తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Congress Strategy Meeting: కాంగ్రెస్ స్ట్రాటెజీ మీటింగ్ కు అనూహ్యంగా వారొచ్చారు

Congress strategy meeting: కాంగ్రెస్ స్ట్రాటెజీ మీటింగ్ కు అనూహ్యంగా వారొచ్చారు

HT Telugu Desk HT Telugu

07 December 2022, 15:23 IST

  • Congress strategy meeting: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో విపక్షం అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ నేతృత్వంలో బుధవారం ప్రత్యేక సమావేశం జరిగింది. భావ సారూప్య పార్టీల ఈ సమావేశానికి అనూహ్యంగా మరో ఇద్దరు మిత్రలు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

పార్లమెంట్లో కాంగ్రెస్ నేతృత్వంలో విపక్ష పార్టీల సమావేశం
పార్లమెంట్లో కాంగ్రెస్ నేతృత్వంలో విపక్ష పార్టీల సమావేశం (ANI)

పార్లమెంట్లో కాంగ్రెస్ నేతృత్వంలో విపక్ష పార్టీల సమావేశం

Congress strategy meeting: సాధారణంగా ప్రతీ పార్లమెంటు సమావేశాల ముందు, పార్లమెంటు సమావేశాలను సజావుగా, ఫలప్రదంగా జరుపుకుందామని కోరుతూ ప్రధానమంత్రి ఒక అఖిల పక్ష భేటీని ఏర్పాటు చేయడం, అలాగే, ఆ సమావేశాల్లో ఐక్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడానికి భావసారూప్య విపక్షాలు మరో వ్యూహ రచన సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం ఆనవాయితీ.

Congress strategy meeting: ఖర్గే నేతృత్వంలో

పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా కూడా బుధవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే నాయకత్వంలో భావ సారూప్య విపక్ష పార్టీల వ్యూహ రచన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ కాకుండా, వామపక్షాలు, డీఎంకే, ఆర్జేడీ, ఎన్సీపీ, నేషనల్ కాన్ఫెరెన్స్, ఆరెస్పీ ల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. అయితే, వారు ఊహించని మరో రెండు ‘మిత్ర పక్షాలు’ కూడా ఈ భేటీకి హాజరయ్యాయి. కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ల నుంచి కూడా ఈ సమావేశానికి ప్రతినిధులు హాజరుకావడం అందరినీ ఆశ్చర్య పరిచింది.

AAP, TMC joins the opposition meet: కాంగ్రెస్ కు దూరంగా..

కొన్నాళ్లుగా ఆప్, తృణమూల్ కాంగ్రెస్ లు కాంగ్రెస్ నిర్వహించే ఐక్య విపక్ష కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కూడా ఈ రెండు పార్టీలు పార్లమెంటులో కాంగ్రెస్ నాయకత్వంలో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసన ప్రదర్శనల్లో పాల్గొనలేదు. పార్లమెంట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొనకూడదని తృణమూల్ పార్టీ చీఫ్ మమత ఇప్పటికే నిర్ణయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒంటరిగా పోరాడాలని పార్టీ ఎంపీలకు ఆమె సూచించారు. మరోవైపు, లోక్ సభలో కాంగ్రెస్ నేత ఆధిర్ రంజన్ చౌధరి పశ్చిమబెంగాల్ కు చెందినవాడే. ఆయన మమత విమర్శించే ఏ అవకాశాన్ని సాధారణంగా వదులుకోరు. అలాంటి ఆధిర్ నాయకత్వంలో లోక్ సభలో టీఎంసీ సభ్యులు పోరాడడాన్ని మమత ససేమీరా అంగీకరించారు. ఈ శీతాాకాల సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అంశాలపై చర్చించడానికి నవంబర్ 29న కాంగ్రెస్ ఏర్పాటు చేసిన విపక్ష సమావేశానికి కూడా ఆప్, తృణమూల్ హాజరుకాలేదు. మరోవైపు, ప్రధానమంత్రి మోదీ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి టీఎంసీ చీఫ్ మమత బెనర్జీ హాజరయ్యారు.