తెలుగు న్యూస్  /  National International  /  Kerala High Court Stops Distribution On Aravana Prasadam At Sabarimala Temple

Sabarimala Prasadam: శబరిమల ప్రసాదం పంపిణీ నిలిపివేయండి: హైకోర్టు ఆదేశం

12 January 2023, 10:39 IST

    • Sabarimala Aravana Prasadam: శబరిమల ప్రసాదంలో వినియోగించిన యాలకుల్లో క్రిమి సంహారక మందుల ఆనవాళ్లు ఉన్నాయని ల్యాబ్ టెస్టుల్లో తేలటంతో.. పంపిణీని నిలిపివేయాలని కేరళ హైకోర్టు (Kerala High Court) ఆదేశించింది. అయితే యాలకులు లేకుండా ప్రసాదాన్ని గురువారం నుంచి పంపిణీ చేసేందుకు దేవస్థానం బోర్డు నిర్ణయించుకుంది.
Sabarimala Prasadam: శబరిమల ప్రసాదం పంపిణీ నిలిపివేయండి: హైకోర్టు ఆదేశం
Sabarimala Prasadam: శబరిమల ప్రసాదం పంపిణీ నిలిపివేయండి: హైకోర్టు ఆదేశం (HT_Photo)

Sabarimala Prasadam: శబరిమల ప్రసాదం పంపిణీ నిలిపివేయండి: హైకోర్టు ఆదేశం

Sabarimala Temple Aravana Prasadam: శబరిమల ఆలయంలో ‘అరవణ పాయసం’ (Aravana Payasam) ప్రసాదం పంపిణీని నిలిపివేయాలని ట్రావెన్‍కోర్ దేవస్థానం బోర్డు (Travancore Dewasom Board - TDB) ను కేరళ హైకోర్టు (Kerala High Court) ఆదేశించింది. ప్రసాదం తయారీలో వినియోగిస్తున్న యాలకుల్లో (Cardamom) క్రిమిసంహారక మందులు ఉన్నట్టు గుర్తించటంతో హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం, యాలకులు లేకుండా అరవణ ప్రసాదాన్ని తయారు చేసేందుకు ట్రావెన్‍కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయించుకుంది. గురువారం నుంచి యాలకులు లేని అరవణ పాయసాన్ని (Aravana Payasam) పంపిణీ చేస్తామని ప్రకటించింది. పూర్తి వివరాలు ఇవే..

ప్రసాదం నాణ్యతపై ఫిర్యాదులు

Sabarimala Temple Aravana Prasadam: శబరిమల ప్రసాదంపై కొందరు భక్తులు ఫిర్యాదులు చేయటంతో.. నాణ్యత పరీక్షలు చేయాలని అధికారులను కేరళ హైకోర్టు ఆదేశించింది. ప్రసాదం శాంపిళ్లను ల్యాబ్‍లకు పంపారు అధికారులు. రెండు ల్యాబ్‍ల రిపోర్టులు ఇటీవలే వచ్చాయి. అయితే ప్రసాదం (Aravana Prasadam)లో పరిమితికి మించి క్రిమి సంహారక మందుల ఆనవాళ్లు ఉన్నట్టు ల్యాబ్ రిపోర్టుల్లో తేలింది. కొన్ని శాంపిళ్లలో 10కి పైగా రసాయనాల జాడలు లభించాయని రిపోర్టుల్లో ఉంది. వీటిని పరిశీలించిన హైకోర్టు డివిజన్ బెంచ్.. ఇప్పటి వరకు తయారు చేసిన ప్రసాదం పంపిణీని వెంటనే నిలిపి వేయాలని ట్రావెన్‍కోర్ దేవస్థానం బోర్టును ఆదేశించింది. కొత్తగా తయారు చేసే అరవణ ప్రసాదాలను కూడా రెండు రోజుల తర్వాత మళ్లీ ల్యాబ్ టెస్టుకు పంపాలని ఆదేశించింది.

యాలకులు లేకుండానే ప్రసాదం

Sabarimala Temple Aravana Prasadam: కొంతకాలం యాలకులు లేకుండానే అరవణ ప్రసాదాన్ని తయారు చేసి, పంపిణీ చేసేందుకు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయించుకుంది. “గురువారం నుంచి యాలకులు లేకుండా అరవణ ప్రసాదాన్ని పంపిణీ చేస్తాం. సేంద్రియ యాలకులను సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం” అని టీబీడీ ప్రెసిడెంట్ కే.అనంతగోపన్ వెల్లడించారు. భవిష్యత్తులో నాణ్యమైన సేంద్రియ యాలకులను ప్రసాదంలో వినియోగిస్తామని చెప్పారు.

ప్రసాదంలో వినియోగించేవి ఇవే..

Sabarimala Temple Aravana Prasadam : అరవణ ప్రసాద విక్రయం నుంచి ఆలయ బోర్డు (TBD) కు భారీ ఆదాయం వస్తుంది. బియ్యం (Rice), బెల్లం(Jaggery), నెయ్యి(Ghee), యాలకుల(Cardamom)తో ఈ అరవణ పాయసాన్ని తయారు చేస్తారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో ప్రసాదం (Prasadam) ద్వారానే ఆలయ బోర్డుకు 60శాతం ఆదాయం వస్తుంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే సీజన్‍లో ప్లాంట్‍లో రోజుకు లక్ష టిన్నుల ప్రసాదాన్ని తయారు చేస్తారు. ప్రతీ సంవత్సరం నవంబర్, జనవరి మధ్య ప్రతీ రోజు లక్షలాది మంది భక్తులు శబరిమల ఆలయాన్ని సందర్శిస్తారు. మకర విలక్కు (Makara Vilkku) పర్వదినం శబరిమలలో ఎంతో ప్రాముఖ్యమైన రోజుగా ఉంటుంది. ఈనెల 14వ తేదీన మకర విలక్కు ఉంది.