తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Let Terror Module Busted In Jk: భారీ ఉగ్ర దాడికి లష్కరే కుట్ర

LeT terror module busted in JK: భారీ ఉగ్ర దాడికి లష్కరే కుట్ర

HT Telugu Desk HT Telugu

22 November 2022, 23:53 IST

  • LeT terror module busted in JK: కశ్మీర్లో భారీ ఉగ్ర కుట్రను భద్రత బలగాలు భగ్నం చేశాయి. ఉగ్రవాదుల నుంచి భారీగా పేలుడు పదార్ధాలను, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. 

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT_PRINT)

ప్రతీకాత్మక చిత్రం

LeT terror module busted in JK: జమ్మూకశ్మీర్లోని బందిపొరా జిల్లాలో లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను, వారికి సహాయకులుగా ఉన్న మహిళ సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా చేసిన ఈ ఆపరేషన్ వల్ల భారీ ఉగ్రదాడి ప్రణాళిక భగ్నమైంది.

ట్రెండింగ్ వార్తలు

Cricket ball : జననాంగాలకు క్రికెట్​ బాల్​ తాకి.. 11ఏళ్ల బాలుడు మృతి!

Houston floods : టెక్సాస్​- హూస్టన్​ని ముంచెత్తిన వరద.. భయం గుప్పిట్లో ప్రజలు

ICSE results 2024 : ఐసీఎస్​ఈ క్లాస్​ 10, ఐఎస్సీ క్లాస్​ 12 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

LeT terror module busted in JK: పెద్ధ ఎత్తున ఆయుధాలు, మందుగుండు

లష్కరే ఉగ్రవాదుల నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను, మందుగుండు సామగ్రిని భద్రత బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. వాటిలో ఒక ఏకే 47, ఒక ఏకే 56, లైవ్ రౌండ్స్, ఆర్డీఎక్స్ పౌడర్, 9 వోల్ట్ బ్యాటరీలు, రిమోట్ కంట్రోల్, లూజ్ వైర్, ఐరన్ పైప్స్, హ్యాండ్ గ్రెనేడ్స్, ఐఈడీలను తయారు చేయడానికి అవసరమైన ఇతర సామగ్రి మొదలైనవి ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సిద్ధం చేసుకున్నారంటే, పెద్ద దాడికే కుట్ర పన్నారని అర్థమవుతోందని భద్రత బలగాలు భావిస్తున్నాయి.

LeT terror module busted in JK: పీఓకే నుంచి..

భద్రత బలగాలు అదుపులోకి తీసుకున్న ఉగ్రవాదులను ఇమ్రాన్ మాజిద్ మీర్ జాఫర్, సురయ రషీద్ వనీ అలియాస్ సెంటీ అలియాస్ తబిష్ గా గుర్తించారు. ఈ ఇద్దరు కూడా స్థానికులే. కాగా, ఈ ఉగ్ర కుట్రను పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న లష్కరే కమాండర్ బాబర్ అలియాస్ సామమ హ్యాండిల్ చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేల్చారు. బాగా రద్దీ ఉన్న ప్రాంతంలో బాంబు దాడులకు పాల్పడాలన్న ప్రణాళికలో వారు ఉన్నట్లు తేలిందన్నారు.