తెలుగు న్యూస్  /  National International  /  Major Road Accident In Gujarat Navsari, 9 Killed, 32 Wounded

Gujarat road accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 9మంది మృతి!

31 December 2022, 8:46 IST

    • Gujarat road accident : గుజరాత్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9మంది మరణించారు. బస్సు- ఎస్​యూవీ ఢీకొట్టుకోవడంతో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.
ప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన బస్సు ముందు భాగం..
ప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన బస్సు ముందు భాగం..

ప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన బస్సు ముందు భాగం..

Navsari road accident today : గుజరాత్​లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నవ్​సారి జిల్లాలోని అహ్మదాబాద్​- ముంబై హైవేపై ఓ బస్సు- ఎస్​యూవీ ఢీకొన్నాయి. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో 9మంది ప్రాణాలు కోల్పోయారు. 32మంది గాయపడినట్టు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

Crime news: బ్లాక్ మెయిల్ చేసి క్లాస్ మేట్ నుంచి రూ.35 లక్షలు లాక్కున్న టెంత్ క్లాస్ విద్యార్థులు

Bengaluru news: ‘‘1983 తర్వాత బెంగళూరుకు ఈ దుస్థితి రావడం ఈ సంవత్సరమే..’’; ఐఎండీ శాస్త్రవేత్త వెల్లడి

Delhi school: ఢిల్లీ స్కూల్స్ కు బాంబు బెదిరింపులు : 'ఫేక్' గా భావిస్తున్న పోలీసులు

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలను చేపట్టారు. ఈ నేపథ్యంలో క్షతగాత్రులను అంబులెన్స్​ల ద్వారా ఆసుపత్రికి తరలించారు.

Gujarat Road accident news today : అడిషనల్​ డిస్ట్రిక్ట్​ కలెక్టర్​ కేతన్​ జోషి ప్రకారం.. రోడ్డు ప్రమాదంలో 32మంది గాయపడ్డారు. వీరిలో 17మందిని వాల్సద్​లోని ఆసుపత్రికి, మరో 14మందిని నవ్​సారిలోని హాస్పిటల్​కు తరలించారు. మిగిలిన వారికి సూరత్​లో చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలం నుంచి పోలీసులు 9 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం వాటిని ఆసుపత్రికి తరలించారు.

ఘటన జరిగిన సమయంలో ఫార్చ్యూనర్​ ఎస్​యూవీలో 9మంది ఉన్నారు. వీరందరు.. అంక్లేశ్వర్​కు చెందిన ఓ కంపెనీలో పనిచేస్తున్నారు. మరోవైపు.. ప్రమాదానికు గురైన బస్సు అహ్మదాబాద్​ నుంచి వాల్సద్​కు వెళ్లాల్సి ఉంది.

రోడ్డు ప్రమాదనికి గల కారణాలు ఇంకా తెలియలేదు. అయితే.. ఎస్​యూవీ రాంగ్​ రూట్​లో వస్తున్నట్టు.. తొలుత డివైడర్​ను ఢీకొట్టిన అనంతరం బస్సును తాకినట్టు తెలుస్తోంది. డ్రైవర్​ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి ప్రధాన కారణమని సమాచారం.

ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు వెల్లడించారు. కాగా రోడ్డు ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. గుర్తుపట్టేలని స్థితికి చేరింది. బస్సు ముందు భాగం ధ్వంసమైంది.

టాపిక్