తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Firing Video: ఢిల్లీలో కాల్పుల మోత.. నడిరోడ్డుపై అన్నదమ్ములను వెంబడించి…

Firing Video: ఢిల్లీలో కాల్పుల మోత.. నడిరోడ్డుపై అన్నదమ్ములను వెంబడించి…

HT Telugu Desk HT Telugu

08 May 2022, 13:08 IST

    • ఢిల్లీలో నడిరోడ్డుపై కాల్పులు కలకలం రేపాయి. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఓ కారుపై 10 రౌండ్లకు పైగా కాల్పులు జరిపారు గుర్తు తెలియని వ్యక్తులు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
ఢిల్లీలో కాల్పుల మోత
ఢిల్లీలో కాల్పుల మోత

ఢిల్లీలో కాల్పుల మోత

ఢిల్లీలో ముగ్గురు దుండగులు రెచ్చిపోయారు. అన్నాదమ్ములిద్దరూ కారులో వెళ్తుండదా.. సుభాష్ నగర్ లో ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఏకంగా 10 రౌండ్లకు పైగా ఫైరింగ్ జరిపారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు బయటికి వచ్చాయి.

ఒక్కసారిగా కాల్పులు జరుగుతుండగా.. కారులోని అన్నదమ్ములకు ఏం అర్థంకాలేదు. వారిద్దరూ తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. దుండగులు కాల్పులు ఆపలేదు. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరు ఢిల్లీలోని ధీన్ దయాళ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

 కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పాతకక్షలే ఇందుకు కారణమని అనుమానిస్తున్నారు.ఇద్దరు అన్నదమ్ములను వ్యాపారుస్తులుగా గుర్తించగా.. నిందితుల కోసం గాలిస్తున్నారు.

 

టాపిక్