తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Kvs Recruitment: 13 వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్.. దరఖాస్తుల గడువు పొడిగింపు

KVS Recruitment: 13 వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్.. దరఖాస్తుల గడువు పొడిగింపు

HT Telugu Desk HT Telugu

27 December 2022, 12:53 IST

    • KVS Recruitment: ప్రైమరీ టీచర్స్, టీజీటీ, పీజీటీ, నాన్ టీచింగ్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే గడువు పోడిగించినట్టు కేవీఎస్ ప్రకటించింది.
KVS Recruitment: Application deadline for 13,000+ teacher, other posts extended
KVS Recruitment: Application deadline for 13,000+ teacher, other posts extended

KVS Recruitment: Application deadline for 13,000+ teacher, other posts extended

KVS Recruitment: కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) జారీ చేసిన 13 వేల టీచర్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. టీజీటీ, పీజీటీ, ప్రైమరీ టీచర్, నాన్ టీచింగ్ తదితర పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Cricket ball : జననాంగాలకు క్రికెట్​ బాల్​ తాకి.. 11ఏళ్ల బాలుడు మృతి!

Houston floods : టెక్సాస్​- హూస్టన్​ని ముంచెత్తిన వరద.. భయం గుప్పిట్లో ప్రజలు

ICSE results 2024 : ఐసీఎస్​ఈ క్లాస్​ 10, ఐఎస్సీ క్లాస్​ 12 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

తాజా నోటిఫికేషన్ ప్రకారం ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు జనవరి 2 వరకు గడువు పొడిగించారు.

‘కేంద్రీయ విద్యాలయ సంఘటన అధీకృత యంత్రాంగం ఈ నోటిఫికేషన్‌లోని పోస్టులకు దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీని పొడిగించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు డిసెంబరు 26, 2022 వరకు ఉన్న గడువును జనవరి 02, 2023 వరకు పొడిగించడమైంది. వయస్సు, విద్యార్హతలు, అనుభవం తదితర అర్హతలన్నీ యథాతథంగా ఉంటాయి..’ అని తాజా ప్రకటనలో తెలిపింది.

అభ్యర్థులు అర్హతలు, ఇతర వివరాల కోసం కేవీఎస్ జారీచేసిన సమగ్ర నోటిఫికేషన్ చూడొచ్చు. దరఖాస్తు ఫారాలను కేవీసంఘటన్ వెబ్‌సైట్‌లో ఆన్ లైన్ ప్రక్రియ ద్వారా సమర్పించవచ్చు.

కేవీఎస్ రిక్రూట్‌మెంట్ పోస్టుల వివరాలు ఇవే..

ప్రైమరీ టీచర్: 6414

అసిస్టెంట్ కమిషనర్: 52

ప్రిన్సిపాల్: 239

వైస్ ప్రిన్సిపాల్: 203

పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్: 1409

ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్: 3176

లైబ్రేరియన్: 355

ప్రైమరీ (సంగీతం): 303

ఫైనాన్స్ ఆఫీసర్: 6

అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్): 2

అసిస్ట్ సెక్షన్ ఆఫీసర్: 156

హిందీ అనువాదకుడు: 11

సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 322

జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 702

స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2: 54

ప్రైమరీ టీచర్ పోస్టుల నోటిఫికేషన్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. notification for Primary Teacher posts

ఇతర పోస్టుల నోటిఫికేషన్ కోసం కింద క్లిక్ చేయండి.