తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rambha Car Accident: కారు ప్రమాదానికి గురైన ప్రముఖ నటి రంభ.. పరిస్థితి ఎలా ఉందంటే?

Rambha Car Accident: కారు ప్రమాదానికి గురైన ప్రముఖ నటి రంభ.. పరిస్థితి ఎలా ఉందంటే?

01 November 2022, 11:04 IST

    • Rambha Car Accident: 90వ దశకంలో హీరోయిన్‌గా చెరగని ముద్ర వేసిన రంభ.. కారు ప్రమాదానికి గురయ్యారు. కెనడాలో ఉంటున్న ఆమె సోమవారం రాత్రి ఈ ప్రమాదంలో చిక్కుకుకున్నారు. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె 2010లో వివాహం చేసుకుని కెనడాలో సెటిల్ అయ్యారు.
కారు ప్రమాదానికి గురైన రంభ
కారు ప్రమాదానికి గురైన రంభ

కారు ప్రమాదానికి గురైన రంభ

Rambha Car Accident: ప్రముఖ నటి రంభ వివాహం చేసుకుని విదేశాల్లో సెటిల్ అయిన సంగతి తెలిసిందే. కెనడాలో ఉంటున్న ఆమె రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కారులో వెళ్తున్న ఆమెను వేరే వాహనం ఢీ కొట్టడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే ఆమె కుమార్తే మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషయాన్ని సదరు నటి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ప్రమాదానికి సంబంధించిన ఫొటోలను నెట్టింట షేర్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Hi Nanna: హాయ్ నాన్న సినిమాకు మరో అంతర్జాతీయ వేదికపై అవార్డుల పంట.. ఆరు పురస్కారాలు: ఏఏ విభాగాల్లో వచ్చాయంటే..

Samantha: ‘అది ఫేక్’: సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమంత ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..

Chitram Choodara OTT: నేరుగా ఓటీటీలోకి వస్తున్న వరుణ్ సందేశ్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Aditya Kapur Ananya Panday: బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆదిత్య కపూర్, అనన్య పాండే బ్రేకప్ చేసుకున్నారా? వివరాలివే

ప్రస్తుతం రంభం కుటుంబం కెనడాలో ఉంటోంది. అక్కడి కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం రంభ తన పిల్లలను స్కూల్ నుంచి తీసుకుని వస్తుండగా వీరి కారును మరో వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో తామంతా స్వల్ప గాయాలతో బయటపడినట్లు రంభ స్పష్టం చేసింది. అయితే ఆమె చిన్న కుమార్తే సాషా మాత్రం గాయాల కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని పేర్కొంది. ప్రమాద సమయంలో కారులో రంభ, ఆమె పిల్లలతో పాటు ఓ ఆయా కూడా ఉన్నారు.

కారులో సమయానికి ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. రంభాకు యాక్సిడెంట్ అని సోషల్ మీడియాలో అభిమానులకు తెలియగానే ఆందోళనకు గురయ్యారు. ఆమె కుమార్తే త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ని కోరుకుంటున్నారు.

గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న రంభ.. 2010లో కెనడాలో స్థిరపడిన ఇంద్రకుమార్ అనే వివాహం చేసుకుంది. అప్పటి నుంచి ఆమె అక్కడే తన కుటుంబంతో ఉంటోంది. వీరికి ఇద్దరు కుమార్తేలు, ఓ కుమారుడు ఉన్నారు. వీరి కుటుంబం కెనడాలో ఒంటారియోలో నివాసముంటోంది. తెలుగుతో పాటు పలు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించిన రంభ.. తన నటనతో చెరగని ముద్ర వేశారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.