తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pm Modi Inaugurates Kashi Tamil Sangamam: ‘కాశి-తమిళ సంగమం’ ప్రారంభించిన మోదీ

PM Modi inaugurates Kashi Tamil Sangamam: ‘కాశి-తమిళ సంగమం’ ప్రారంభించిన మోదీ

HT Telugu Desk HT Telugu

19 November 2022, 20:04 IST

    • PM Modi inaugurates Kashi Tamil Sangamam: భారత పురాతన విజ్ఞాన కేంద్రాలైన వారణాసి, తమిళనాడుల మధ్య సంబంధాలపై వారణాసిలో ఏర్పాటైన ‘కాశి-తమిళ సంగమం’ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PTI)

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

PM Modi inaugurates Kashi Tamil Sangamam: ఈ కాశి తమిళ సంగమం కార్యక్రమాన్ని కేంద్ర విద్యా శాఖ నిర్వహిస్తోంది. నెల రోజుల పాటు వివిధ కార్యక్రమాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తమిళనాడు, కాశీల మధ్య శతాబ్దాలుగా కొనసాగుతున్న సంబంధాలను మరోసారి గుర్తు చేసుకుని, వాటిని మరింత బలోపేతం చేసుకునే దిశగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Houston floods : టెక్సాస్​- హూస్టన్​ని ముంచెత్తిన వరద.. భయం గుప్పిట్లో ప్రజలు

ICSE results 2024 : ఐసీఎస్​ఈ క్లాస్​ 10, ఐఎస్సీ క్లాస్​ 12 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

PM Modi inaugurates Kashi Tamil Sangamam: వారణాసిలో కార్యక్రమం

ఈ కాశి, తమిళ సంగమం కార్యక్రమాన్ని ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. ఈ రెండు ప్రధాన విద్యా కేంద్రాల విశిష్టతను, రెండింటి మధ్య శతాబ్దాలుగా నెలకొన్న సంబంధాలను మరోసారి గుర్తు చేసుకుని, ఉత్సవంగా జరుపుకునే లక్ష్యంతో ఈ కార్యక్రమం రూపొందిందని ప్రధాని తెలిపారు. ‘సంగమం అంటే కలయిక. నదుల సంగమం, ఆలోచనల సంగమం, విజ్ఞానాల సంగమం.. వీటికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సంగమం రెండు సంస్కృతుల సంగమం’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

PM Modi inaugurates Kashi Tamil Sangamam: కేంద్ర విద్యా శాఖ నిర్వహణ

ఈ కార్యక్రమాన్ని కేంద్ర సాంస్కృతిక, టెక్స్ టైల్స్, రైల్వే, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్, సమాచార ప్రసార శాఖలతో పాటు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర విద్యా శాఖ నిర్వహిస్తోంది. ఈ రెండు ప్రాంతాల విద్యార్థులకు, పరిశోధకులకు, కళాకారులకు, తత్వవేత్తలకు ఇదో సువర్ణావకాశం. తమ ప్రాంతాల గొప్పదనం, తమ రెండు ప్రాంతాల మధ్య తరతరాలుగా కొనసాగుతున్న సంబంధాలపై అవగాహన పెంచుకునే అవకాశం వారికి లభిస్తోంది. ఐఐటీ మద్రాసు, బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం ఈ కార్యక్రమ నిర్వహణలో సహకరిస్తున్నాయి.