తెలుగు న్యూస్  /  National International  /  Mp: Controversy Over Temple-shaped Cake Cut During Kamal Nath's Birthday Celebration

Kamal Nath in controversy: ఆలయం ఆకృతిలో ఉన్న కేక్ కట్ చేసిన కాంగ్రెస్ నేత

HT Telugu Desk HT Telugu

16 November 2022, 23:35 IST

  • Kamal Nath in controversy: పుట్టిన రోజు వేడుకల్లో గుడి ఆకారంలో ఉన్న కేక్ ను కట్ చేసి వివాదంలో చిక్కుకున్నారో కాంగ్రెస్ సీనియర్ నేత. ఆలయం ఆకృతిలో ఉన్న కేక్ ను కట్ చేసి హిందూ ధర్మాన్ని అవమానించారని ఆ నేతపై బీజేపీ మండిపడ్తోంది.

కాంగ్రెస్ నేత కమల్ నాథ్ కట్ చేసిన కేక్
కాంగ్రెస్ నేత కమల్ నాథ్ కట్ చేసిన కేక్

కాంగ్రెస్ నేత కమల్ నాథ్ కట్ చేసిన కేక్

Kamal Nath in controversy: మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ పుట్టిన రోజు వేడుకలు ఆయన స్వస్థలం చింద్వారాలో ఘనంగా జరిగాయి. నిజానికి ఆయన బర్త్ డే నవంబర్ 18న కానీ, ఆరోజు ఆయన అక్కడ ఉండడం లేదు కనుక బుధవారమే అభిమానులు వేడుకలు నిర్వహించారు.

Kamal Nath in controversy: గుడి ఆకారంలో కేక్, కేక్ పై హనుమాన్ బొమ్మ

ఆ బర్త్ డే వేడుకల్లో కమల్ నాథ్ కట్ చేసిన కేక్ వివాదానికి కారణమైంది. ఆ కేక్ హిందూ దేవాలయ ఆకారంలో ఉంది. నాలుగు అంతస్తులుగా, పైన కాషాయ జెండా, హనుమాన్ బొమ్మతో ఆ కేక్ ను అలంకరించారు. కమల్ నాథ్ కేక్ కట్ చేసిన తరువాత వేడుకలు కొనసాగాయి. అంతా బాగానే ఉంది, కానీ, గుడి ఆకారంలో ఉన్న కేక్ ను కమల్ నాథ్ కట్ చేస్తున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. కొద్ది సేపట్లోనే వైరల్ గా మారింది. తాను హనుమాన్ భక్తుడినని కమల్ నాథ్ చెప్పడం ఆ వీడియోలో రికార్డ్ అయింది.

Kamal Nath in controversy: మండి పడ్డ బీజేపీ

గుడి ఆకారంలో ఉన్న కేక్ ను కట్ చేయడంపై బీజేపీ, ఇతర హిందూ సంఘాల నేతలు కమల్ నాథ్ పై మండి పడుతున్నారు. కమల్ నాథ్ కు, కాంగ్రెస్ కు హిందూ ధర్మం పట్ల గౌరవం లేదని, హిందూ ధర్మాన్ని అవమానించారని విరుచుకుపడ్డారు. అది హిందువులను అవమానించడమేనని మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శించారు. హనుమాన్ భక్తులమని చెబుతూ, అదే హనుమాన్ బొమ్మను కేక్ పై అలంకరించి కట్ చేస్తారని మండిపడ్డారు. హిందూ ధర్మాన్ని నమ్మే ఎవరైనా అలా చేస్తారా? అని ప్రశ్నించారు.