తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Madya Pradesh Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 11మంది దుర్మరణం

Madya Pradesh road accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 11మంది దుర్మరణం

04 November 2022, 8:28 IST

    • Madya Pradesh road accident : మధ్యప్రదేశ్​లో ఓ కారు.. బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 11మంది మరణించారు. ఒకరు గాయపడ్డారు.
ఘోర రోడ్డు ప్రమాదం.. 11మంది దుర్మరణం!
ఘోర రోడ్డు ప్రమాదం.. 11మంది దుర్మరణం! (ANI)

ఘోర రోడ్డు ప్రమాదం.. 11మంది దుర్మరణం!

Madya Pradesh road accident : మధ్యప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బెతుల్​ జిల్లాలో ఓ బస్సును, ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో 11మంది మరణించారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

ట్రెండింగ్ వార్తలు

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

కూలీలు ఇంటికి వెళుతుండగా..

పోలీసుల సమాచారం ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులందరు స్థానికులు. మహారాష్ట్ర అమరావతిలో కూలీలుగా పనిచేసే వీరు.. బెతుల్​లోని సొంత గ్రామానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది.

"మహారాష్ట్ర అమరావతి నుంచి చిక్లర్​, మహద్​గావ్​, ఝాల్లర్​ గ్రామాలకు చెందిన కూలీలు.. ఇళ్లకు తిరిగి వస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఎస్​యూవీ వెళ్లి బస్సును ఢీకొట్టింది. ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. 7 మృతదేహాలను వెలికి తీశారు. కానీ మరో నాలుగు మృతదేహాలను.. వాహనాలను కోస్తే తప్ప తీయలేకపోయారు," అని బెతుల్​ ఎస్​పీ తెలిపారు.

పోస్టుమార్టం అనంతరం.. మృతదేహాలను సొంత గ్రామాలకు తరలించారు అధికారులు. ఈ ఘటనలో గాయపడిన ఓ వ్యక్తిని.. ఆసుపత్రిలో చేర్పించారు.

ప్రమాదం కారణంగా కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. బస్సు ముందు భాగంలో అద్దాలు పగిలిపోయాయి.

మధ్యప్రదేశ్​లో ప్రమాదాలు..

మధ్యప్రదేశ్​లో ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయి. కొన్ని రోజుల వ్యవధిలోనే 3 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. మొరేనా నుంచి వస్తున్న ఓ కారును ట్రక్​ ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. యూపీ నుంచి మధ్యప్రదేశ్​కు వస్తున్న వాహనానికి ప్రమాదం జరిగి 15మంది మరణించారు. ఇక తాజా ఘటనలో 11మంది మృతిచెందారు.

టాపిక్