తెలుగు న్యూస్  /  National International  /  Liquor, Fuel To Cost More In Kerala; Social Security Cess Levied

petrol diesel price hike : పెట్రోల్​, డీజిల్​ ధరల పెంపు.. ప్రజలపై కొత్త ‘సెస్​’ భారం!

Sharath Chitturi HT Telugu

03 February 2023, 13:48 IST

  • Petrol diesel price hike in Kerala : పెట్రోల్​, డీజిల్​పై రూ. 2 పెంచింది కేరళ ప్రభుత్వం. కొత్త సెస్​ను ప్రవేశపెట్టింది.

ట్రోల్​, డీజిల్​ ధరల పెంపు
ట్రోల్​, డీజిల్​ ధరల పెంపు (REUTERS)

ట్రోల్​, డీజిల్​ ధరల పెంపు

Petrol diesel price hike in Kerala : రాష్ట్ర ప్రజలపై కేరళ ప్రభుత్వం కొత్త 'సెస్​' భారాన్ని మోపింది. పెట్రోల్​, డీజిల్​పై సోషల్​ సెక్యూరిటీ సెస్​ను విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్​లో పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

Parents sue Serum Institute: కోవి షీల్డ్ తో కూతురి మృతి!; సీరమ్ ఇన్స్టిట్యూట్ పై కేసు వేసిన పేరెంట్స్

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

Crime news: బ్లాక్ మెయిల్ చేసి క్లాస్ మేట్ నుంచి రూ.35 లక్షలు లాక్కున్న టెంత్ క్లాస్ విద్యార్థులు

సోషల్​ సెక్యూరిటీ సెస్​తో కేరళలో పెట్రోల్​, డీజిల్​ ధరలు రూ. 2 పెరిగాయి. తాజా నిర్ణయంతో.. సోషల్​ సెక్యూరిటీ సీడ్​ ఫండ్​ నిర్వహిస్తున్న ప్రభుత్వానికి అదనంగా రూ. 750కోట్ల ఆదాయం లభించనుంది! ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. కాగా.. కేరళలో ఏడాదిగా ధరలు పెరగడం ఇదే తొలిసారి.

Petrol Diesel price in Kerala : కేరళలో ప్రస్తుతం లీటరు పెట్రోల్​ ధర రూ. 105.81గా ఉంది. దేశంలో పెట్రోల్​ ధరలు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో కేరళ ఒకటి. ఇక లీటరు డీజిల్​ ధర రూ. 94.74గా ఉంది.

కేరళ బడ్జెట్​ 2023లో భాగంగా.. దేశీయంగా తయారు చేసిన విదేశీ లిక్కర్​పైనా కొత్త సెస్​ను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. ఫలితంగా మద్యం ధరలు కూడా పెరిగాయి. ఈ పెంచిన ధరలు త్వరలోనే అమల్లోకి రానున్నాయి.

పెట్రోల్​.. డీజిల్​..

Kerala Budget 2023 : కొవిడ్​ అనంతరం పెట్రోల్​, డీజిల్​ ధరలు భారీగా పెరిగాయి. ఇక రష్యా- ఉక్రెయిన్​ యుద్ధంతో చమురు ధరలు రికార్డు స్థాయికి చేరి, అక్కడి నుంచి వెనుదిరిగాయి. దేశంలో మాత్రం గతేడాది ఏప్రిల్​ నుంచి పెట్రోల్​, డీజిల్​ ధరలు మారలేదు. చమురు ధరలు భారీగా పెరిగినా.. ఇండియాలో వాటిని పెంచకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా.. త్వరలోనే దేశవ్యాప్తంగా ఇంధన ధరలు దిగొస్తాయని, కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి హర్దీప్​ సింగ్​ పూరి ఇటీవలే వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో.. కొత్త సెస్​తో ప్రజలపై కేరళ ప్రభుత్వం అధిక భారాన్ని మోపుతుండటం గమనార్హం.

ఓవైపు పెట్రోల్​, డీజిల్​పై కొత్త సెస్​ను విధించి ధరలను పెంచిన కేరళ ప్రభుత్వం.. ఎలక్ట్రిక్​ వాహనాల సేల్స్​ను పెంపొందించే విధంగా చర్యలు చేపట్టింది. ఎలక్ట్రిక్​ మోటార్​ క్యాబ్స్​, ఎలక్ట్రిక్​ టూరిస్ట్​ మోటార్​ క్యాబ్స్​పై వేసే వన్​ టైమ్​ ట్యాక్స్​ను.. కొనుగోలు ధరలో 5శాతానికి తగ్గించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు బడ్జెట్​ 2023లో కీలక ప్రతిపాదన చేసింది కేరళ ప్రభుత్వం.

Petrol price increased in Kerala : కేరళ ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్​ 2023పై విపక్షాలు మండిపడ్డాయి. ప్రజలపై భారాన్ని వేస్తున్న ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశాయి.