తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ఆ రోజునే పీఎం కిసాన్ నిధులు..! సింపుల్ గా ఇలా మీ వివరాలు చెక్ చేసుకోవచ్చు

ఆ రోజునే పీఎం కిసాన్ నిధులు..! సింపుల్ గా ఇలా మీ వివరాలు చెక్ చేసుకోవచ్చు

HT Telugu Desk HT Telugu

08 April 2022, 10:44 IST

    • త్వరలోనే పీఎం కిసాన్ స్కీమ్ 11 విడత డబ్బుల జమ చేసేందుకు సిద్ధమవుతోంది కేంద్ర ప్రభుత్వం. ఇందుకు శ్రీరామనవమి, లేదా అంబేద్కర్ జయంతి రోజును ఖరారు చేసినట్లు సమాచారం. మీ వివరాలు చాలా సింపుల్ గా తెలసుకోవచ్చు. అందుకోసం కింద సూచించిన విధంగా చేయండి.
త్వరలో పీఎం కిసాన్ నిధులు
త్వరలో పీఎం కిసాన్ నిధులు (HT)

త్వరలో పీఎం కిసాన్ నిధులు

త్వరలోనే రైతులకు గుడ్ న్యూస్ చెప్పనుంది కేంద్ర ప్రభుత్వం. పెట్టుబడి సాయం కింద ప్రతి ఏడాది రూ.6వేల రూపాయలను.. పలు విడుతల్లో ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా 11వ విడత నిధుల జమకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. త్వరలోనే మరో దఫా రూ. 2వేలను జమ చేయనుంది.

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

ఆ రోజునే జమ....

ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. 11వ విడత పీఎం కిసాన్ నిధులను శ్రీరామనవమి రోజున విడుదల చేసే అవకాశం ఉంది. ఇదీకాకకపోతే.. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా నిధులు విడుదల చేయవచ్చని సమాచారం. గతేడాది ఏప్రిల్-వాయిదాను మే 15న విడుదల చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈసారి అంతకన్నా ముందే నిధులు విడుదల చేయవచ్చు.

మీ వివరాలు ఇలా చెక్ చేసుకోవచ్చు

పీఎం కిసాన్ కు సంబంధించిన వివరాలను మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం pmkisan.gov.in వెబ్ సైట్ లోకి లాగిన్ అవ్వాలి. ఇందులో కుడి వైపున ఫార్మర్ కర్నార్ (Farmers Corner) అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే click Beneficiary Status అనే అప్షన్ కనిపిసుంది. దీంట్లో ఆధార్, బ్యాంక్, అనుసంధానం చేసిన మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసి మీ ఖాతా వివరాలను తెలుసుకోవచ్చు. మీ వివరాలు నమోదు కాకపోతే సంబంధిత వివరాలు ఇందులో కనిపించవు.

యాప్ డౌన్లోడ్ చేసుకుంటే...

మొబైల్ యాప్ సాయంతో కూడా మీ పేరును చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీ ఫోన్లో PM KISAN Appని డౌన్లోడ్ చేసుకోవాలి. సంబంధిత వివరాలను నమోదు చేస్తే కూడా పూర్తి వివరాలను క్షణాల్లో తెలుసుకోవచ్చు.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో 2019లో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ప్రతీ ఏటా రూ.6,000 ఆర్థిక సాయం అందిస్తున్నారు. ప్రతీ ఏటా మూడు విడతల్లో రూ.2,000 చొప్పున మొత్తం రూ.6,000ను జమ చేస్తారు. ఇప్పటి వరకు 10 ఇన్‌స్టాల‌్‌మెంట్స్ లో డబ్బుల లబ్ధిదారుల ఖాతాల్లో వేశారు. త్వరలోనే 11వ విడత నిధులు కూడా రానున్నాయి.

వీరు అర్హులు కాదు..

ఈ స్కీమ్ అందలాంటే పలు పరిమితులు ఉన్నాయి. కేవలం రెండు హెక్టార్లలోపు భూమి ఉన్న రైతులకే మాత్రమే అందిస్తారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు, ఎక్స్ ఆర్మీ, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు అర్హులు కారు. పదవీ విరమణ తరువాత పెన్షన్ పొందే వాళ్లు కూడా ఈ పథకాన్ని దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు.

తదుపరి వ్యాసం