తెలుగు న్యూస్  /  National International  /  Planning To Study In Canada? How You Can Find Best Courses At Affordable Rates

Education in Canada: కెనడాలో చదవాలని ఉందా? ఈ వివరాలు మీ కోసమే..

HT Telugu Desk HT Telugu

10 December 2022, 23:39 IST

  • Study in Canada: విదేశాల్లో విద్యను అభ్యసించడం ఇప్పుడు భారత్ లోని దాదాపు ప్రతీ విద్యార్థికి, వారి తల్లిదండ్రులకు లక్ష్యంగా మారింది. ఆ మేరకు పలు విదేశాల్లోని యూనివర్సిటీలు భారతీయ విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తున్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Study in Canada: విదేశాల్లో చదవాలనుకునే చాలా మంది విద్యార్థులకు కెనడా ఇష్టమైన డెస్టినేషన్. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ ల్లోని వర్సిటీల భారీ ఫీజులను భరించలేని విద్యార్థులకు కెనడా వర్సిటీలే ప్రత్యామ్నాయంగా మారాయి.

Less cost of Living: జీవన వ్యయం కూడా తక్కువే..

అమెరికా, బ్రిటన్ లతో పోలిస్తే.. కెనడాలోని విశ్వవిద్యాలయాల్లో తక్కువ ఖర్చుకే నాణ్యమైన విద్య పొందవచ్చు. అలాేగే, అమెరికా, బ్రిటన్ ల కన్నా కెనడాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తక్కువే. అంతేకాదు, యూఎస్, యూకేలకు సమానమైన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్ స్టిట్యూషన్స్ కెనడాలో ఉన్నాయి. అమెరికాలోని యూనివర్సిటీలో చదవడానికి అయ్యే ఖర్చుతో పోలిస్తే.. 58% తక్కువకే కెనడాలో అదే కోర్సు పూర్తి చేయవచ్చు. సరైన ప్లానింగ్ తో పోలిస్తే, ఆ ఖర్చును మరింత తగ్గించవచ్చు. ప్రస్తుతం కెనడాలో 3.88 లక్షలకు పైగా విదేశీ విద్యార్థులు ఉన్నారు. ఆరు సంవత్సరాల క్రితంతో పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపైంది.

Course fee in Canada: కోర్సు ఫీ ఎంత?

కెనడాలో బ్యాచిలర్ డిగ్రీ చేయడానికి సగటున ఏటా 550 నుంచి 30 వేల కెనడియన్ డాలర్ల వరకు ఖర్చు అవుతుంది. అమెరికన్ డాలర్లలో ఇది 412.15 డాలర్ల నుంచి 22,481 డాలర్లు. ఇది సాధారణ డిగ్రీకయ్యే ఖర్చు. అదే మెడిసిన్, ఇంజినీరింగ్ తదితర కోర్సులకు 56 వేల కెనడియన్ డాలర్ల వరకు ఖర్చు అవుతుంది.

Universities in Canada: సరైన యూనివర్సిటీ ఎంపిక ఎలా?

కెనడాలో ప్రస్తుతం చాలా యూనివర్సిటీల్లో చవకగానే డిగ్రీ పూర్తి చేయవచ్చు. అదే సమయంలో ఆ విద్యాసంస్థలు నాణ్యమైన విద్యనే అందిస్తున్నాయి. ఉదాహరణకు యూనివర్సిటీ ఆఫ్ టొరంటో(University of Toronto), యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూ(University of Waterloo), సైమన్ ఫ్రేజర్ యూనివర్సిటీ(Simon Fraser University). వీటిల్లో నాణ్యమైన విద్య తక్కువ ఖర్చులోనే పూర్తవుతుంది. అయితే, ఇవి కాకుండా, వేరే వర్సిటీల్లో అప్లై చేసుకునే ముందు అవి designated learning institute (DLI) గా లిస్టై ఉందా? అనేది చెక్ చేసుకోవాలి.

scholarships and financial aid: స్కాలర్ షిప్స్ కూడా

కెనడాలోని చాలా వర్సిటీలు విదేశీ విద్యార్థులకు స్కాలర్ ఫిప్ లను, ఫైనాన్షియల్ ఎయిడ్ ను ఆఫర్ చేస్తున్నాయి. విద్యార్థులు తమ అర్హత ఆధారంగా పాక్షిక, లేదా సంపూర్ణ స్కాలర్ షిప్ ఆప్షన్స్ లో ఒకదానిని ఎంపిక చేసుకోవచ్చు. డల్హౌసీ యూనివర్సిటీ(Dalhousie University), యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూ(University of Waterloo) మొదలైనవి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు కూడా స్కాలర్ షిప్ ఆఫర్ చేస్తున్నాయి. అవి కాకుండా, కెనడా- ఆసియాన్ స్కాలర్ షిప్(Canada-ASEAN Scholarships), ఎడ్యుకేషనల్ ఎక్స్ చేంజ్ ఫర్ డెవలప్ మెంట్ స్కాలర్ షిప్( Educational Exchanges for Development -SEED) , స్టడీ ఇన్ కెనడా స్కాలర్ షిప్( Study in Canada Scholarships) మొదలైనవి కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా, విదేశీ విద్యార్థులు చదువుకుంటూనే వారానికి కొన్ని గంటల పాటు ఉద్యోగం చేసుకునే వెసులుబాటును కూడా కెనడా ప్రభుత్వం కల్పిస్తోంది.

టాపిక్