4 Indian students killed: రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయ విద్యార్థుల మృతి-4 indian students killed in fatal car accident in crimea ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  4 Indian Students Killed In Fatal Car Accident In Crimea

4 Indian students killed: రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయ విద్యార్థుల మృతి

HT Telugu Desk HT Telugu
Dec 29, 2022 11:07 PM IST

4 Indian students killed: ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. వారంతా పాతికేళ్ల లోపు వయస్సున్న వైద్య విద్య అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులే.

ప్రమాదానికి గురైన కారు
ప్రమాదానికి గురైన కారు

4 Indian students killed: క్రిమియా (Crimea) లో గురువారం ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భారత్ కు చెందిన నలుగురు వైద్య విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.

ట్రెండింగ్ వార్తలు

4 Indian students killed: అక్కడికక్కడే ప్రాణాలు పోయాయి

నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు క్రిమియా (Crimea) లోని సింఫెరొపోల్ ప్రాంతంలో ప్రమాదానికి గురై వారంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వేగంగా వెళ్తూ, అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల్లో ఇద్దరు మెడిసిన్ మూడో సంవత్సరం, మరో ఇద్దరు మెడిసిన్ నాలుగో సంవత్సరం చదువుతున్నట్లు రష్యా అధికారిక స్థానిక వార్తాసంస్థ రియా నొవొస్టి(RIA Novosti) వెల్లడించింది. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారని తెలిపింది. మృతి చెందిన వారు భారతీయ విద్యార్థులు కావడంతో, ఇండియన్ ఎంబసీకి సమాచారం ఇచ్చినట్లు వెల్లడించింది. ప్రాథమికంగా సేకరించిన సమాచారం మేరకు, రెనో లోగాన్(Renault Logan) కారులో ఆ విద్యార్థులు క్రిమియా (Crimea) లోని సెర్గీవ్ సెన్స్కీ స్ట్రీట్ నుంచి సెయింట్ సిమ్ ఫెరొపోల్ వైపు వెళ్తుండగా, ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అననుకూల వాతావరణం కారణంగా, డ్రైవర్ కార్ పై అదుపు కోల్పోయాడని, దాంతో వేగంగా వెళ్తున్న కారు రోడ్డు పక్కకు వెళ్లి అక్కడి చెట్టును బలంగా ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.

IPL_Entry_Point

టాపిక్