Dallas air show : ఎయిర్ షోలో ఘోర ప్రమాదం.. గాలిలో రెండు విమానాలు ఢీ!
13 November 2022, 7:27 IST
- Dallas air show 2022 : రెండో ప్రపంచ యుద్ధం నాటి రెండు విమానాలు.. గాలిలో ఢీకొన్నాయి. చివరికి బూడిదగా మారాయి. అమెరికా డల్లాస్ ఎయిర్ షోలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
గాలిలో రెండు విమానాలు ఢీ!
Dallas air show 2022 : అమెరికా డల్లాస్‌లో నిర్వహించిన ఓ ఎయిర్ షోలో ఘోర ప్రమాదం సంభవించింది. రెండో ప్రపంచ యుద్ధం నాటి రెండు విమానాలు.. గాలిలో ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటన అనంతరం ఈ విమానాలు బూడిదగా మారిపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
డల్లాస్ ఎయిర్ షోలో ప్రమాదానికి గురైన విమానాల పేర్లు.. బోయింగ్ బీ-17 ఫ్లయింగ్ ఫోర్ట్రెస్, బెల్ పీ-63 కింగ్‌కోబ్రా. కాగా.. ఈ ఘటనతో కలిగిన ప్రాణ నష్టం గురించి అధికారులు ఇంకా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. కానీ స్థానిక మీడియా ప్రకారం.. ప్రమాదం సమయంలో రెండు విమానాల్లో మొత్తం ఆరుగురు ఉన్నారు. వీరందరు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది.
ఏం జరిగింది..?
డల్లాస్‌లో శనివారం ఎయిర్ షోను నిర్వహించారు. ఎయిర్ షోలో విమానాల విన్యాసాలను చూసేందుకు ప్రజలు తరలివెళ్లారు. కొద్దిసేపటి తర్వాత బోయింగ్ బీ-17 నేల మీద నుంచి బయలుదేరింది. గాలిలో ఎగిరి.. స్ట్రెయిట్ లైన్లో ప్రయాణం మొదలుపెట్టింది. ఇంతలో.. బెల్ పీ-63 అటువైపు దూసుకెళ్లింది. అందరు చూస్తుండగానే.. బెల్ పీ- 63.. బోయింగ్ బీ-17ని ఢీకొట్టింది. క్షణాల్లో మంటలు పుట్టుకొచ్చాయి. ఆ వెంటనే రెండు విమానాలు నేలకూలాయి. అక్కడి ప్రజలందరు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
Boeing B-17 Flying Fortress air crash: "నేను అక్కడే నిలబడి ఉన్నాను. చాలా షాకింగ్‌గా ఉంది. నమ్మలేకపోతున్నా. అందరు షాక్‌కు గురయ్యారు. వారి కళ్లల్లో కన్నీరు కనిపించింది." అని ఎయిర్ షోకు వెళ్లిన ఓ వ్యక్తి చెప్పారు.
ఈ ఘటనపై డల్లాస్ మేయర్ ఎరిక్ జాన్సన్ స్పందించారు. ఘటనతో షాక్‌కు గురైనట్టు తెలిపారు. ఘటనాస్థలాన్ని నేషనల్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బోర్డు.. తన ఆధీనంలోకి తీసుకుందని వివరించారు. స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సాయం అందించిందని స్పష్టం చేశారు.
Bell P-63 Kingcobra air crash : అమెరికా ఫైటర్ జెట్‌గా గుర్తింపు పొందిన కింగ్‌కోబ్రాను యుద్ధం సమయంలో సోవియెట్ యూనియన్ ఉపయోగించింది. బీ-17 అనేది ఒక ఫోర్ ఇంజిన్ బాంబర్. రెండో ప్రపంచ యుద్ధంలో దీనిని జర్మనీపై పోరాటానికి ఉపయోగించారు. అసలు ఈ రెండూ ఇప్పడు కూడా ఎగరడం చాలా ఆశ్చర్యానికి గురిచేసిందని నిపుణులు చెప్పారు.
యుద్ధం తర్వాత బీ-17 విమానాలను ధ్వంసం చేశారు. కొన్ని మాత్రమే మ్యూజిమ్స్లో ఉన్నాయి. ఇంకొన్ని ఇలా ఎయిర్ షోలో అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి.
Dallas air show viral video : సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన వీడియోను ఇక్కడ చూడండి: