తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pm Kisan Samman Nidhi: 12వ విడత నగదు వచ్చేది అప్పుడే... ఇలా చెక్ చేసుకోండి

PM Kisan Samman Nidhi: 12వ విడత నగదు వచ్చేది అప్పుడే... ఇలా చెక్ చేసుకోండి

HT Telugu Desk HT Telugu

04 August 2022, 16:43 IST

    • pm kisan samman nidhi funds: త్వరలోనే పీఎం కిసాన్ స్కీమ్ 12 విడత డబ్బుల జమ చేసేందుకు సిద్ధమవుతోంది కేంద్ర ప్రభుత్వం. ఇందుకు ఏర్పాట్లు చేసే పనిలో పడింది. ఇక మీ వివరాలు కూడా చాలా సింపుల్ గా తెలసుకోవచ్చు. అందుకోసం కింద సూచించిన విధంగా చేయండి.
పీఎం కిసాన్ సమ్మాన్ 12వ విడత నిధులు
పీఎం కిసాన్ సమ్మాన్ 12వ విడత నిధులు (HT)

పీఎం కిసాన్ సమ్మాన్ 12వ విడత నిధులు

pm kisan samman nidhi 12th installment: త్వరలోనే రైతులకు గుడ్ న్యూస్ చెప్పనుంది కేంద్ర ప్రభుత్వం. పెట్టుబడి సాయం కింద ప్రతి ఏడాది రూ.6వేల రూపాయలను.. పలు విడుతల్లో ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా 12వ విడత నిధుల జమకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. త్వరలోనే మరో దఫా రూ. 2వేలను జమ చేయనుంది.

ట్రెండింగ్ వార్తలు

Covid vaccine: సేఫ్టీ ఇష్యూస్ కారణంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఉపసంహరించుకోనున్న ఆస్ట్రాజెనెకా

Haryana: హరియాణాలో సంక్షోభంలో బీజేపీ సర్కారు; అసెంబ్లీలో మారిన సంఖ్యాబలం

US crime news: ‘‘డాడీకి గుడ్ బై చెప్పు’’ - మూడేళ్ల కొడుకును షూట్ చేసి చంపేసిన కర్కశ తల్లి

Dhruv Rathee: ధృవ్​ రాఠీ: సోషల్ మీడియా సంచలనం.. మోదీనే ఎందుకు టార్గెట్ చేశారు?

ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. 12వ విడత పీఎం కిసాన్ నిధులను ఆగస్టు చివరి వారంలో లేదా నవంబర్ తొలి వారంలో జమ చేసే అవకాశం ఉంది. ఇక మే 31న 11వ విడత మొత్తాన్ని 10 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాలకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే.

మీ వివరాలు ఇలా చెక్ చేసుకోవచ్చు

పీఎం కిసాన్ కు సంబంధించిన వివరాలను మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం pmkisan.gov.in వెబ్ సైట్ లోకి లాగిన్ అవ్వాలి. ఇందులో కుడి వైపున ఫార్మర్ కర్నార్ (Farmers Corner) అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే click Beneficiary Status అనే అప్షన్ కనిపిసుంది. దీంట్లో ఆధార్, బ్యాంక్, అనుసంధానం చేసిన మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసి మీ ఖాతా వివరాలను తెలుసుకోవచ్చు. మీ వివరాలు నమోదు కాకపోతే సంబంధిత వివరాలు ఇందులో కనిపించవు.

యాప్ డౌన్లోడ్ చేసుకుంటే...

మొబైల్ యాప్ సాయంతో కూడా మీ పేరును చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీ ఫోన్లో PM KISAN Appని డౌన్లోడ్ చేసుకోవాలి. సంబంధిత వివరాలను నమోదు చేస్తే కూడా పూర్తి వివరాలను క్షణాల్లో తెలుసుకోవచ్చు.

ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో 2019లో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ప్రతీ ఏటా రూ.6,000 ఆర్థిక సాయం అందిస్తున్నారు. ప్రతీ ఏటా మూడు విడతల్లో రూ.2,000 చొప్పున మొత్తం రూ.6,000ను జమ చేస్తారు. ఇప్పటి వరకు 11 ఇన్‌స్టాల‌్‌మెంట్స్ లో డబ్బుల లబ్ధిదారుల ఖాతాల్లో వేశారు. త్వరలోనే 12వ విడత నిధులు కూడా రానున్నాయి.

ఈ స్కీమ్ అందలాంటే పలు పరిమితులు ఉన్నాయి. కేవలం రెండు హెక్టార్లలోపు భూమి ఉన్న రైతులకే మాత్రమే అందిస్తారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు, ఎక్స్ ఆర్మీ, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు అర్హులు కారు. పదవీ విరమణ తరువాత పెన్షన్ పొందే వాళ్లు కూడా ఈ పథకాన్ని దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు.

టాపిక్