తెలుగు న్యూస్  /  National International  /  Mumbai Rains Viral Video Swiggy Delivery Boy Rides Horse To Drop Off Order

Swiggy : ఫుడ్​ డెలివరీ.. ఇలా కూడా చేయొచ్చా?

Sharath Chitturi HT Telugu

03 July 2022, 14:26 IST

    • Swiggy : ముంబై వర్షాల నేపథ్యంలో ఓ స్విగ్గీ డెలివరీ బాయ్​ చేసిన పని ఇప్పుడు వైరల్​గా మారింది. నీటితో నిండిపోయిన రోడ్ల మీద.. గుర్రంపై ఎక్కి ఫుడ్​ డెలివరీ చేశాడు ఆ స్విగ్గీ డెలివరీ బాయ్​. ఆ వీడియోను మీరూ చూసేయండి మరి..
గుర్రంపై స్విగ్గీ డెలివరీ బాయ్​
గుర్రంపై స్విగ్గీ డెలివరీ బాయ్​ (Youtube)

గుర్రంపై స్విగ్గీ డెలివరీ బాయ్​

Swiggy : సాధారణంగా మీరు స్విగ్గీలో ఫుడ్​ ఆర్డర్​ ఇస్తే.. డెలివరీ చేసేందుకు స్విగ్గీ డెలివరీ బాయ్​ బైక్​ మీద వస్తాడు. కానీ.. గుర్రం మీద వచ్చే స్వగ్గీ డెలివరీ బాయ్​ని మీరు ఎప్పుడైనా చూశారా? ముంబైలో వర్షాల నేపథ్యంలో ఇదే జరిగింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

ట్రెండింగ్ వార్తలు

Parents sue Serum Institute: కోవి షీల్డ్ తో కూతురి మృతి!; సీరమ్ ఇన్స్టిట్యూట్ పై కేసు వేసిన పేరెంట్స్

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

Crime news: బ్లాక్ మెయిల్ చేసి క్లాస్ మేట్ నుంచి రూ.35 లక్షలు లాక్కున్న టెంత్ క్లాస్ విద్యార్థులు

నైరుతి రుతుపవనాల నేపథ్యం ముంబైలో గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. ఏది ఏమైనా.. సాధారణ పనులు జరగాల్సిందే కదా. వర్షం పడుతోందని ఆగిపోలేము కదా! ఆ స్విగ్గీ డెలివరీ బాయ్​ కూడా ఇదే అనుకున్నాడు. వాహనాలు నడపడం కష్టంగా ఉన్న ప్రాంతంలో.. గుర్రం మీద వెళ్లి ఫుడ్​ డెలివరీ చేశాడు ఆ స్విగ్గీ డెలివరీ బాయ్​.

వీడియోలో ఈ దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గుర్రం మీద ఓ వ్యక్తి ఉన్నాడు. అతని వెనకాలా స్విగ్గీ బ్యాగ్​ ఉంది. ఫుడ్​ డెలివరీ చేసేందుకు ఆ స్విగ్గీ డెలివరీ బాయ్​.. ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు.. 'వావ్​' అంటున్నారు. విపరీతంగా ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన స్విగ్గీ డెలివరీ బాయ్​ వీడియో ఇక్కడ చూడండి:

Mumbai rains : మరోవైపు ముంబైలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముంబై వర్షాల నేపథ్యంలో నగరానికి ఆరెంజ్​ అలర్ట్​ జారీ చేసింది.

టాపిక్