తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Delhi Minister Satyendar Jain News: ‘‘అతడు థెరపిస్ట్ కాదు.. రేపిస్ట్’’

Delhi minister Satyendar Jain news: ‘‘అతడు థెరపిస్ట్ కాదు.. రేపిస్ట్’’

HT Telugu Desk HT Telugu

22 November 2022, 14:59 IST

  • Delhi minister Satyendar Jain news: ఢిల్లీ మంత్రి, ఆప్ సీనియర్ నేత సత్యేంద్ర జైన్ కు తిహార్ జైళ్లో వీఐపీ ట్రీట్ మెంట్ అందుతున్న విషయమై రాజుకున్న వివాదంలో కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. 

జైళ్లో ప్రత్యేక సేవలు పొందుతున్న సత్యేంద్ర జైన్
జైళ్లో ప్రత్యేక సేవలు పొందుతున్న సత్యేంద్ర జైన్ (ANI )

జైళ్లో ప్రత్యేక సేవలు పొందుతున్న సత్యేంద్ర జైన్

Delhi minister Satyendar Jain news: అక్రమాస్తులు, మనీ లాండరింగ్ కేసులో తిహార్ జైళ్లో ఉన్న ఆప్ నేత, ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ జైలు గదిలో ఒక వ్యక్తితో కాళ్లకు మసాజ్ చేయించుకుంటూ ఉన్న వీడియో వైరల్ అయింది. బెడ్ పై పడుకుని, విజిటర్లతో మాట్లాడుతూ, కాళ్లకు మసాజ్ చేయించుకుంటూ జైన్ కనిపించిన ఆ వీడియోపై ఆప్, బీజేపీలు పరస్పరం విమర్శలు చేసుకున్నాయి. మరో వీడియోలో జైన్ తలకు మసాజ్ చేస్తున్న దృశ్యాలు కూడా ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Cricket ball : జననాంగాలకు క్రికెట్​ బాల్​ తాకి.. 11ఏళ్ల బాలుడు మృతి!

Houston floods : టెక్సాస్​- హూస్టన్​ని ముంచెత్తిన వరద.. భయం గుప్పిట్లో ప్రజలు

ICSE results 2024 : ఐసీఎస్​ఈ క్లాస్​ 10, ఐఎస్సీ క్లాస్​ 12 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Jain gets massage by rapist: అతడు ఫిజియో కాదు..

సత్యేంద్ర జైన్ జైళ్లో కింద పడడంతో వెన్నెముకకు గాయం అయిందని, దాంతో ఆయనకు స్పైన్ సర్జరీ చేశారని, ట్రీట్ మెంట్లో భాగంగానే సత్యేంద్ర జైన్ జైలు గదిలో ఫిజియోధెరపీ చేశారని ఆప్ వివరణ ఇచ్చింది. అయితే, ఆప్ చెప్పిన విషయం తప్పు అని జైలు వర్గాలు వెల్లడించాయి. జైన్ కు జైలు గదిలో కాళ్లకు మసాజ్ చేసిన వ్యక్తి ఫిజియో థెరపిస్ట్ కాదని, అతడొక రేపిస్ట్ అని సంచలన విషయం బయటపెట్టాయి. అతడి పేరు రింకూ అని, రేప్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడని, అతడిపై మైనర్ ను రేప్ చేశాడన్న ఆరోపణలు ఉన్నాయని జైలు వర్గాలు తెలిపాయి. దాంతో బీజేపీకి ఆప్ ను దుయ్యబట్టడానికి మరో ఆయుధం లభించింది.

BJP slams AAP on Jain issue: వెంటనే తొలగించండి

సత్యేంద్ర జైన్ చట్టబద్ధంగానే జైలులో చికిత్స పొందుతున్నాడన్న ఢిల్లీ డెప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా వాదనను బీజేపీ ఎద్దేవా చేస్తూ.. రేపిస్ట్ తో సేవలు పొందడం చట్టబద్ధమా? అని ప్రశ్నించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తక్షణమే సత్యేంద్ర జైన్ ను ఆప్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది. కాగా, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి ఖాయమని బీజేపీకి అర్థమైందని, అందువల్ల ఇలాంటి చీప్ ట్రిక్స్ ను వాడుతోందని ఆప్ నేత గోపాల్ రాయ్ విమర్శించారు. గతంలో అమిత్ షా గుజరాత్ జైల్లో ఉన్న సమయంలో ఆయన పొందిన సేవలు అందరికీ తెలుసని గుర్తు చేశారు. మనీ లాండరింగ్ కేసులో సత్యేంద్ర జైన్ దాదాపు గత ఆరు నెలలుగా జైళ్లో ఉంటున్నారు. తిహార్ సహా ఢిల్లీలోని జైళ్లు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి.

టాపిక్