Live News Today: సిద్ధరామయ్యనే కర్ణాటక సీఎం: కాంగ్రెస్ అధికారిక ప్రకటన
18 May 2023, 20:51 IST
- Breaking News - Latest News Updates: జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్ వార్తల అప్‍డేట్లను ఎప్పటికప్పుడు తెలుసుకుందుకు ఈ పేజీని ఫాలో అవండి. తాజా సమాచారాన్ని వెంటనే తెలుసుకునేందుకు ఈ పేజీని చూస్తూనే ఉండండి.
Sunder Pichai's phone?: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఐ ఫోన్ వాడుతారు తెలుసా?
Sunder Pichai's phone?: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఏ ఫోన్ వాడుతారంటే.. ఎవరైనా వెంటనే ఇచ్చే సమాధానం.. సొంత కంపెనీ గూగుల్ కు చెందిన గూగుల్ పిక్సెల్ మోడల్ అని. కానీ సుందర్ పిచాయ్ ఒక ఐ ఫోన్ ను, మరో సామ్సంగ్ గెలాక్సీ ఫోన్ ను వాడుతారు.
SBI Q4 results: లాభాల్లో దూసుకుపోయిన ఎస్బీఐ.. డివిడెండ్ ఎంతంటే..?
SBI Q4 results: భారత్ లోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India SBI)’ 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (Q4FY23) ఫలితాలను గురువారం ప్రకటించింది. ఈ Q4FY23 లో ఎస్బీఐ (SBI) రూ. 16,694.5 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. Q4FY23 ఫలితాలతో పాటు షేర్ హోల్డర్లకు ఫైనల్ డివిడెండ్ ను కూడా ఎస్బీఐ (SBI) ప్రకటించింది. షేర్ హోల్డర్లకు ఒక్కో ఈక్విటీ షేర్ పై రూ. 11.30 ల డివిడెండ్ ను అందజేయనున్నట్లు వెల్లడించింది.
Karnataka CM deal: సోనియాగాంధీ ఎంటరైన తరువాతనే.. పట్టువీడిన డీకే
Karnataka CM deal: ఎట్టకేలకు కర్నాటక ముఖ్యమంత్రి ఎంపిక సమస్య పరిష్కారమైంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తెగని పంచాయతీగా మారిన ఈ వివాదం చివరకు పార్టీ మాజీ చీఫ్ సోనియాగాంధీ (Sonia Gandhi) జోక్యంతోనే పరిష్కారమైనట్లు తెలుస్తోంది.
బాధ్యతలు చేపట్టిన మేఘ్వాల్
న్యాయశాఖ మంత్రిగా అర్జున్ రామ్ మేఘ్వాల్ (Arjun Ram Meghwal) బాధ్యతలు స్వీకరించారు. కిరణ్ రిజిజు స్థానాన్ని ఆయన భర్తీ చేశారు. రిజిజుకు భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వందేభారత్ రైలును ప్రారంభించిన మోదీ
పూరీ-హౌరా మధ్య నడవనున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేడు ఈ రైలును ఆయన ప్రారంభించారు. ఒడిశాలో నడవనున్న తొలి వందేభారత్ రైలు ఇదే కానుంది.
కలిసి పని చేస్తాం: డీకే శివకుమార్
అందరం కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తమకు సూచించారని, అందుకు తాను అంగీకరించారని డీకే శివకుమార్ అన్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎంగా శివకుమార్‌ను కాంగ్రెస్ ప్రకటించింది. సీఎంగా సిద్ధరామయ్యను ఎంపిక చేసింది. 2024 లోక్‍సభ ఎన్నికల వరకు కాంగ్రెస్ కర్ణాటక అధ్యక్షుడిగా శివకుమార్ కొనసాగనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సిద్ధరామయ్యనే కర్ణాటక సీఎం: కాంగ్రెస్ అధికారిక ప్రకటన
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను ఎంపిక చేసినట్టు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా ఉంటారని పేర్కొంది. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్‍గా కూడా శివకుమార్ కొనసాగుతారని వెల్లడించింది. ఈ వివరాలను కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.
జల్లికట్టుకు సుప్రీం కోర్టు ఓకే
తమిళనాడులో ఎద్దులతో నిర్వహించే ‘జల్లికట్టు’ క్రీడకు సుప్రీం కోర్టు అనుమతించింది. జల్లికట్టును అనుమతించే చట్టాన్ని సమర్థించింది.
మ్యూజియమ్ ఎక్స్‌పోను సందర్శించిన మోదీ
ఢిల్లీ ప్రగతి మైదాన్‍లో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ మ్యూజియమ్ ఎక్స్‌పోను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు సందర్శించారు.
పెళ్లిలోనే విషం తాగిన వధూవరులు
పెళ్లి వేడుకలోనే వధూవరులు విషం తాగారు. ఈ ఘటనలో వరుడు మరణించగా.. వధువు ప్రాణాల కోసం పోరాడుతోంది. మధ్యప్రదేశ్‍లోని ఇండోర్ పట్టణంలో ఈ ఘటన జరిగింది.
న్యాయశాఖ మంత్రిగా కిరణ్ రిజిజు స్థానంలో మేఘ్వాల్
కేంద్ర న్యాయశాఖ మంత్రిగా అర్జున్ రామ్ మేఘ్వాల్ (Arjun Ram Meghwal) నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆ శాఖ మంత్రిగా ఉన్న కిరణ్ రిజిజు (Kiren Rijiju) స్థానాన్ని ఆయన భర్తీ చేయనున్నారు. కిరణ్ రిజిజుకు ఎర్త్ సైన్సెస్ శాఖను కేటాయించింది మోదీ ప్రభుత్వం.
రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి
బస్సు, ట్రాలీ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. 15 మంది గాయపడ్డారు. మధ్యప్రదేశ్‍లోని షజాపూర్ సమీపంలో గురువారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.
లాభాలతో స్టాక్ మార్కెట్లు మొదలు
భారత స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో మొదలయ్యాయి. సెషన్ ఆరంభంలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 96.30 పాయింట్ల లాభంతో 18,278.05 వద్ద, బీఎస్ఈ సెన్సెక్స్ 331.78 పాయింట్లు పెరిగి 61,892.42 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
డీకే శివకుమార్‌ను ఒప్పించిన సోనియా గాంధీ!
కర్ణాటక డిప్యూటీ సీఎంగా ఉండేందుకు డీకే శివకుమార్‌ను ఒప్పించడంలో కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ కీలకపాత్ర పోషించినట్టు తెలుస్తోంది. అంతకు ముందు సీఎం పదవి కోసం పట్టుబట్టిన శివకుమార్.. సోనియాతో మాట్లాడాక వైఖరి మార్చుకున్నట్టు సమాచారం. దీంతో కర్ణాటక ముఖ్యమంత్రి పదవిని సిద్ధరామయ్య చేపట్టేందుకు లైన్ క్లియర్ అయిందని తెలుస్తోంది.
స్టాక్ మార్కెట్లు నేడు సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశం
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో షురూ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం ఎస్‍జీఎక్స్ నిఫ్టీ 61 పాయింట్ల లాభంతో ఉంది.
ఉగ్రదాడి నిందితుడిని ఇండియాకు అప్పగించేందుకు అమెరికా కోర్టు అనుమతి
2008 ముంబై ఉగ్రదాడికి సంబంధం ఉన్న పాకిస్థానీ సంసతికి చెందిన తహావూర్ రాణాను ఇండియాకు అప్పగించేందుకు అమెరికాలోని ఓ కోర్టు అనుమతినిచ్చింది. లాస్ఏంజిల్స్ సెంట్రల్ డిస్ట్రిక్ కోర్టు ఈ తీర్పు చెప్పింది.
బంగారం, వెండి ధరల తగ్గుదల
దేశీయ మార్కెట్‍లో బంగారం, వెండి ధరలు దిగివచ్చాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450 తగ్గి రూ.56,300కు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.490 దిగివచ్చి రూ.61,420కు చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
20న సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం
కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ఈనెల 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పదవిని డీకే శివకుమార్ అంగీకరించారని సమాచారం. చెరో రెండున్నరేళ్లు సీఎంగా ఉండే ప్రతిపాదనకు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ అంగీకరించారని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.