Gold Price Today : గుడ్‍న్యూస్: దిగొచ్చిన బంగారం రేటు.. వెండి కూడా డౌన్: నేటి ధరలు ఇవే
Gold, Silver Rates Today: దేశీయ మార్కెట్‍లో బంగారం ధర బాగా దిగొచ్చింది. వెండి రేటు కూడా తగ్గింది. వివరాలివే..
Gold, Silver Rates Today: బంగారం కొనాలనుకుంటున్న వారికి కాస్త ఉపశమనం లభించింది. గత 24 గంటల వ్యవధిలో గోల్డ్ రేటు దిగొచ్చింది. గురువారం ఉదయానికి.. 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.450 తగ్గి రూ.56,300కు చేరింది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.490 క్షీణించి రూ.61,420కు దిగివచ్చింది. మార్కెట్‍లో వెండి ధర కూడా మోస్తరుగా తగ్గింది. హైదరాబాద్, ఢిల్లీ సహా దేశంలోని వివిధ నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఢిల్లీలో..
Gold Rate Today: దేశ రాజధాని ఢిల్లీ సహా దాదాపు అన్ని సిటీల్లో బంగారం ధర తగ్గింది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.56,450కు చేరింది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల పసిడి ధర రూ.61,570కు దిగొచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
Gold Rate today: హైదరాబాద్‍లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల (తులం) పసిడి ధర రూ.56,300కు దిగివచ్చింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.61,420కు చేరింది. ఆంధ్రప్రదేశ్‍లోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, అనంతపురంలోనూ ఇవే రేట్లు ఉన్నాయి.
ఇతర ప్రధాన నగరాల్లో…
Gold Rate Today: బెంగళూరు, అహ్మదాబాద్ సిటీల్లో 22 క్యారెట్ల అర్నమెంట్ బంగారం 10 గ్రాముల ధర రూ.56,350కు దిగొచ్చింది. 24 క్యారెట్ల మేలిమి పసిడి తులం ధర రూ.61,470కు చేరింది.
Gold Price Today: మహారాష్ట్ర రాజధాని ముంబైలో 22 క్యారెట్ల10 గ్రాముల గోల్డ్ రేటు రూ.56,300కు దిగొచ్చింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,420కు చేరింది. కోల్‍కతాలోనూ ఇవే రేట్లు ఉన్నాయి. చెన్నైలో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.56,700కు చేరింది. 24 క్యారెట్ల తులం పసిడి వెల రూ.61,850కు వచ్చింది.
స్పాట్ గోల్డ్ కూడా డౌన్
Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్‍లోనూ గోల్డ్ రేటు క్షీణించింది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ఔన్సు ధర 1,982 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్ విలువలో స్థిరత్వం, డిమాండ్ కాస్త తగ్గడం, అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం కొలిక్కి వస్తుండడం సహా మరిన్ని అంశాలు ప్రపంచ మార్కెట్‍లో ప్రస్తుతం గోల్డ్ ధరలపై ప్రభావం చూపుతున్నాయి.
తగ్గిన వెండి ధర
Silver Rate Today: పసిడినే వెండి కూడా ఫాలో అయింది. దేశీయ మార్కెట్‍లో వెండి (Silver) ధర కూడా తగ్గింది. కిలో వెండి ధర రూ.500 తగ్గి రూ.74,600కు దిగివచ్చింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం సిటీల్లో కిలో వెండి రేటు రూ.78,200కు చేరింది. ఢిల్లీ, కోల్‍కతా, ముంబైల్లో కిలో వెండి ధర రూ.74,600గా ఉంది.
(గమనిక: ఈ ధరల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణనలోకి తీసుకోలేదు.)