తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Paresh Rawal Hurts Bengali Sentiments: బెంగాలీలను అవమానించిన పరేశ్ రావల్

Paresh Rawal hurts Bengali sentiments: బెంగాలీలను అవమానించిన పరేశ్ రావల్

HT Telugu Desk HT Telugu

02 December 2022, 17:51 IST

  • Paresh Rawal hurts Bengali sentiments: విలక్షణ నటుడు పరేశ్ రావల్ ఇటీవల బెంగాలీలపై చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. బెంగాలీలను పరేశ్ రావల్ అవమానించాడని సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున మండిపడ్తున్నారు.

గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పరేశ్ రావల్
గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పరేశ్ రావల్ (HT_PRINT)

గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పరేశ్ రావల్

Paresh Rawal బాలీవుడ్ తో పాటు పలు భారతీయ భాషల్లో నటించిన పరేశ్ రావల్ భారతీయులందరికీ చిర పరిచితుడు. ఆయన ఇటీవల బీజేపీలో చేరారు. బీజేపీ తరఫున గుజరాత్ లో ప్రచారం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Cricket ball : జననాంగాలకు క్రికెట్​ బాల్​ తాకి.. 11ఏళ్ల బాలుడు మృతి!

Houston floods : టెక్సాస్​- హూస్టన్​ని ముంచెత్తిన వరద.. భయం గుప్పిట్లో ప్రజలు

ICSE results 2024 : ఐసీఎస్​ఈ క్లాస్​ 10, ఐఎస్సీ క్లాస్​ 12 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Paresh Rawal hurts Bengali sentiments: బెంగాలీలను అవమానిస్తూ..

గుజరాత్ లో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల హంగామా నడుస్తోంది. డిసెంబర్ 1వ తేదీన తొలి దశ ఎన్నికలు ముగిశాయి. రెండో దశ ఎన్నికలు డిసెంబర్ 5వ తేదీన జరగనున్నాయి. అయితే, గుజరాత్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ తరఫున పాల్గొన్న పరేశ్ రావల్(Paresh Rawal) బెంగాలీలపై అవమానకర వ్యాఖ్యలు చేశాడని సోషల్ మీడియాలో వైరల్ అయింది. వల్సార్ లో ఒక ఎన్నికల ప్రచార సభలో గ్యాస్ సిలిండర్ల ధర పెంపు, నిరుద్యోగం తదితర అంశాలపై రావల్ మాట్లాడారు. ‘‘గ్యాస్ సిలండర్ ధర ఈ రోజు ఎక్కువ ఉంది. రేపు తగ్గుతుంది. నేడో, రేపో ఉద్యోగాలు కూడా వస్తాయి. కానీ మీ చుట్టూ రోహింగ్యాలో, లేక బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన వారో ఉంటే పరిస్థితి ఏంటి? ఢిల్లీలో ఉన్నట్లు.. చుట్టూ వారు ఉంటే, గ్యాస్ సిలండర్లు ఉంటే మాత్రం ఏం చేస్తారు? బెంగాలీలకు చేపల కూర వండిపెడ్తారా? ’’ అని పరేశ్ రావల్(Paresh Rawal) ఆ ఎన్నికల సభలో వ్యాఖ్యానించారు.

Paresh Rawal's apologies to Bengalis: మండిపడ్తున్న నెటిజన్లు

పరేశ్ రావల్ వ్యాఖ్యలపై బెంగాలీలు మండిపడ్తున్నారు. బెంగాలీలను పరేశ్ రావల్ అవమానించాడని భావిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో పరుష వ్యాఖ్యలతో ఆయనపై విరుచుకుపడ్తున్నారు. బెంగాలీలు చేపలు తినడం నిషిద్దమా? అని ఒక నెటిజన్ Paresh Rawal ను ప్రశ్నించారు. బెంగాలీల పట్ల బహిరంగంగానే విద్వేషం పెంచుతున్నారని మరో నెటిజన్ ఆరోపించారు. దాంతో, పరేశ్ రావల్ ట్విటర్ వేదికగా ఆ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరారు. ‘‘నా ఆ వ్యాఖ్యల్లోని ఉద్దేశం మీకు సరిగ్గా అర్థం కాలేదు. నా వ్యాఖ్యల్లోని బెంగాలీలు అంటే.. రోహింగ్యాలు, బంగ్లాదేశీ అక్రమ వలసదారులు అని అర్థం. అయినా నా మాటలతో ఎవరైనా బాధపడి ఉంటే వారికి నా క్షమాపణలు’’ అని వివరించారు. పరేశ్ రావల్ తెలుగులోనూ పలు హిట్ సినిమాల్లో నటించారు. శ్రీదేవి, వెంకటేశ్ నటించిన క్షణక్షణం సినిమా ద్వారా పరేశ్ రావల్ తెలుగు ప్రజలకు దగ్గరయ్యారు. ఆ తరువాత చిరంజీవి హిట్ సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్ సహా పలు విజయవంతమైన సినిమాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు.