తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Arunachal's Fire Accident: చూస్తుండగానే 700 షాపులు బుగ్గిపాలు

Arunachal's fire accident: చూస్తుండగానే 700 షాపులు బుగ్గిపాలు

HT Telugu Desk HT Telugu

25 October 2022, 14:42 IST

  • Arunachal's fire accident: అరుణాచల్ ప్రదేశ్ లో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Arunachal's fire accident: అరుణాచల్ ప్రదేశ్(arunachal pradesh) రాజధాని ఈటానగర్ కు 14 కిమీల దూరంలో ఉన్న రాష్ట్రంలోనే అతి పురాతన మార్కెట్ లో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం(fire accident) చోటు చేసుకుంది.

ట్రెండింగ్ వార్తలు

Chardham Yatra 2024: చార్ ధామ్ యాత్రకు ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే తేదీ ఇదే; ఆన్ లైన్ లో కూడా చేసుకోవచ్చు

Sexual assault in Delhi Metro: ఢిల్లీ మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి యత్నం; వణికిపోయిన మైనర్

Jammu and Kashmir news: భద్రతా బలగాలపై ఉగ్రవాదుల కాల్పులు; ఐదుగురు జవాన్లకు గాయాలు

IGNOU July 2024 session: ఇగ్నో లో జులై సెషన్ కు రీ రిజిస్ట్రేషన్ విండో ఓపెన్; విద్యార్థులు ఇలా రిజిస్టర్ చేసుకోండి..

Arunachal's fire accident: ఓల్డెస్ట్ మార్కెట్

అరుణాచల్ ప్రదేశ్ లోనే అతి పురాతన మార్కెట్ ఈటానగర్ కు 14 కిమీల దూరంలో ఉన్న నహర్లగూన్ లో ఉంది. అందులో దాదాపు 1000 షాపుల వరకు ఉంటాయి. మంగళవారం తెల్లవారు జామున ఆ మార్కెట్లోని రెండు షాపులకు మంటలంటుకున్నాయి. అవి కొద్ది సేపట్లోనే మిగతా షాపులకు వ్యాపించాయి. దాదాపు షాపులన్నీ వెదురు తో చేసినవి కావడంతో మంటలు త్వరగా వ్యాపించాయి. అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు దాదాపు 4 గంటల పాటు శ్రమించి మంటలను నియంత్రించారు. కానీ అప్పటికే దాదాపు 700 షాపులు బూడిదయ్యాయి.

Arunachal's fire accident: పక్కనే ఫైర్ స్టేషన్

ఆ మార్కెట్ కు దగ్గర్లోనే ఫైర్ స్టేషన్, పోలీస్ స్టేషన్ ఉన్నాయి. అయితే, వారు సకాలంలో స్పందించి ఉంటే ఈ స్థాయిలో ఆస్తినష్ట జరిగి ఉండేది కాదని భావిస్తున్నారు. దీపావళి సందర్భంగా వెలిగించిన దీపాల వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు.

Arunachal's fire accident: ప్రాణ నష్టం

అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అగ్ని ప్రమాదం తెల్లవారు జామున జరగడం, పండుగ మర్నాడు కావడంతో మార్కెట్లో చాలా తక్కువ సంఖ్యలో ప్రజలున్నారు. వారిలో ఎక్కువ శాతం ఆయా షాపుల యజమానులు, వాటిలో పని చేసేవారే.