తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  4 Indian Students Killed: రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయ విద్యార్థుల మృతి

4 Indian students killed: రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయ విద్యార్థుల మృతి

HT Telugu Desk HT Telugu

29 December 2022, 23:07 IST

  • 4 Indian students killed: ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. వారంతా పాతికేళ్ల లోపు వయస్సున్న వైద్య విద్య అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులే.

ప్రమాదానికి గురైన కారు
ప్రమాదానికి గురైన కారు

ప్రమాదానికి గురైన కారు

4 Indian students killed: క్రిమియా (Crimea) లో గురువారం ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భారత్ కు చెందిన నలుగురు వైద్య విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.

ట్రెండింగ్ వార్తలు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

Brij Bhushan : బ్రిజ్​ భూషణ్​ కుమారుడికి బీజేపీ టికెట్​- రెజ్లర్ల స్పందన ఇది..

4 Indian students killed: అక్కడికక్కడే ప్రాణాలు పోయాయి

నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు క్రిమియా (Crimea) లోని సింఫెరొపోల్ ప్రాంతంలో ప్రమాదానికి గురై వారంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వేగంగా వెళ్తూ, అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల్లో ఇద్దరు మెడిసిన్ మూడో సంవత్సరం, మరో ఇద్దరు మెడిసిన్ నాలుగో సంవత్సరం చదువుతున్నట్లు రష్యా అధికారిక స్థానిక వార్తాసంస్థ రియా నొవొస్టి(RIA Novosti) వెల్లడించింది. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారని తెలిపింది. మృతి చెందిన వారు భారతీయ విద్యార్థులు కావడంతో, ఇండియన్ ఎంబసీకి సమాచారం ఇచ్చినట్లు వెల్లడించింది. ప్రాథమికంగా సేకరించిన సమాచారం మేరకు, రెనో లోగాన్(Renault Logan) కారులో ఆ విద్యార్థులు క్రిమియా (Crimea) లోని సెర్గీవ్ సెన్స్కీ స్ట్రీట్ నుంచి సెయింట్ సిమ్ ఫెరొపోల్ వైపు వెళ్తుండగా, ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అననుకూల వాతావరణం కారణంగా, డ్రైవర్ కార్ పై అదుపు కోల్పోయాడని, దాంతో వేగంగా వెళ్తున్న కారు రోడ్డు పక్కకు వెళ్లి అక్కడి చెట్టును బలంగా ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.

టాపిక్