజారకుండా పంజాబ్ వ్యాప్తంగా భారీగా బలగాలను మోహరించారు. పలు సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.