Hyderabad bus accident : మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం- 14మంది మృతి
Hyderabad bus accident : మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14మంది మరణించారు. మరో 40మంది గాయపడ్డారు.
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రేవా జిల్లాలో ఓ బస్సు- ట్రక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 14మంది ప్రాణాలు కోల్పోయారు, 40మందికిపైగా ప్రజలు గాయపడ్డారు.
ఏం జరిగింది?
ప్రమాదానికి గురైన బస్సు.. హైదరాబాద్ నుంచి ఉత్తర్‌ప్రదేశ్ గోరఖ్‌పూర్‌కు బయలుదేరింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 530కి.మీల దూరంలో ఓ ట్రక్‌ను ఢీకొట్టింది. తొలుత ఆ ట్రక్.. ఎదురుగా వెళుతున్న ట్రక్‌ను ఢీకొట్టినట్టు తెలుస్తోంది. వెనకే వస్తున్న బస్సు కూడా ట్రక్‌ను ఢీకొట్టిందని సమాచారం.
కాగా.. ఘటన జరిగిన సమయంలో బస్సులో 100మంది వరకు ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది. వీరందరు ఉత్తర్ప్రదేశ్వాసులేనని సమాచారం. దీపావళి కోసం వీరు హైదరాబాద్ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు బయలుదేరినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి వెళ్లి సహాయక చర్యలను చేపట్టారు. 20 మంది క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
బస్సు ప్రమాదం ఘటనపై రాజస్థాన్ సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను సానుభూతి ప్రకటించారు.