Petrol price cut : త్వరలోనే ప్రజలకు గుడ్ న్యూస్.. తగ్గనున్న పెట్రోల్ ధరలు!
Petrol price cut in India : దేశంలో పెట్రోల్ ధరలు తగ్గే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు.
Petrol price cut news today : దేశ ప్రజలకు త్వరలోనే గుడ్ న్యూస్ అందనుంది! దేశంలో త్వరలోనే పెట్రోల్ ధరలు తగ్గే అవకాశం ఉంది. గతంలో ఏర్పడిన నష్టాల నుంచి తేరుకున్న వెంటనే.. ప్రభుత్వ ఆధారిత చమురు సంస్థలు పెట్రోల్ ధరలను తగ్గిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు పెట్రోలియంశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) వంటి ప్రభుత్వ ఆధారిత చమురు సంస్థలు.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను సవరించి 15 నెలలు గడిచిపోయింది. ఇలా జరగడం చాలా అరుదు! ఈ నేపథ్యంలో.. పెట్రోల్ ధరలు తగ్గే అవకాశం ఉందని కేంద్రమంత్రి చెప్పడం ప్రాధాన్యత సంచరించుకుంది.
పెరిగాయి.. తగ్గాయి.. కానీ!
Petrol price cut in India : ద్రవ్యోల్బణం కారణంగా గతేడాది అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి. ముడిసరకు ధరలు సైతం పెరగడంతో దేశీయ చమురు సంస్థలపై ప్రభావం పడింది. అయితే.. అంతర్జాతీయంగా పెరిగిన ధరల కారణంగా పెట్రోల్ విషయంలో చమురు సంస్థలకు లాభాలే వచ్చినప్పటికి, డీజిల్ విషయంలో భారీ నష్టాన్ని చూశాయి. ఆ తర్వాత అంతర్జాతీయంగా ధరలు తగ్గినా.. నష్టాలను కవర్ చేసుకునేందుకు ఇంకా ప్రైజ్ కట్ ప్రకటించలేదు.
"నష్టాల నుంచి బయటపడితే.. ధరలు దిగిరావాలి. పెట్రోల్, డీజిల్ ధరలను సవరించకుండా ఉండాలని చమురు సంస్థలకు ప్రభుత్వం చెప్పలేదు. వారి సొంతంగానే అలా చేశారు," అని హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు.
పెట్రోల్‌పై రూ. 10 లాభం..!
చమురు సంస్థలు ప్రస్తుతం లీటరు పెట్రోల్‌పై రూ. 10 లాభాన్ని అర్జిస్తున్నట్టు తెలుస్తోంది. లీటరు డీజిల్‌పై రూ. 6.5 నష్టపోతున్నట్టు సమాచారం.
Petrol Diesel price in Hyderabad : "2022 జూన్ 24తో ముగిసిన వారంలో.. చమురు సంస్థలు రికార్డు నష్టాన్ని చూశాయి. లీటరు పెట్రోల్‌పై రూ. 17.4, లీటరు డీజిల్‌పై రూ. 27.7 నష్టపోయాయి. ఇప్పుడు పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. 2022 అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో లీటరు పెట్రోల్‌పై చమురు సంస్థలు రూ. 10 లాభాన్ని అర్జించాయి. డీజిల్‌పై నష్టాలు కూడా దిగొచ్చాయి. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో లీటరు డీజిల్‌పై రూ. 6.5 నష్టాన్ని నమోదు చేశాయి," అని ఇటీవలే బయటకొచ్చిన ఓ నివేదిక వెల్లడించింది.
ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ. 109.6గా ఉంది. ఇక లీటరు డీజిల్ ధర రూ. 97.82గా ఉంది. ఢిల్లీలో లీటరు డీజిల్ ధర రూ. 89.62గాను, లీటరు పెట్రోల్ ధర రూ. 96.72గా కొనసాగుతోంది.
సంబంధిత కథనం